నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం గూడలిలో పిడుగుపాటుకు 200 పావురాలు చనిపోయాయి. బుధవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గూడలి పడమర వీధిలో ఉన్న జనార్దనస్వామి ఆలయం గాలిగోపురంపై పిడుగుపడింది. దీంతో గాలిపోపురంలో తలదాచుకున్న సుమారు 200 పావురాలు మృత్యువాత పడ్డాయి.
గురువారం తెల్లవారే సరికి ఆలయ పరిసరాల్లో పావురాల కళేబరాలు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గ్రామస్తుల గుర్తించారు. గతంలోనూ ఈ ఎత్తైన ఆలయం శిఖరంపై పిడుగులు పడిన సందర్భాలున్నాయి.