శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం కొత్త సంవత్సరం సెలవు రోజు కావడంతో ఐదుగురు స్నేహితులు నాగావళి గోల్కొండ రేవులో స్నానానికి వెళ్లారు.
ముందుగా ఇద్దరు నదిలోకి దిగగా.. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతూ కేకలు వేశారు. దీంతో ఒడ్డున ఉన్నవారిలో మరొకరు నదిలో వారిని కాపాడే ప్రయత్నంలో అతడు కూడా గల్లంతయ్యాడు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు భయంతో అక్కడ నుంచి పారిపోయారు. గల్లంతైన ముగ్గురిలో ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన సోదరులు లోకేష్(14), రాకేష్(13) తో పాటు ముంగవారితోటకు చెందిన హేమచంద్ర (14) ఉన్నారు. విద్యార్థుల గల్లంతుతో స్థానికంగా విషాదం నెలకొంది.