మూసివేత దిశగా గాజులమండ్యం చక్కెర కర్మాగారం
నిర్వహించలేము అంటున్న యాజమాన్యం
బకాయిలున్నా.. చెరకు తోలేందుకు
సిద్ధమంటున్న రైతులు స్పందించని {పభుత్వం
తిరుపతి: జిల్లాలోని చెరకు రైతుల బతుకు చేదెక్కుతోంది. వీరి సమస్యల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే చిత్తూరు కర్మాగారం మూతపడగా, అదేబాటలో గాజుల మండ్యం చక్కెర ఫ్యాక్టరీని కూడా మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నవంబరు మూడో వారంలోనే క్రషింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా... ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది 2,200 మంది రైతులకు రూ.13.5 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతోపాటు ఆగస్టు నుంచి దాదాపు 300 మంది ఉద్యోగులకు రూ.2 కోట్లకుపైగా జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయితే దాదాపు 200 మంది రైతులు, ఉద్యోగులు ఇటీవల తిరుపతిలో సమావేశమై బకాయిలు చెల్లించకపోయినా, జీతాలులేక పోయినా ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకొంటాం వెంటనే క్రషింగ్‌ను ప్రారంభించాలని జేసీ నారాయణ భరత్‌గుప్త, ఎండీ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు . ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం రాలేదు. తిరుపతి జన్మభూమి బహిరంగ సభలో ైముఖ్యమంత్రిని కలిసిన రైతులకు చుక్కెదురైంది. వినతిపత్రం తీసుకొన్న సీఎం కనీసం నోరు మెదపలేదు.
ఆందోళనలో రైతులు..
గతేడాది బకాయిలు రాక, ప్రస్తుతం సిద్ధంగా ఉన్న చెరుకును ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఫ్యాక్టరీ పరిధిలో 1300 రైతులతో ఫ్యాక్టరీ యజమాన్యం అగ్రిమెంట్లను కుదుర్చుకుంది. ఇంత వరకు క్రషింగ్ ప్రారం భం కాకపోడంతో రైతులకు ఎటూ పాలుపోలేదు. ఫ్యా క్టరీ మూసివేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం క్రషింగ్ విషయాన్ని నాన్చుతోందని ఓ అధికారి పేర్కొన్నారు.
క్రషింగ్ ప్రారంభించండి..
బకాయిలు ఉన్న ఫర్వాలేదు.. మేం ఫ్యాక్టరీకి చెరుకును తోలేందుకు సిద్ధం. క్రషింగ్ ప్రారంభించాలి. ఈ విషయా న్ని రైతులమంతా ముక్తకంఠంతో విన్నవించాం. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఫ్యాక్ట రీ తెరవాలని యజయాన్యంపై కోర్టులో కేసు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేం దుకే ప్రభుత్వం ప్యాక్టరీని మూసివేయాలను కుంటోంది.
- ఎం. పట్టాభిరెడ్డి, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు
ప్రభుత్వానికి నివేదిస్తాం..
రైతులతో చర్చించిన విషయాలను జేసీ ప్రభుత్వానికి నివేదించారు. ఉన్నతాధికారులు సమావేశమై సంక్రాంతి పండుగ తరువాత నిర్ణయం తీసుకోవచ్చు. అగ్రిమెంట్ కుదుర్చుకొన్న రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది.
- వెంకటేశ్వరరావు, ఎండీ, గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీ
చేదు వార్త
Published Wed, Jan 13 2016 1:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement