
అశ్విని
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అదృశ్యమయ్యారు. మొగుడంపల్లి మండలంలోని పడియాల్ తండాకు చెందిన యవకుడితోపాటు అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడం గ్రామం సుర్యోదయ కాలనీకి చెందిన యువతి అదృశ్యమయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
పడియాల్ తండాకు చెందిన యువకుడు..
జహీరాబాద్ టౌన్ : మొగుడంపల్లి మండలం పడియాల్ తండాకు చెందిన యువకుడు అదృశ్యమైనట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పడియాల్ తండాకు చెందిన చౌహన్ భీము కుమారుడైన చౌహన్ జీతులాల్ (22) జహీరాబాద్‌లోని మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారంలో అప్రెంటీస్ చేస్తున్నాడు. ప్రతీ రోజు తండా నుంచి బైక్‌పై కంపెనీకి వచ్చిపోయేవాడు.
ఈ నెల 25న యథావిధిగా బైక్‌పై కర్మాగారానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. కానీ రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి తీసుకొచ్చిన బైక్ మొగుడంపల్లిలోని మక్బుల్ టైర్ రిపేరింగ్ షాపు వద్ద పార్కింగ్ చేసి ఉంది. తండ్రి భీము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
పటేల్‌గూడెంలో యువతి..
పటాన్‌చెరు టౌన్: యువతి అదృశ్యమైన సంఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడెం గ్రామం సుర్యోదయ కాలనీకి చెందిన పండరీనాథ్ కూతురు అశ్విని బుధవారం ఉదయం 10 గంటలకు షాపింగ్ వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది.
కానీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఆమె తండ్రి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జీతులాల్
Comments
Please login to add a commentAdd a comment