
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 4 కంపార్లుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు 5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 56 ఖాళీ.
రూ.50 గదులు 13 ఖాళీ.
రూ.100 గదులు - 101 ఖాళీగా ఉన్నాయి.
రూ.500 గదులు 15 ఖాళీగా ఉన్నాయి.
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 134 ఖాళీగా ఉన్నాయి.
సహస్ర దీపాలంకరణసేవ - 244 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం - 45 ఖాళీగా ఉన్నాయి.
బుధవారం ప్రత్యేకసేవ - సహస్ర కలశాభిషేకం.