గూడూరు, న్యూస్‌లైన్: దివంగత మ హానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. పట్టణంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు.
కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడి నుం చి కదిలేది లేదంటూ నినాదాలు చేశా రు. దీంతో కమిషనర్ అక్కడకు రాగా పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయక పోవడంపై పలువురు వృద్ధులు ఆమె ను నిలదీశారు. నెలనెలా కాళ్లరిగేలా తిరుగుతూ పడరానిపాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో పట్టణంలో 5 వేలకు పైగా పింఛన్లను ప్రతినెల 1వ తేదీనే కచ్చితం గా ఇచ్చేవారన్నారు.
పస్తుతం రెండు మూడు నెలలకోసారి కూడా ఇవ్వడంలేదన్నారు. కొన్ని వార్డులకు కలిపి ఒకే చో ట ఇస్తుండటంతో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వారికి వచ్చే పిం ఛన్ ఆటోలకే సరిపోతుందన్నారు. సుమారు వెయ్యి మందికిపైగా అర్హులైన వారు పింఛన్ల కోసం అర్జీలిచ్చినా ఇప్ప టి వరకు పింఛన్లు మంజూరు చేసిన దాఖలా లేదన్నారు. వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల కన్వీనర్లు నాశిన నాగులు, మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి మధురెడ్డి, మాజీ కౌన్సిలర్లు చంద్రయ్య, గురవయ్య, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, నవీన్‌జయకుమార్, రంగారెడ్డి, మల్లిగౌడ్ పాల్గొన్నారు.
పించన్ల కోసం పడిగాపులు
మనుబోలు : పింఛన్ల కోసం లబ్ధిదారులు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. మనుబోలులో మూడు నెలలుగా పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. రెండు నెలల క్రితం వరకు సీఎస్పీ లక్ష్మి పింఛన్లు పంపిణీ చేసేది. వేరే కారణంతో ఆమెను తొలగించడంతో అక్టోబర్‌లో నెల్లూరు నుంచి వచ్చిన డీఆర్‌డీఏ సిబ్బంది ఒక్క రోజు మా త్రమే పింఛన్లు పంపిణీ చేశారు.
దీంతో సగం మందికి గత నెలలో పింఛన్లు అందలేదు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సైతం అందరికీ పింఛన్లు ఇవ్వలేదు. వరుసగా మూడు నెలలు పింఛన్లు తీసుకోకుంటే వారి పింఛన్ రద్దు చేస్తారు. దీంతో తమ పింఛను ఎక్కడ రద్దవుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 2వ తేదీ నుం చి పంచాయతీ కార్యాలయం వద్ద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇంత వరకూ వారి నిరీక్షణ ఫలించలేదు.
పింఛన్ల పంపిణీ ఇలాగేనా?
Published Sat, Nov 9 2013 4:03 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement