
ఇదో ‘పరీక్ష’
జగ్గయ్యపేట : ఒంటినిండా గాయాలతో.. సహాయకుడి సహకారంతో పరీక్ష రాస్తున్న ఈ విద్యార్థి పేరు మాదారపు పూర్ణచంద్రరావు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం ఇతడి స్వగ్రామం.
ఉగాది పండుగ రోజున ద్విచక్ర వాహనంపై డ్రైవింగ్ నేర్చుకునే ప్రయత్నంలో డివైడర్‌కు ఢీకొన్న ప్రమాదంలో తలకు, కుడిచేయికి తీవ్ర గాయాలయ్యాయి. పరీక్ష రాసే పరిస్థితి లేకపోవడంతో చిల్లకల్లు పబ్లిక్ పరీక్షా కేంద్రం ఇన్‌చార్జికి తెలియజేశారు. ఆయన ఆదేశంతో ఆ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి సహాయంతో బుధవారం ఇదిగో ఇలా పరీక్షలు రాశాడు