వెంకటాపురం(కె): అడవుల్లో పెద్ద పులులు, చిరుత పులులు వన్యప్రాణులు ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయో గుర్తించేందుకు అటవీశాఖ ప్రత్యేక సర్వేను చేపట్టింది. వెంకటాపురం అటవి డివిజన్ పరిధిలోని 70 బీట్లలో 62 మంది అటవీ శాఖ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బంది, డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి అడవుల్లోకి వెళ్లి జంతువుల అడుగులను, వాటి ఆనవాళ్లను పసిగడుతున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు మాంసాహార జంతువుల వివరాలను సేకరిస్తున్నామని, వాటి పాదముద్రల ఆధారంగా సాంకేతిక సాయంతో జంతువులను లెక్కిస్తున్నట్లు అటవీశాఖ అధికారి డోలి శంకర్ తెలిపారు. జంతువుల పాద ముద్రలు, మలమూత్ర విసర్జన, చెట్లను పట్టుకోవటం, నేలను గీరటం తదితర ప్రాంతాల్లో వివరాలు సేకరిస్తున్నారు.
కాగా వాజేడు మండలంలోని బొగత జలపాతంపై ప్రాంతంలో చిరుతపులి అడుగులను గుర్తించి వివరాలను సైతం నమోదు చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కవగా శాఖాహార జంతువులైన కొండగొర్రెలు, చుక్క దుప్పులు, అడవి కుక్కలు, సాంబారు తదితర రకాలైన వన్యప్రాణులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గతంలోనే తెలిసింది. ఈ సారి మాత్రం సాంకేతికంగా పులులు, వన్య ప్రాణుల మల,మూత్రాలను సేకరించి వాటికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వాటి సంఖ్యను లెక్కించనున్నారు. పులులు, వన్యప్రాణుల గణనతోపాటు వాటి అనుకూల, ప్రతికూల నివాస పరిస్థితులు, నీరు, ఆహార లభ్యత తదితర భౌగోళిక పరిస్థితులను సైతం వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment