Two missing
-
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి అదృశ్యం
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అదృశ్యమయ్యారు. మొగుడంపల్లి మండలంలోని పడియాల్ తండాకు చెందిన యవకుడితోపాటు అమీన్పూర్ మండలం పటేల్గూడం గ్రామం సుర్యోదయ కాలనీకి చెందిన యువతి అదృశ్యమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. పడియాల్ తండాకు చెందిన యువకుడు.. జహీరాబాద్ టౌన్ : మొగుడంపల్లి మండలం పడియాల్ తండాకు చెందిన యువకుడు అదృశ్యమైనట్లు చిరాగ్పల్లి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పడియాల్ తండాకు చెందిన చౌహన్ భీము కుమారుడైన చౌహన్ జీతులాల్ (22) జహీరాబాద్‌లోని మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారంలో అప్రెంటీస్ చేస్తున్నాడు. ప్రతీ రోజు తండా నుంచి బైక్‌పై కంపెనీకి వచ్చిపోయేవాడు. ఈ నెల 25న యథావిధిగా బైక్‌పై కర్మాగారానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. కానీ రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి తీసుకొచ్చిన బైక్ మొగుడంపల్లిలోని మక్బుల్ టైర్ రిపేరింగ్ షాపు వద్ద పార్కింగ్ చేసి ఉంది. తండ్రి భీము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. పటేల్‌గూడెంలో యువతి.. పటాన్చెరు టౌన్: యువతి అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్పూర్ మండలం పటేల్‌గూడెం గ్రామం సుర్యోదయ కాలనీకి చెందిన పండరీనాథ్ కూతురు అశ్విని బుధవారం ఉదయం 10 గంటలకు షాపింగ్ వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఆమె తండ్రి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యనమదుర్రు డ్రెయిన్‌లో ఇద్దరు గల్లంతు
భీమవరం టౌన్ : భీమవరం పట్టణంలోని యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకి యువతి, యువకుడు గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఓ యువతి బైపాస్ రోడ్డులో వంతెనపై నుంచి యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకింది. ఆ సమయంలో అక్కడే ఉన్న యువకుడు ఆమెను రక్షించేందుకు డ్రెయిన్‌లో దూకాడు. వీరు దూకిన ప్రాంతంలోఊబిలా ఉండటంతో కూరుకుపోయి గల్లంతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూబోట్‌లో గా లింపు చర్యలు చేపట్టారు. కాగా గల్లంతైన యువతి సుంకర పద్దయ్య వీధికి చెందిన పి.సత్యస్వరూప (18)గా అక్కడ ల భించిన ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఐడెంటిటీ కార్డు ద్వారా తెలిసింది. యువకుడు చిన్నఅప్పారావు తోట ప్రాంతానికి చెందిన కనిమిరెడ్డి మహేష్ (25)గా తెలుస్తోంది. యనమదుర్రు డ్రెయిన్‌లో దూకడానికి కొద్ది సమయం ముందు లంకపేట వద్ద వీరిద్దరూ ఘర్షణ పడ్డారని, తర్వాత ఆమె వేగంగా నడుచుకుంటూ వచ్చి వంతెనపై నుంచి దూకిందని తెలుస్తోంది. వెనుకనే మోటార్ సైకిల్‌పై వచ్చిన మహేష్ ఆమెను రక్షించేందుకు డ్రెయిన్‌లో దూకగా ఇద్దరు గల్లంతయ్యా రు. వీరిద్దరూ ప్రేమికులని గతంలో పెద్దలు అభ్యంతరం చెప్పడంతో విడిపోయారని ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్టు మరికొందరు చెబుతున్నారు. దీనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులను వివరణ కోరగా తమకెలాంటి ఫి ర్యాదు అందలేదని చెప్పారు. -
పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు
ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలెం సమీపాన సముద్రంలో పడవ బోల్తా పడింది. సముద్రపు ఆటుపోటులకు మత్స్యకారుల పడవ ఒక్కసారిగా బోర్లా పడటంతో అందులో ఉన్న వారిలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కాకినాడ సూర్యారావుపేటకు చెందిన పి.మహేంద్ర, అప్పారావులుగా గుర్తించారు. పడవలో ఉన్న మిగతా ఐదుగురు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వీరంతా ఈ నెల 8న వేటకు వెళ్లారు. తుపాను కారణంగా పడవ ప్రమాదానికి గురైనట్లు ప్రమాదంలో బయటపడినవారు తెలిపారు. గల్లంతయిన వారి ఆచూకీ కోసం అధికారుల చర్యలు చేపట్టారు. -
హెచ్చెల్సీలో ఇద్దరు గల్లంతు
అనంతపురం సెంట్రల్ : స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి హెచ్చెల్సీలో గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు .... కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన ముత్యాలప్ప కుమారుడు అనిల్‌బాబు(13) అనంతపురంలోని బీసీ హాస్టల్లో ఉంటూ కలెక్టరేట్‌కు సమీపంలోని రాజేంద్ర మునిసిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం తోటి స్నేహితులు మూర్తి, అనిల్‌తో కలిసి గుత్తిరోడ్డు సమీపాన గల హెచ్చెల్సీలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. కాసేపు ముగ్గురు విద్యార్థులు సరదాగా గడిపారు. అనిల్‌బాబుకు ఈతకొట్టడంలో అనుభవం ఉందనే ధీమాతో కాలువ మధ్యలోకి దూకాడు. నీటి ప్రవాహ వేగానికి బయటకు రావడానికి కష్టమైందో.. లేక లోపల రాళ్లు ఏవైనా బలంగా తగిలాయో తెలియదు కానీ అనిల్‌బాబు పైకి రాలేదు. దీంతో కంగారుపడిన స్నేహితులు స్థానికులతో మొరపెట్టుకున్నారు. దీంతో వారు త్రీటౌన్ సీఐ గోరంట్లమాధవ్, ఎస్ఐ రెడ్డప్పకు సమాచారం అందించారు. ఎంత గాలించినా కానరాని జాడ సీఐ మాధవ్, ఎస్ఐ రెడ్డప్ప గజ ఈతగాళ్లతో కలిసి హెచ్చెల్సీవద్దకు చేరుకున్నారు. తాడు సాయంతో సీఐ మాధవ్ నేరుగా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. పొద్దుపోయేంత వరకూ గాలించినా విద్యార్థి ఆచూకి తెలియరాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. మరో యువకుడు.. బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రం మండల పరి«ధిలోని గాయిత్రినగర్కు చెందిన ఓ యువకుడు హెచ్చెల్సీలో గల్లంతైన సంఘటన సోమవారం చోటు చే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గాయిత్రినగర్కు చెందిన వడ్డె ఎరుకులయ్య(35) సోమవారం మద్యం సేవించి హమాలీ కాలనీ వద్ద ఉన్న పీనుగుల బ్రిడ్జి వద్ద కాలువలో స్నానం చేయడానికి వచ్చాడన్నారు. అక్కడ కాలువ వద్ద అందరూ చూస్తుండగానే కాలువలో స్నానం చేయడానికి దిగారు. నీరు వేగంగా వస్తుండటంతో నీటిలో కొట్టుకపోయాడన్నారు. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎరుకులయ్య ఆచూకీ కనిపించ లేదు. -
రిజర్వాయర్‌లో ఇద్దరి గల్లంతు
ఒకరి మృతదేహం లభ్యం మరొకరి ఆచూకీ కోసం గాలింపు చేపల వేట సరదాతో ప్రమాదం ధర్మసాగర్ : సరదా కోసం చేసిన చేపల వేట.. ఆ ఇద్దరు యువకులు రిజర్వాయర్‌లో గల్లంతు కావడానికి కారణంగా మారింది. ఈ ఘటన ధర్మసాగర్లో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ధర్మసాగర్‌కు చెందిన పొలుమారి థామస్ చిన్న కుమారుడు పొలుమారి సృజన్(25), మాచర్ల మల్లయ్య చిన్న కుమారుడు మాచర్ల సునీల్(25), డీజిల్ కాలనీకి చెందిన సందె మోహన్‌లు చిన్ననాటి నుంచి మంచి మిత్రులు. కాగా, సృజన్ నర్సంపేటలో, సందె మోహన్ మిల్స్ కాలనీలో కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. సునీల్ «దర్మసాగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వీరు ముగ్గురు వారాంతంలో కలుసుకునేవారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వీరి ముగ్గురితో పాటు పొలిమారి సృజన్ అన్న పొలిమారి సుమంత్ కలిసి స్థానిక రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహ వేగానికి.. ఈతకొట్టిన అనంతరం పొలిమారి సృజన్, మాచర్ల సునీల్, సందె మోహన్‌లు దోమతెరతో చేపలు పట్టడానికి దేవాదుల పైపులు నీరుపోస్తున్న ప్రదేశంలో నీటిలోకి దిగారు. చేపలు పట్టాలనే తాపత్రయంలో ఒక్కో అడుగు వేస్తూ లోపలికి దిగారు. ఒక్కసారిగా లోతు రావడంతో నీటి ప్రవాహ వేగానికి మాచర్ల సునీల్ కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు సృజన్, మోహన్‌లు యత్నించారు. ఈక్రమంలో సునీల్, సృజన్ గల్లంతయ్యారు. సందె మోహన్ మాత్రం సమీపంలోని ముళ్ల చెట్టును పట్టుకొని జల ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అక్కడే ఉన్న సృజన్ అన్న సుమంత్, స్థానికులు సునీల్, సృజన్‌లను కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కాజీపేట ఏసీపీ జనార్దన్, మడికొండ సీఐ డేవిడ్ రాజ్, ధర్మసాగర్ పీఎస్సై సతీష్ రిజర్వాయర్ వద్దకు చేరుకొని దేవాదుల అధికారులతో ఫోన్లో మాట్లాడి మోటార్ల పంపింగ్‌ను ఆపివేయించారు. అనంతరం స్థానిక జాలర్లతో మృతదేహాల కోసం రిజర్వాయర్‌లోSగాలించగా మాచర్ల సునీల్ మృతదేహం లభ్యమైంది. పొలిమారి సృజన్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఎమ్మెల్యే రాజయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించారు. యువకుడి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరపాక జయాకర్, సర్పంచ్ కొలిపాక రజిత ఉన్నారు. కాగా, పొలుమారి సృజన్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే ఇటీవల ఎస్సై మెయిన్ పరీక్షకు అర్హత సాధించడం గమనార్హం. -
నాగావళి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
-
నాగావళి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం కొత్త సంవత్సరం సెలవు రోజు కావడంతో ఐదుగురు స్నేహితులు నాగావళి గోల్కొండ రేవులో స్నానానికి వెళ్లారు. ముందుగా ఇద్దరు నదిలోకి దిగగా.. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతూ కేకలు వేశారు. దీంతో ఒడ్డున ఉన్నవారిలో మరొకరు నదిలో వారిని కాపాడే ప్రయత్నంలో అతడు కూడా గల్లంతయ్యాడు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు భయంతో అక్కడ నుంచి పారిపోయారు. గల్లంతైన ముగ్గురిలో ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన సోదరులు లోకేష్(14), రాకేష్(13) తో పాటు ముంగవారితోటకు చెందిన హేమచంద్ర (14) ఉన్నారు. విద్యార్థుల గల్లంతుతో స్థానికంగా విషాదం నెలకొంది. -
కామవరం వాగు ప్రమాదం; ఆరుకు పెరిగిన మృతులు
-
గల్లంతైన ఇద్దరు మృతదేహాలు లభ్యం
-
పుణ్య స్నానానికి వెళ్లి ఇద్దరి గల్లంతు
వరంగల్: పుణ్య స్నానానికి వెళ్లి ఇద్దరు భక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో శనివారం చోటు చేసుకుంది. మండలంలోని శింగారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సమీపంలోని గోదావరిలో స్నానానికి వెళ్లారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకు పోయారు. వీరి ఆచూకీ కోసం స్థానికులు గాలిస్తున్నారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఏటూరు నాగారం)