తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తుల్లో ఓ భక్తుడిపై ఓ జేబు దొంగ తన చోర కళానైపుణ్యాన్ని ప్రదర్శించాడు. దాంతో ఆ భక్తుడు అప్రమత్తమైయ్యాడు. వెంటనే కంపార్ట్మెంట్లలోని భద్రత సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాంతో భద్రత సిబ్బంది రంగంలోకి దిగారు.
కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలోని పుటేజ్లను భద్రత సిబ్బంది పరిశీలించి, జేబుదొంగను గుర్తించారు. జేబు దొంగను అదుపులోకి తీసుకుని, భక్తుడి నుంచి కాజేసిన రూ.60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని తిరుమలలోని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడు పాత నేరస్థుడేనని పోలీసులు వెల్లడించారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు సదరు ఎస్ఐ వెల్లడించారు.