పుణ్య స్నానానికి వెళ్లి ఇద్దరు భక్తులు గల్లంతయ్యారు.
వరంగల్: పుణ్య స్నానానికి వెళ్లి ఇద్దరు భక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో శనివారం చోటు చేసుకుంది. మండలంలోని శింగారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సమీపంలోని గోదావరిలో స్నానానికి వెళ్లారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకు పోయారు. వీరి ఆచూకీ కోసం స్థానికులు గాలిస్తున్నారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(ఏటూరు నాగారం)