రామచంద్రాపురం, న్యూస్‌లైన్: అందరూ అప్రమత్తంగా ఉంటే అగ్నిప్రమాదాలను సులువుగా నివారిం చవచ్చని అగ్నిమాపకదళం అధికారులు పేర్కొంటున్నారు. అయితే అగ్నిమ్రాదాలను ఏలా నియంత్రించవచ్చో విద్యార్థులకు మాక్‌డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. రామచంద్రాపురం, సదాశివపేటలోని పాఠశాలల్లో మంగళవారం విద్యార్థులకు అగ్నిప్రమాదాల గురించి అధికారులు వివరించారు.
రామంచద్రాపురంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయస్థాయి ప్రత్యక్ష ప్రదర్శనను అగ్నిమాపకదళం నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపకదళం అధికారి చంద్రారెడ్డి మాట్లాడుతూ మానవలోప కారణంగానే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదం జరిగినపు డు మంటల్ని ఎలా ఆర్పాలి, ప్రాణరక్షణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్‌డ్రిల్‌తో వివరించారు. భవనం పైభాగాన పొగల్లో చిక్కుకున్న విద్యార్థులకు తాళ్ళు ద్వారా ఎలా తీసుకునివచ్చేది ప్రదర్శిం చారు.
ఎల్‌పీజీ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడకాన్ని కూడా వివరించా రు. విపత్తులు రెండు రకాలుగా ఉంటాయని ప్రకృతి మూలంగా, మనుషుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతాయన్నా రు. ఈ ప్రదర్శనలను విద్యార్ధులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వీరాగౌడ్, అగ్నిమాపకదళ సిబ్బంది నర్సయ్య, ఎక్బాల్, అంజయ్య, ఆంజనేయులు, నరేశ్, యాదగిరి, పాపాయ్య, దేవదానం, అన్వర్ తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు అవగాహన అవసరం
సదాశివపేట: విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ గురించి అవగాహన చాలా అవసరమని పట్టణ అగ్నిమాపక అధికారి సైదులు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని విజ్ఞాన్ పాఠశాలలో విద్యార్ధులకు అగ్ని ప్రమాదాల నివారణ గురించి అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ముందుగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని సూచించారు.
అదేవిధంగా నివారణ చర్యల గురించి సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సిబ్బంది మానిక్‌రావు, సుదర్శన్, నరేష్, ప్రవీన్‌కుమార్, శ్రీనివాస్‌లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ, కరస్పాండెంట్ శంకర్‌గౌడ్, పీఈటీ బుచ్చిరెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తతతోనే ప్రమాదాలు దూరం
Published Wed, Jan 22 2014 1:05 AM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM
Advertisement