సాక్షి, ఆదిలాబాద్: బాలికపై లైంగికదాడి చేసి హత్య చేసి న నిందితుడికి నిర్మల్ కోర్టు జీవితఖైదీ, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీస్ అధికారుల వివరాల ప్రకారం.. సోన్ మండల కేంద్రానికి చెందిన తోకల ప్రవీణ్‌కుమార్ మేనకోడలు, అదే గ్రామానికి చెందిన బాలిక (10) ఇద్దరు పాఠశాల మిత్రులు. 16 జూన్ 2018వ తేదీన మధ్యాహ్నం ప్రవీణ్‌కుమార్ ఇంటికి బాలిక వచ్చింది.
ఆ సమయంలో స్నేహితురాలు ఇంట్లో లేకపోవడంతో ప్రవీణ్‌కుమార్ ఎందుకు వచ్చావని బాలికను అడిగాడు. సదరు బాలిక విరోచనాలు అవుతున్నాయని, ఆస్పత్రికి వెళ్లాలని చెప్పింది. దీంతో ప్రవీణ్‌కుమార్ నేను ఆ వైపే వెళ్తున్నాని బైక్‌పై తీసుకెళ్లాడు. అప్పటికే ఆస్పత్రి బంద్ చేయడంతో తిరిగి వస్తుండగా కూచన్‌పెల్లి గ్రామ సమీపంలోని పాతబడిన భవనం వద్దకు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో ఇటుకతో తలమీద దారుణంగా కొట్టడడంతో కిందపడిపోయింది. అనంతరం గొంతు నులిమి హత్య చేసి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు.
బాలిక సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తండ్రి గ్రామంలో గాలించగా ప్రవీణ్‌కుమార్ బైక్‌పై తీసుకుని వెళ్లాడని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ప్రవీణ్‌కుమార్‌పై సోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై సోన్ ప్రేమ్‌దీప్ కేసు నమోదు చేశాడు. విచారణ నిమిత్తం అప్పటి సీఐ రమేష్‌బాబు, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డికి అప్పగించారు. ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేసి చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వై.రామరావు, వై.విశ్వష్‌రెడ్డి 21మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి నేరం రుజువు చేశారు. దీంతో జీవిత ఖైదీ, రూ.2500 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.కర్ణకుమార్ గురువారం తీర్పునిచ్చారు.
ఎస్పీ అభినందనలు..
నేరాలకు పాల్పడితే ఏనాటికై నా శిక్షలు తప్పవని ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు. నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు, కోర్టు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇవి చదవండి: ఓ వ్యక్తి మ్యాట్రిమోనీని అడ్డుపెట్టుకొని మోసాలు..! అసలేం చేశాడంటే?
Comments
Please login to add a commentAdd a comment