రెండురోజులు తిరుమల ఆలయం మూసివేత | Tirumala Temple Will Be Closed Two Days For Solar Eclipse | Sakshi
Sakshi News home page

ఆ రెండురోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

Published Fri, Dec 20 2019 12:48 PM | Last Updated on Fri, Dec 20 2019 1:57 PM

Tirumala Temple Will Be Closed Two Days For Solar Eclipse - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం రెండురోజులు మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25, 26వ తేదీల్లో 13 గంటలపాటు ఆయల తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసేస్తారు. డిసెంబరు 26న గురువారం నాడు ఉదయం 8.08 గంటల నుంచి 11.06 వరకు సూర్యగ్రహణం జరగనుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అంటే బుధ‌వారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత తలుపులు తెరిచి ఆలయ శుద్ధి చేపడుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు యథావిధిగా భక్తులకు సర్వదర్శనం ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement