- ఏపీ సీఎంపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: చేతిలో అధికారం ఉంది కదా అని కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వెలసిన తిరుమలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. బాబు సొంత సంస్థ ‘హెరిటేజ్’ ఉత్పత్తులను దేవదేవుని సన్నిధి తిరుమలలో అమ్ముకోవడానికి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఆగమేఘాలపై ఎలా అనుమతులిచ్చిందని ప్రశ్నించారు.