Chandra Reddy
-
ఫోన్ స్విచ్ ఆఫ్.. పరారీలో బోండా ఉమా !
-
వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోస్‌చంద్రారెడ్డిపై శనివారం రాత్రి కొందరు దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యుడిని కత్తితో పొడిచేందుకు యత్నించడంతోపాటు అతని కారును కాల్చివేసేందుకు వేసిన పథకం విఫలమైంది. ఈ ఘటనలో కత్తితో సహా ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాజీ పీఆర్వో సతీష్, ఓ సినీ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్‌చక్రవర్తి సూచనల మేరకే ఈ ఘటనకు పాల్పడినట్లు పట్టుబడిన వ్యక్తి మీడియాతో చెప్పడం విశేషం. బాధితుడు బోస్‌చంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సతీష్, సునీల్‌చక్రవర్తి గతంలో బోస్‌చంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్ మౌనిష్రెడ్డితో గొడవపడ్డారు. ఓ భూమి, షాపు విషయంలోనూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్‌తో సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో బోస్‌చంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్న సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన హేమంత్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో శనివారం రాత్రి హేమంత్ మరో ఐదుగురు కలిసి రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాటిల్స్‌తో మారుతీనగర్‌లోని బోస్‌చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించి.. జన సంచారం ఉండటంతో ఆఖరి నిమిషంలో పరారయ్యారు. అనంతరం మళ్లీ రాత్రి 11 గంటలకు ఇలానే దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు మళ్లీ కత్తులు, రాడ్లు, పెట్రోల్‌తో దాడికి రావడంతో వారిపై బోస్‌చంద్రారెడ్డి అనుచరులు తిరగబడ్డారు. హేమంత్ కత్తితో సహా పట్టుబడగా.. మిగిలినవారు పారిపోయారు. అతన్ని పట్టుకుని విచారించిన బోస్‌చంద్రారెడ్డి వర్గీయులు, రంగంపేటలోనూ మరో బ్యాచ్ ఉన్నారని చెప్పడంతో కారులో అతన్ని ఎక్కించుకుని రంగంపేటకు వచ్చారు. అప్పటికే వారు కూడా పారిపోయారు. ఈ హత్యాయత్నానికి సతీష్ కీలకసూత్రధారి అని, అతనే బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలపై దాడి చేయమన్నారని, దీనిలో సునీల్‌చక్రవర్తి పాత్ర కూడా ఉందని హేమంత్ మీడియాకు తెలిపాడు. హత్యచేయడం లక్ష్యం కాదని, కారును కాలి్చవేసి భయపెట్టాలని యత్నించినట్టు చెప్పాడు. నిందితులకు సతీష్ ఫోన్‌పే ద్వారా నగదు పంపించడం, అర్ధరాత్రిళ్లు కూడా సునీల్‌చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతుండటంతో బాధితులు నిజనిర్ధారణకు వచ్చారు. హేమంత్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగిన ప్రదేశం తిరుపతి యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో బోస్‌చంద్రారెడ్డి అక్కడే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, కొన్ని మీడియాల్లో సినీనటులు మోహన్‌బాబు, విష్ణువర్ధన్బాబుపై అసత్య ప్రచారం చేయడాన్ని బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలు ఖండించారు. చంద్రగిరిలో విలేకరుల సమావేశం పెట్టి జరిగిన ఘటనలతో వారికి ఎలాంటి సంబంధం లేదని, అసత్యప్రచారాలు మానుకోవాలని స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డితోపాటు గ్రామస్తులు ధర్నా చేశారు. -
తేనెటీగల ‘చంద్రారెడ్డి’
రాజాపురం(పాల్వంచ రూరల్) : వ్యవసాయ కుటుంబమే అయినా సాగుపై అవగాహన లేదు.. అయినా సేంద్రియ సాగుపై మక్కువ పెంచుకున్నాడు.. తనకున్న భూమిలో పూల మొక్కలు.. కూరగాయలు పండించడం.. చేపల పెంపకం చేపట్టాడు.. దిగుబడి రాకున్నా నిరాశ చెందలేదు.. మలి ప్రయత్నంలో రకరకాల చేపల పెంపకంతోపాటు తేనెటీగల పెంపకం నిర్వహిస్తున్నాడు. ఒక దశకు వచ్చిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ.. తేనె ద్వారా మంచి లాభాలు గడిస్తున్నాడు ఖమ్మం జిల్లా రాజాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కందుల చంద్రారెడ్డి. అనంతపురం నుంచి తెచ్చిన నైజీరియా తేనెటీగల ట్రేలను తెచ్చి ఇంటి పరిసరాల్లో వాటిని పెంచుతున్నాడు. విషయం తెలిసిన పలువురు రైతులు వాటి పెంపకం గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారు. తేనెటీగల్లో నాలుగు రకాలు కొండ, పుట్ట, నైజీరియా, ముసురు తేనెటీగలు. నైజీరియా తేనెటీగల పెంపకం వల్ల ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ. పెంపకం కూడా తేలికగా ఉంటుందని అనుభవం కలిగిన పలువురు రైతులు అంటున్నారు. బాక్స్‌లో ఉండే నైజీరియా తేనెటీగలను ఇంటి పరిసరాల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బాక్స్(ట్రే)లో రాణి ఈగతోపాటు వంద మగ ఈగలు ఉంటాయి. వాటికి తోడు రెండు లక్షల చిన్న చిన్న ఈగలు ఉంటాయి. ఈగలకు ఆహారంగా రోజు బాక్సుల్లో పంచదారతో కలిపిన ద్రావకం పోస్తే సరిపోతుంది. పొప్పడి పూలు పూచే సమయంలో నవంబర్ నుంచి జనవరి నెలల్లో ఈగలు వాటిని తిని.. తేనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటాయి.30 బాక్సుల్లో తేనెటీగలను పెంచుకున్న రైతుకు ఒక్కో బాక్స్ ద్వారా నెలకు 3 నుంచి 5 కేజీల తేనె దిగుబడి వస్తుంది. రెండు నెలల్లో రైతు పెంచిన తేనెటీగల ద్వారా 90 కేజీల తేనె దిగుబడి వస్తుంది. తేనె తీసే పద్ధతులు బాక్స్‌లో ఉండే తేనె బయటకు తీసేందుకు కొన్ని పద్ధతులున్నాయి. బాక్స్‌లోని తేనెను నెలకోసారి లేదా రెండు నెలలకోసారి తీయాలి. దీనికోసం ముఖానికి మాస్కులు ధరించి మరో చేతిలో పొగ పట్టుకుని తేనెటీగల బాక్సును తెరవాలి. అందులో ఉన్న తేనెతుట్టెను బయటకు తీసి ఒక యంత్రంలో వేయాలి. అప్పుడు ఈగలు కుట్టకుండా తేనెతుట్టె నుంచి తేనె బయటకు వస్తుంది. మార్కెట్లో మంచి గిరాకీ తేనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కల్తీ లేని నైజీరియా తేనెటీగల ద్వారా లభించే తేనె కేజీ రూ.450 నుంచి రూ.500 చొప్పున ధర పలుకుతోంది. -
యోగా..మంచుదేగా
అందమైన మేని కోసం కుందేలులా పరుగెత్తాల్సిన అవసరం లేదు.దృఢమైన దేహం కోసం జిమ్‌లో చెమటోడ్చాల్సిన పని అంతకన్నా లేదు.ఆరడుగుల నేల చాలు.. ఆయుష్షున్నంత కాలం మిమ్మల్ని ఆరోగ్యంగాఉంచడానికి. పతంజలి ఆసనాల శాసనాలు అక్షరాలా అనుసరిస్తే చాలు ఈడు ముడతలు మీ దరి చేరవు. పరగడుపునే కాసేపు విల్లులా ఒళ్లు వంచి చూడండి.. వయసు పైబడినా మీ నడుం వాలితే ఒట్టు. మయూరాసనం వేయగలిగితే.. జాతక చక్రంలో మాలవ్య యోగం పట్టిన వారిలా మీ మేను నిగనిగలాడుతుంది. అదీ యోగా పవర్. యోగాసనాలు వాటి వల్ల కలిగే యోగాల గురించి సాక్షి సిటీప్లస్ తరఫున నటి, నిర్మాత మంచు లక్ష్మియోగాభ్యాసకులను పలకరించారు. మంచు లక్ష్మి: యోగా.. ఈ దేశం మనకిచ్చిన గిఫ్ట్. నేను అమెరికాలో ఉండగా నేర్చుకున్నాను. అమెరికన్స్‌ని చూసి నేర్చుకున్నందుకు చాలా బాధగా ఉంది. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మన దేశమే. చిత్రం ఏంటంటే.. పొరుగు దేశాల్లో యోగాకు ఉన్నంత క్రేజ్ మన దగ్గర లేకపోవడమే. అందుకే యోగా అందరి జీవితంలో తప్పనిసరి అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ రిపోర్టర్‌గా ఈ రోజు ఇక్కడికి వచ్చి కాసేపు ముచ్చటిస్తున్నాను. చెప్పండి సార్.. అసలు యోగా అంటే ఏమిటి? అది ఎప్పుడు పుట్టింది? చంద్రారెడ్డి: కీస్త్రు పూర్వం ఐదువేల సంవత్సరాల క్రితమే మన దేశంలో యోగా అనే పదం ఉందంటారు. యోగాకు సంబంధించి పూర్తి హక్కులు మన దేశానికే ఉన్నాయి. రుషులు అందించిన విద్య యోగ. మనస్సుని, దేహాన్ని కలిపి చూడటమే యోగా అంటే. మంచు లక్ష్మి: అవును.. కానీ మహర్షుల జీవితాల్లో యోగా ముఖ్యమైన భాగం. ఈ హైటెక్ కాలంలో యోగా చేసే తీరిక, ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. వారి సంఖ్య పెంచడానికి మార్గం ఏంటి? చంద్రారెడ్డి: ఏం లేదు.. యోగా ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే. మంచు లక్ష్మి: ఇక్కడ మీ సెంటర్లో వారం రోజుల కిందట యోగాక్లాస్లోని చేరినవారైనా ఉన్నారా? కైవల్య: నేనున్నానండి. మంచు లక్ష్మి: వావ్. నువ్వు చూస్తే స్కూల్ స్టూడెంట్ వి. ఎందుకు యోగాలో చేరావు? కైవల్య: నాకు ఏదో ప్రాబ్లమ్ వల్ల మోకాళ్ల నొప్పి వచ్చింది. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గడంలేదు. యోగావల్ల రిజల్ట్ ఉంటుంది అంటే వన్ వీక్ బ్యాక్ ఇక్కడ చేరాను. కొంచెం చేంజ్ కనిపించింది. మంచు లక్ష్మి: గుడ్.. కానీ మన దగ్గర చాలామంది ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటే కానీ యోగా దగ్గరికి రారు. దటీజ్ గుడ్ అండ్ బ్యాడ్. భార్గవి: కనీసం అలాగైనా రావడం మంచిదేకదా మేడమ్. మంచు లక్ష్మి: అవును.. కానీ యోగా శారీరక, మానసిక సమస్యలు తీర్చేది మాత్రమే కాదు. మనని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. అనారోగ్య సమసల్ని దరి చేరనీయదు. అమ్మా.. మీరు ఎన్నాళ్ల నుంచి యోగా చేస్తున్నారు. సరస్వతి: ఆరేళ్లుగా చేస్తున్నాను. నాకు 59 ఏళ్లు. ఈ వయసులో సాధారణంగా ఉండే ఏ సమస్యలూ నాకు లేవు. మంచు లక్ష్మి: వావ్.. మీరు అంత వయసున్నట్టు లేరు. మీ ముఖం కూడా చాలా తేజస్సుగా ఉంది. సార్.. యోగాతో ఆర్యోగంతో పాటు ముఖంలో ప్రశాంతత, గ్లో వస్తుంది కదా! చంద్రారెడ్డి: కచ్చితంగా.. ముందుగా డల్‌నెస్ పోతుంది. ముఖంలో తేజస్సు, చురుకుదనం, బాగా ప్రాక్టీస్ చేసిన వారిలో పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. మంచు లక్ష్మి: మరో ముఖ్యమైన ప్రశ్న. బరువు తగ్గడానికి యోగానే సరైన మార్గం. వారంలో, రోజులోనూ బరువు తగ్గించే వైద్య సదుపాయాలు వచ్చాయనుకోండి. కానీ యోగాతో బరువు తగ్గడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? చంద్రారెడ్డి: ఓ 20 ఏళ్ల పాటు పెంచిన కాయాన్ని.. 20 రోజుల్లో తగ్గించాలనుకోవడం చాలా తప్పు. దాని వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోగాతో బరువు మెల్లిగా తగ్గినా, ఎనర్జీ లెవల్స్‌లో ఏ మార్పూ ఉండదు. 20 కిలోల అదనపు బరువుంటే నెలకు నాలుగైదు కిలోలు తగ్గడం మంచిది. అది యోగా వల్ల మాత్రమే సాధ్యం. డైట్ కంట్రోల్ కూడా ఉండాలి. మంచు లక్ష్మి: దాని గురించీ నాలుగు ముక్కలు చెప్పండి. నాకు తెలిసి హెల్దీబాడీకి ఫైవ్ వైట్ ఫుడ్స్ ఎనిమీస్ అంటారు. చంద్రారెడ్డి: అవును.. రైస్, సాల్ట్, మైదా, షుగర్, పాలు. మంచు లక్ష్మి: పాలుకూడానా? చంద్రారెడ్డి: మనిషి ఆరేళ్ల వయసులోపు మాత్రమే పాలు తాగాలి. ఆ తర్వాత అవసరం లేదు. కచ్చితంగా చెప్పాలంటే అమ్మపాలు చాలు. మీరు చూడండి.. ఈ భూమ్మీద 84 లక్షల జీవరాశులున్నాయి. అవన్నీ వాటి తల్లి పాలు తాగుతాయి కానీ మరో జంతువు పాలు తాగాలని అనుకోవు. మనం మాత్రమే గేదె, ఆవు, మేకపాలు తాగడానికి ఇష్టపడతాం. మంచు లక్ష్మి: మరి పెరుగు? చంద్రారెడ్డి: పెరుగు కాదు.. మజ్జిగ మంచిది. దానివల్ల ప్రయోజనాలుంటాయి. మంచు లక్ష్మి: మహిళలకు యోగా తప్పనిసరి అని నా అభిప్రాయం. ఎందుకంటే వారు నేర్చుకుంటే ఇంట్లో పిల్లలకి కూడా అలవాటవుతుంది. అదొక్కటే కాదు మహిళ ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. దీనికి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పండి? భార్గవి: నేను ఏడేళ్ల నుంచి యోగా చేస్తున్నానండి. నేను ప్రెగె ్నంట్గా ఉన్నప్పుడు కొన్ని యోగాసనాలు వేశాను. దానివల్ల ఆ సమయంలో వచ్చే బీపీ, ఒంట్లో నీరు చేరడం వంటి సమస్యలేమీ రాలేదు. కవలలైనప్పటికీ నార్మల్ డెలవరీ అయింది. పాపలు పుట్టిన రెండు వారాల తర్వాత నా పనులు నేను చేసుకున్నాను. ఇది కేవలం యోగా వల్లే సాధ్యమైంది. మంచు లక్ష్మి: మరి మీ పిల్లలకు యోగా నేర్పుతున్నారా? భార్గవి: ప్రత్యేకంగా నేర్పడమంటూ ఏం లేదండి. నేను చేస్తుంటే చూసి వాళ్లే చేసేస్తున్నారు. మంచు లక్ష్మి: గ్రేట్.. చాలామంది యోగా చేయొచ్చు కదా అంటే.. టైం లేదంటారు. ఇది నిజమైన సమాధానం అంటారా ? రంజన: టైం మన చేతిలో ఉంటుంది. యోగా విలువ తెలిస్తే దానికి ఎంత టైమైనా కేటాయించగలరు. మంచు లక్ష్మి: యా.. రోజూ ఇన్ని గంటలని చేయక్కర్లేదు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఒళ్లు వంచితే చాలు. శ్వేత: మేడమ్.. మిమ్మల్ని రెండు ప్రశ్నలడగాలి. మంచు లక్ష్మి: డెఫినెట్లీ... శ్వేత: మీరు ఎప్పుడు యోగా నేర్చుకున్నారు? మంచు లక్ష్మి: నేను అమెరికాలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో మొదలుపెట్టాను. చాలా సాధన చేశాను. తెల్లవారుజామున 4:30 గంటలకు మొదలుపెడితే ఉదయం 10 గంటల వరకూ చేసేదాన్ని. అలా రెండు నెలలు చేసిన తర్వాత నాకు కుదిరిన టైంలో చేయడం మొదలుపెట్టాను. చాలామంది గురువుల దగ్గర యోగా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను. శ్వేత: మీ ప్రొఫెషన్లో ఒత్తిడి ఉంటుందంటారు కదా! దానికిది ఉపయోగపడిందంటారా? మంచు లక్ష్మి: ఒత్తిడిని అధిగమించడం ఒక్కటే కాదు...నేను ఐరేంద్రీ క్యారెక్టర్ అంత ఫర్ఫెక్ట్గా చేయగలిగానంటే.. దానికి కారణం యోగానే. షూటింగ్ గ్యాప్‌లో యాక్టివ్‌గా ఉండడం కోసం ఆసనాలు ప్రాక్టీస్ చేసేదాన్ని. సరస్వతి: బిజీగా ఉంటారు కదా! యోగా టైమింగ్స్ ఎలా ఎడ్జెస్ట్ చేసుకుంటున్నారు? మంచు లక్ష్మి: నాకు ఏదైనా యోగా తర్వాతే. దీని రుచి తెలిసినవారెవరూ దీన్ని వదులుకోరు. థ్యాంక్యూ సో మచ్. ఈ కథనం చూసి మరికొంతమంది యోగా చేయడానికి సిద ్ధపడతారని ఆశిస్తున్నాను. సాక్షి తరఫున రిపోర్టర్‌గా మిమ్మల్ని కలసినందుకు సంతోషంగా ఉంది. -
జీవ వైవిధ్యంతోనే రైతుకు రక్షణ
ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ హంపయ్య వెల్లడి హైదరాబాద్: జీవ వైవిధ్య చట్టం కళ్లుగప్పి తరలిపోతున్న జీవవనరుల పరిరక్షణతోనే రైతుకు లబ్ధి చేకూరుతుందని ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ డాక్టర్ ఆర్.హంపయ్య, సభ్య కార్యదర్శి ఎన్.చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. జీవ వైవిధ్య చట్టం, నియమావళి, వినియోగంపై వారు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఈ చట్టం 2002లో వచ్చినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల వన్యప్రాణులు, ఔషధ మొక్కల ఉత్పత్తులు, జల సంపద వంటివి ఎటువంటి అనుమతులు లేకుండానే తరలిపోతున్నాయని వివరించారు. గిరిజనులు సేకరించే సహజ ఉత్పత్తులనేకానికి కనీస ధర కూడా ఇవ్వకుండానే పెద్దపెద్ద కంపెనీలు తరలించుకుపోతున్నాయన్నారు. మున్ముందు జీవ వైవిధ్య చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రపంచ పర్యావరణ సౌలభ్య సంస్థ (జీఇఎఫ్) కింద గ్రామీణ ప్రాంతాల్లోని జీవ వనరుల సమాచారాన్ని సేకరిస్తున్నట్టు ఆ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త జి.సాయిలు తెలిపారు. -
అప్రమత్తతతోనే ప్రమాదాలు దూరం
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: అందరూ అప్రమత్తంగా ఉంటే అగ్నిప్రమాదాలను సులువుగా నివారిం చవచ్చని అగ్నిమాపకదళం అధికారులు పేర్కొంటున్నారు. అయితే అగ్నిమ్రాదాలను ఏలా నియంత్రించవచ్చో విద్యార్థులకు మాక్‌డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. రామచంద్రాపురం, సదాశివపేటలోని పాఠశాలల్లో మంగళవారం విద్యార్థులకు అగ్నిప్రమాదాల గురించి అధికారులు వివరించారు. రామంచద్రాపురంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయస్థాయి ప్రత్యక్ష ప్రదర్శనను అగ్నిమాపకదళం నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపకదళం అధికారి చంద్రారెడ్డి మాట్లాడుతూ మానవలోప కారణంగానే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదం జరిగినపు డు మంటల్ని ఎలా ఆర్పాలి, ప్రాణరక్షణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్‌డ్రిల్‌తో వివరించారు. భవనం పైభాగాన పొగల్లో చిక్కుకున్న విద్యార్థులకు తాళ్ళు ద్వారా ఎలా తీసుకునివచ్చేది ప్రదర్శిం చారు. ఎల్పీజీ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడకాన్ని కూడా వివరించా రు. విపత్తులు రెండు రకాలుగా ఉంటాయని ప్రకృతి మూలంగా, మనుషుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతాయన్నా రు. ఈ ప్రదర్శనలను విద్యార్ధులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వీరాగౌడ్, అగ్నిమాపకదళ సిబ్బంది నర్సయ్య, ఎక్బాల్, అంజయ్య, ఆంజనేయులు, నరేశ్, యాదగిరి, పాపాయ్య, దేవదానం, అన్వర్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకు అవగాహన అవసరం సదాశివపేట: విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ గురించి అవగాహన చాలా అవసరమని పట్టణ అగ్నిమాపక అధికారి సైదులు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని విజ్ఞాన్ పాఠశాలలో విద్యార్ధులకు అగ్ని ప్రమాదాల నివారణ గురించి అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ముందుగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా నివారణ చర్యల గురించి సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సిబ్బంది మానిక్‌రావు, సుదర్శన్, నరేష్, ప్రవీన్‌కుమార్, శ్రీనివాస్‌లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ, కరస్పాండెంట్ శంకర్‌గౌడ్, పీఈటీ బుచ్చిరెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
చక్రాసనం
నిర్వచనం: ఈ ఆసనం వేసినప్పుడు దేహాకృతి చక్రంలా కనిపిస్తుంది. అందుకే ఇది చక్రాసనంఅయింది. చేసే విధానం ముందుగా వెల్లకిలా పడుకొని రెండు చేతులు ఇరువైపుల ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత రెండుకాళ్లను మోకాళ్ల వద్ద వంచి రెండుపాదాలను పిరుదుల వద్దకు తీసుకోవాలి. మడమలు పిరుదులకు ఆనించి ఉంచాలి. ఇప్పుడు రెండు అరచేతులను తలకిరువైపుల నేల పైన ఉంచాలి. శ్వాస పూర్తిగా తీసుకొని శరీరబరువు పూర్తిగా రెండు చేతులు రెండు పాదముల పైన ఉంచి శరీరాన్ని పైకి లేపాలి. ఈ స్థితిలో ఛాతీ, నడుము పైకి లేపబడి తలక్రిందకు వ్రేలాడబడి ఉంటుంది. మోచేతులు, మోకాళ్లు వంగకుండా అరచేతులు, పాదాలు నేలను తాకి ఉంటాయి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి. ప్రతిరోజు ‘3’ సార్లు చేయాలి. ఉపయోగాలు వెన్నునొప్పి తొలగిపోతుంది. ఛాతీ విశాలమవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. థైరాయిడ్, శ్వాస సంబంధిత రోగాలు పోతాయి. చేతులు, భుజాలు, మోకాళ్లు, తొడలు, మణికట్టు శక్తిమంతం అవుతాయి. పొత్తికడుపు కండరాలు శక్తిమంతం అవుతాయి. అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్య, మలబద్దకం పోతాయి. రుతుక్రమ సమస్యలు పోతాయి. తొడలపై కొవ్వు కరుగుతుంది. ముఖంలో కాంతి పెరుగుతుంది. వెన్ను సరళతరమవుతుంది. చేయకూడనివాళ్ళు హైబీపీ, మైగ్రేన్, బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలు ఉన్న వారు చేయకూడదు. అధికబరువు ఉన్నవారు, మోకాళ్ల నొప్పులు, భుజముల నొప్పులు ఉన్నవారు, కన్ను, ముక్కు, గొంతు, చెవికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. మోడల్: అంజు రిషిత ఫొటోలు: శివ మల్లాల బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు సప్తరుషి యోగవిద్యాకేంద్రం హైదరాబాద్ -
పూర్ణ భుజంగాసనం
భుజంగం అంటే పాము. పడగెత్తిన పాము పూర్తిగా వెనుకకు వంగిన స్థితిని లేదా భుజంగాసనం సంపూర్ణ స్థితిలో వేయడం వలన దీనిని పూర్ణ భుజంగాసనం అంటారు. చేసే విధానం మొదట రెండు చేతులను గడ్డం కింద ఉంచి, బోర్లా పడుకుని విశ్రాంతి స్థితిలో ఉండాలి. రెండు అరచేతులను ఛాతీకి దగ్గరగా నేలపై ఆనించి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తలనుంచి నాభి వరకు పైకి తీసుకురావాలి. రెండు కాళ్లనూ మోకాళ్ల వద్ద వెనుకకు వంచి అరిపాదాలను నుదురు భాగానికి తాకించి, ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. ఈ ఆసనాన్ని రోజుకు మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి. జాగ్రత్తలు! పూర్ణ భుజంగాసనం వేయడం కొంత కష్టమే. ఎక్కువ సాధన ఉన్నవారు మాత్రం సులువుగా చేయగలరు. ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయడం మంచిది. ఉపయోగాలు వెన్నుపాము శక్తిమంతం అవుతుంది. వెన్నునొప్పి తగ్గుతుంది. ఛాతీ విశాలం అవుతంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. మెడ కండరాలకు బలం వస్తుంది. గొంతు సంబంధ వ్యాధులు నయమవుతాయి. స్వరం సరళతరమవుతుంది. పొట్ట కండరాలు, పొట్టలోని ఇతర భాగాలు సాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. చేతులకు, భుజాలకు శక్తి పెరుగుతుంది. రుతుక్రమ సమస్యలు నివారణ అవుతాయి, ఇతర గర్భాశయ సమస్యలతోపాటు గర్భధారణ సమస్యలు కూడా తొలగిపోతాయి. శరీరం మొత్తం ఉత్తేజితమవుతుంది. మోడల్: అంజు రిషిత బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు సప్తరుషి యోగవిద్యాకేంద్రం హైదరాబాద్ ఫొటోలు: శివ మల్లాల -
రాజకపోతాసనం
కపోతం అంటే పావురం. ఈ ఆసనం వేసినప్పుడు దేహాకృతి... ఠీవిగా నిలుచున్న కపోతాన్ని తలపిస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని రాజకపోతాసనం అంటారు. ఎలా చేయాలి? వజ్రాసనంలో (ఒకటవ ఫొటోలో ఉన్నట్లు) వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. కుడికాలిని పూర్తిగా వెనుకకు చాపాలి. ఈ స్థితిలో కాలు పూర్తిగా నేలకు తాకుతుండాలి. ఇప్పుడు రెండు చేతులను పైకి లేపి మోచేతుల దగ్గర వంచి తల వెనుకకు తీసుకోవాలి. ఈ స్థితిలో తలను వీలయినంత వెనక్కి వంచాలి. ఇదే సమయంలో కుడి మోకాలిని వంచి అరికాలిని తల నుదురుభాగానికి తాకించాలి. తలమీద ఉన్న కుడిపాదాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. ఈ స్థితిలో చూపు ఆకాశం వైపు ఉండాలి. ఛాతీ భాగం ముందుకి నెట్టినట్లు ఉండాలి. ఆసనం స్థితిలోకి వెళ్లిన తర్వాత శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. ఇదే క్రమాన్ని ఎడమకాలితో కూడా కొనసాగించాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి. ఉపయోగాలు ఇవి ! మోకాళ్లు, భుజాలు, మోచేతులు, తొడలు, శక్తిమంతం అవుతాయి. థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. గొంతు సంబంధ వ్యాధులు నయమవుతాయి. స్వరంలో స్పష్టత వస్తుంది. ఛాతీ విశాలమవుతుంది. శ్వాససంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. అజీర్తి, మలబద్దకం తొలగిపోతాయి. రుతుక్రమ సమస్యలతోపాటు ఇతర గర్భకోశ సమస్యలు కూడా నివారణ అవుతాయి. వెన్నునొప్పి పోతుంది. శరీరం మొత్తం దృఢతరమవుతుంది. జాగ్రత్తలు! స్పాండిలోసిస్, హైబీపీ ఉన్నవాళ్లు చేయకూడదు. మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నప్పుడు, భుజాల నొప్పులు, మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి), మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు చేయరాదు. బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు సప్తరుషి యోగవిద్యాకేంద్రం, హైదరాబాద్ ఫొటోలు: శివ మల్లాల -
సుప్త వీరాసనం
వీరాసనంలో కూర్చుని వెల్లకిలా పడుకునే భంగిమను సుప్తవీరాసనం అంటారు. ఇలా చేయాలి ముందుగా వీరాసనంలో కూర్చోవాలి... అంటే మోకాళ్లు మడిచి పిరుదులను నేలకు ఆనించి కూర్చోవాలి. ఈ స్థితిలో అరికాళ్లు దేహానికి రెండు వైపులా ఆకాశాన్ని చూస్తుండాలి. అరచేతులను తొడల మీద బోర్లించాలి. వెన్నెముక నిటారుగా ఉంచి దృష్టిని నేరుగా ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. దీనిని వీరాసనం అంటారు. ఇప్పుడు నిదానంగా వెనుకకు వంగుతూ రెండు మోచేతులను ఒకదాని తర్వాత మరొకటిగా నేల మీద ఆనించాలి. ఈ స్థితిలో రెండుపాదాల పక్కన రెండు అరచేతులను నేల మీద బోర్లించాలి. రెండు మోచేతుల సాయంతో శరీరాన్ని నేలమీద ఉంచి రెండుచేతులను మడిచి తలకింద ఉంచాలి. ఈ స్థితిలో పూర్తి శరీరం నేలను తాకుతూ ఉంటుంది. పాదాలు శరీరానికి ఆనుకుని ఉంటాయి, మడమలు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంటాయి. శ్వాస సాధారణంగా తీసుకుంటూ వదలాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మోచేతుల సాయంతో దేహాన్ని పైకిలేపుతూ సాధారణ స్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. ఉపయోగాలు తొడల మీద ఉన్న కొవ్వు కరిగిపోతుంది. మోకాళ్లు, తొడలు శక్తిమంతం అవుతాయి. ఆస్త్మా, బ్యాక్ పెయిన్, థైరాయిడ్ సమస్యలు తొలగిపోతాయి. గొంతు సమస్యలు తగ్గి స్వరం బాగుంటుంది. జాగ్రత్తలు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లు, స్థూలకాయులు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు. మొదటిసారి చేసేవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం, హైదరాబాద్ మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్