న్యూస్‌లైన్, నిజామాబాద్ అర్బన్: జిల్లాలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రబీ సీజన్‌లో 2.52 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటి సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. ఈ ఏడాది నూతనంగా ఐదు తాగునీటి పథకాలకు రూ. 56 కోట్లు మంజూరయ్యాయన్నారు.
ఇందిర జీవిత బీమా, వైఎస్‌ఆర్ అభయ హస్తం, జనశ్రీ బీమా యోజన అమలులో రాష్ర్టంలో జిల్లా అగ్రస్థానంలో ఉందని, బంగారుతల్లి పథకంలో మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ లక్ష్యాన్ని మార్చిలోగా చేరుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పదో తరగతిలో జిల్లా స్థానాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జలాశయాలు కళకళ
ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనందున జలాశయాలు కళకళలాడుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రబీలో పూర్తిస్థాయిలో నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సాగునీటికి సంబంధించి
రబీ సీజన్‌లో 2 లక్షల 52 వేల ఎకరాలకు నీరందించడం కోసం చర్యలు
జిల్లాలోని 42 ఎత్తిపోతల పథకాల ద్వారా 56 వేల ఎకరాలకు నీటి వసతి
రెంజల్ మండలంలో రూ. 14 కోట్ల 40 లక్షలతో చేపట్టే కందకుర్తి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. దీని ద్వారా 3,366 ఎకరాలకు నీరు..
నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల ఆధునికీకరణకోసం ఇప్పటివరకు రూ. 300 కోట్ల 19 లక్షలు ఖర్చు
కౌలాస్ నాలా ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సౌకర్యార్థం రూ. 3 కోట్ల 20 లక్షలతో చేపట్టే డోన్‌గావ్ -శక్తినగర్ మధ్య వంతెన నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి
వ్యవసాయ రంగానికి
రబీ సీజన్‌లో వెయ్యి కోట్ల రూపాయల పంట రు ణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్ప టికి రూ. 565 కోట్ల పంట రుణాలను అందించాం.
యంత్రలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీపై రూ. 4 కోట్ల 32 లక్షల విలువైన ఆధునిక యంత్ర పరికరాలను సరఫరా చేశాం.
ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు 2.8 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల విత్తనాలు పంపిణీ చేశాం. ఇందులో రాయితీపై 73 వేల క్వింటాళ్ల విత్తనాలు ఇచ్చాం.
{V>Ò$× విత్తనోత్పత్తి పథకం కింద రూ. 46.66 లక్షల విలువ చేసే 2,340 క్వింటాళ్ల మూల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందించాం.
159 మంది పసుపు రైతులకు రూ. 2.38 కోట్ల విలువ చేసే స్టీమ్ బాయిలింగ్ యం త్రాలను పంపిణీ చేశాం.
బీఆర్‌జీఎఫ్ నిధులు రూ. 10 కోట్లతో జిల్లా లో 58 గోదాములు నిర్మిస్తున్నాం. ఇందులో ఏడు నిర్మాణాలు పూర్తయ్యాయి.
తాగునీటికి
202 గ్రామాలలో తాగునీటి సమస్య తీర్చడం కోసం రూ. 12 కోట్ల 51 లక్షలతో చేపట్టిన ఏక గ్రామ తాగునీటి పథకాలు పూర్తయ్యాయి.
470 గ్రామాల్లో రూ. 34 కోట్ల 29 లక్షలతో పనులు జరుగుతున్నాయి.
ఒకటి కంటే ఎక్కువ గ్రామాల తాగునీటి పథకం కింద రూ. 146.75 కోట్లతో 36 పను లు చేపట్టగా, ఇప్పటికి రూ. 8 కోట్లకు సం బంధించి ఆరు పనులు పూర్తయ్యాయి. మిగ తా పనులను మార్చినాటికి పూర్తి చేస్తాం.
ఈ ఏడాది జిల్లాకు ఐదు తాగునీటి పనులకు సంబంధించి రూ. 56 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా 80 గ్రామాలకు తాగునీరు అందిస్తాం.
నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.232 కోట్లతో పనులు సాగుతున్నాయి.
వివిధ పథకాలు
బంగారుతల్లి పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో ఉంది.
జిల్లాలో 9,479 మం ది ఈ పథకం కోసం నమోదు చేసుకోగా 7,647 మంది చిన్నారులకు సంబంధిం చిన బ్యాంకు ఖాతాలలో 1.91 కోట్ల రూపాయలు జమ చేశాం.
ఇందిర జీవిత బీమా, వైఎస్‌ఆర్ అభయ హస్తం, జనశ్రీ బీమా యోజనలో జిల్లా అగ్రస్థానంలో ఉంది.
గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన మూ డో విడత రచ్చబండలో 57,812 మందికి రేషన్ కార్డులు, 38,674 మందికి పెన్షన్లు, 11,553 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి.
ఇప్పటివరకు జిల్లాలో 1 లక్షా 46 వేల 270 వ్యక్తిగత మరుగుదొడ్డి యూనిట్లు మంజూరు చేశాం. ఇందులో 18 వేల యూనిట్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 18 వేలు యూనిట్లు పురోగతిలో ఉన్నాయి. వీటిపై రూ. 16.6 కోట్లు ఖర్చు చేశాం.
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం కోసం రూ. 32.50 కోట్లు మం జూరయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కోసం రూ. 93 లక్షలతో 579 పనులు చేపట్టగా రూ. 88 లక్షలకు సంబంధించిన 556 పనులు పూర్తయ్యాయి.
ఆధార్‌తో అనుసంధానం
జిల్లాలో నగదు బదిలీ పథకం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
23,49,337 తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులలో 13,37,473 మంది ఆధార్ వివరాలు సమర్పించారు.
3,79,337 ఎల్‌పీజీ కనెక్షన్లు ఉండగా 2,79,306 మంది ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.
5,48,668 మంది ఉపాధి హామీ కూలీల కుగాను 4,60,880 కూ లీలు ఆధార్ వివరాలు నమోదు చేసుకున్నారు.
పోస్టు మెట్రిక్ స్కాల ర్‌షిప్‌లకు 77,244 మంది అర్హులుండగా 76,667 మంది ఆధార్ వివరాలు సమర్పించారు.
2,84,165 మంది పింఛన్‌దారులకుగాను 2,13,286 మంది వివరాలను ఆధార్‌తో అనుసంధానించాం.
సంక్షేమం
జిల్లాలోని 127 హాస్టళ్లలో 42 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వసతి కల్పించాం.
2013-14 సంవత్సరానికిగాను 1.20 లక్షల మంది విద్యార్థులకు రూ. 85 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్ ఫీజులు చెల్లించాం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు 6,447 యూనిట్లు మంజూరు చేసి, రూ. 32.16 కోట్ల రుణాలు అందించాలన్నది లక్ష్యం.
ఇప్పటికి 759 యూనిట్లకు సంబంధించి రూ. 2.23 కోట్ల రుణాలు ఇచ్చాం.
ఎస్సీ సబ్‌ప్లాన్ కింద అద్దె భవనాలలో కొనసాగుతున్న హాస్టళ్లకు నూతన భవనాల నిర్మాణం నిమిత్తం రూ. 105 కోట్లు, భవనాల మరమ్మతుల కోసం రూ. 2.70 కోట్లు మంజూరు చేశాం.
ఎస్సీల ఇళ్లకు సంబంధించి విద్యుత్ బిల్లులు రూ. 13.76 కోట్లు మాఫీ చేశాం.
ఏడో విడత భూపంపిణీలో భాగంగా 163 మంది లబ్ధిదారులకు 182 ఎకరాల భూమిని పంపిణీ చేయడం కోసం చర్యలు తీసుకున్నాం.
ఇందిరమ్మ ఇళ్లు
జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 56,667 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మార్చినాటికి 19,621 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇప్పటికి 8,663 నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఇందిరమ్మ లేఅవుట్ కాలనీల్లో రూ. 32 కోట్ల 62 లక్షలతో మౌలిక సదుపాయలు కల్పిస్తున్నాం.
విద్యారంగం
ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితా లు సాధించడం కోసం కృషి చేస్తున్నాం.
మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి 1,647 వంట శాలల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, ఇప్పటికి 926 నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఉర్డూ మీడియం పాఠశాలలలో 274 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాం.
జిల్లాలో 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలుండగా రూ. 23.75 కోట్లతో 19 విద్యాలయాలకు భవనాలు నిర్మిస్తున్నాం. పది భవనాల నిర్మాణం పూర్తయ్యింది.