ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం కోటా! | To 3 per cent quota for handicaps employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం కోటా!

Published Sat, Aug 9 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

ఉద్యోగాల్లో వికలాంగులకు  3 శాతం కోటా!

ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం కోటా!

కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
 
 న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ దిశగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే అంశంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తవర్‌చంద్ గెహ్లట్, సిబ్బంది, శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేందర్‌సింగ్‌తో ఆయన శుక్రవారం చర్చలు జరిపారు.

అంతకుముందు ఆల్ ఇండియా డిసేబుల్డ్ రైట్స్ ఫోరమ్, హెలెన్ కెల్లర్ రీజినల్ అసోసియేషన్ ఆఫ్ డిసేబుల్డ్ సంస్థల ప్రతినిధుల బృందం వెంకయ్యనాయుడిని కలిసింది. వికలాంగులకు తక్షణం మేలు చేకూర్చేలా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement