పార్టీ నుంచి గండి బాబ్జీని బహిష్కరిస్తాం | throght out the party from gandi babji | Sakshi
Sakshi News home page

పార్టీ నుంచి గండి బాబ్జీని బహిష్కరిస్తాం

Published Wed, Jun 22 2016 4:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

throght out   the party  from gandi babji

జిల్లా టీడీపీ కార్యదర్శి బంగారు నాయుడు

 

సబ్బవరం (పెందుర్తి) : ఇటీవల టీడీపీలో చేరిన పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి.. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ పరువు తీస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తమరాన బంగారు నాయుడు హెచ్చరించారు. సబ్బవరంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొగలిపురంలో ఆర్మీ ఉద్యోగి గురి సతీష్ కుటుంబానికి చెందిన 0.19 సెంట్ల భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా వారిపై భౌతిక దాడులకు బాబ్జి తెగబడుతున్నారని ఆరోపించారు. గతేడాది గంటి సాగు సీజన్‌లో దౌర్జన్యం చేశారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో సతీష్ కుటుంబం బాబ్జిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా గురి దేముడమ్మ ఆ భూమిలో గంటి సాగుకు పూనుకోగా బాబ్జితోపాటు ఆయన తమ్ముడు జి.రవికుమార్, లాలం అర్జున, మురళి, బి.రమేష్, జి.శ్రీను, బి.గణేష్ కలిసి వారిపై దాడికి పాల్పడడమే కాకుండా పంటను ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు.

మొగలిపురంలో భూములు అమ్మాలన్నా కొనాలన్నా గండి బాబ్జి అనుమతి ఉండాలన్న ఆంక్షలు పార్టీ క్రమశిక్షణకు విఘాతమని చెప్పారు. నేరప్రవృత్తి కొనసాగించే బాబ్జి తీరు ఇకనైనా మారాలని, లేకుంటే జిల్లా టీడీపీ అధ్యక్షుడికి ఫిర్యాదు చే సి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement