బాలికపై లైంగికదాడి కేసులో ముగ్గురి అరెస్టు | Three arrested for sexual assault case | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి కేసులో ముగ్గురి అరెస్టు

Published Mon, Sep 15 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

Three arrested for sexual assault case

ఇబ్రహీంపట్నం : కొండపల్లి ఖిల్లా అడవుల్లో బాలికపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి నమోదైన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సిహెచ్.రాంబాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఆది వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కిలేశపురం గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను  గత బుధవారం స్థానికురాలైన నడకుదిటి నాగమణి ఆటోలో ఖిల్లాకు తీసుకువెళ్లిందని తెలిపారు. ముందుగానే అనుకున్న ప్రకారం ఇద్దరు యువకులకు కబురు చేయగా, వారు అక్కడకు వచ్చారన్నారు.

వారిలో లారీ డ్రైవర్ దామెర్ల ప్రకాష్(21) బాలికను చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడి చేసినట్లుగా తమకు ఫిర్యాదు అందినట్లు సీఐ తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లామన్నారు. ఈ ఘటనకు సంబందించి ప్రకాష్‌పై లైంగికదాడి కేసుతోపాటు నిర్భయ చట్టం కింద కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. లైంగికదాడికి సహకరించిన నాగమణి, కోరా నాగేంద్రబాబులపై కూడా కేసు నమోదు చేశామన్నారు. నిందితులను ఆది వారం అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసులపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement