కసరత్తు చేసిన తర్వాతే పెద్ద నోట్ల రద్దు | Union Minister Hans Raj Gangaram comments | Sakshi
Sakshi News home page

కసరత్తు చేసిన తర్వాతే పెద్ద నోట్ల రద్దు

Published Mon, Nov 28 2016 3:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కసరత్తు చేసిన తర్వాతే పెద్ద నోట్ల రద్దు - Sakshi

కసరత్తు చేసిన తర్వాతే పెద్ద నోట్ల రద్దు

కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారాం
 
 సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని నిరోధించడానికి, అవి నీతిని అంతమొందించడానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయా న్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్‌‌సరాజ్ గంగారాం అహిర్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందుగా పెద్ద చర్చలు, కసరత్తును ప్రధాని మోదీ చేశారన్నారు. నల్ల వ్యాపారాన్ని అరికట్టడంవల్ల అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు చాలా అవకాశం వచ్చిందన్నారు. నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి, కొత్తగా ఉద్యోగ అవకాశాలు రావడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. నోట్ల రద్దుతో కశ్మీర్‌లోనూ ఉగ్రవాదం తగ్గిపోరుుందన్నారు. దేశంలో చాలా బ్యాంకుల్లో నగదు మార్పిడితో సామాన్యులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మోదీ చెప్పిన 50 రోజుల సమయంలోగా సమస్యలన్నీ తీరుతాయన్నారు. నగదు రహిత వ్యవహారాలను పెంచ డం ద్వారా మరింత నియంత్రణ చేస్తామన్నారు. తెలం గాణ ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసిందన్నారు.

 కాజీపేట దర్గాలో పూజలు...
 కాజీపేట రూరల్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని హజ్రత్ సయ్యద్‌షా అఫ్జల్ బియాబానీ దర్గాను హన్స్‌రాజ్ ఆదివారం సందర్శించారు. ఈ దర్గాలో నాలుగు రోజుల ఉర్సు ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యారుు. ఈ సందర్భంగా మంత్రి చాదర్ సమర్పిం చారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన అక్కడకు వచ్చిన భక్తులు, ముస్లిం మత పెద్దలుతో పెద్ద నోట్లు రద్దు వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement