పెద్దపులి ప్రత్యక్షం | Tigers On Highway | Sakshi
Sakshi News home page

పెద్దపులి ప్రత్యక్షం

Published Tue, Mar 27 2018 10:01 AM | Last Updated on Tue, Mar 27 2018 10:01 AM

Tigers On Highway - Sakshi

పొదల్లో పొంచి ఉన్న పెద్దపులి

ఆత్మకూరు రూరల్‌: ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పెద్దపులుల సంఖ్య బాగా పెరిగిందని ఇటీవల జరిగిన పులుల అంచనా సర్వే తెలియజేస్తోంది. దీనికి నిదర్శనమా అన్నట్లుగా ఇంతకుముందు పులుల సంచారం అసలే లేని వెలుగోడు సౌత్‌ బీట్, నార్త్‌ బీట్లలో ఇటీవల తరచూ ప్రత్యక్షమవుతున్నాయి. వెలుగోడు – నల్లకాల్వ కనుమ ప్రధాన రహదారిపై రాత్రి పూట పలుమార్లు వాహనదారులకు కన్పిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో లాల్మాన్‌ కుంట సమీపాన పెద్దపులి ఒకటి రోడ్డుదాటుతూ కనిపించింది. తొలుత రోడ్డు పక్కన పొదల్లో పొంచి ఉన్న పులి.. ఆ తరువాత మెల్లిగా రోడ్డు దాటింది. తన వాహనంలో ఉండి గమనించిన పాములపాడుకు చెందిన ఆర్‌ఎస్‌ గోపాల్‌ అనే వ్యక్తి దాని కదలికలను సెల్‌ఫోన్‌లో బంధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement