అంబరమంటేలా.. సంబురాలు
ప్రజల చిరకాల వాంఛ నెరవేరే క్షణం కొద్ది గంటల్లో రాబోతోంది. దశాబ్దాల పోరాటం రాష్ట్రంగా రూపుదిద్దుకోబోతోంది. త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబోతోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచే సంబురాలు అంబరమంటేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్‌రావులు రెండు రోజులుగా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జూన్ రెండో తేదీ.. తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దీనికి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. సోమవారం ఉదయం 8.45 గంటల కు కలెక్టర్ ప్రద్యుమ్న జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించి సంబురాలను ప్రారంభిస్తారు. తెలంగా ణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా వారం పాటు కలెక్టరేట్ మైదానంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులు, రచయితలు, ప్ర ముఖులను సన్మానించనున్నారు. గ్రామాల్లోనూ సంబురాలు నిర్వహించనున్నారు.
సంబురాలకు పార్టీలు..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సర్వసన్నద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయబోతున్న టీఆర్‌ఎస్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేసింది. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యకర్తలను సమాయత్తం చేశారు. జిల్లాను పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో గులాబీమయం చేస్తున్నారు.
ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లా నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు సైతం జిల్లాలో ఆవిర్భావ వేడుకలను భారీగా జరపాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లా వ్యా ప్తంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు బీజేపీ, టీడీపీలు కూడా స మాయత్తమయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాలతో పాటు తెలంగాణవాదులు ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందకు సిద్ధమయ్యారు.