సమైక్యం కోసం వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
హైదరాబాద్ : శాసనసభలో సోమవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విభజన బిల్లుపై తక్షణమే చర్చించాలని టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ వాయిదా తీర్మానలు ఇవ్వగా, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సభలో చర్చించాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం ప్రవేశపెట్టింది.
ఇక అసెంబ్లీ సమావేశాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. స్పీకర్ నాదెండ్ల మనోహర్ విభజన బిల్లు అసెంబ్లీకి చేరిందని ప్రకటన చేయనున్నారు. బిల్లును ఎప్పుడు, ఎన్నిరోజులు చర్చించాలన్న దానిపై బీఏసీ నేడు సమావేశం అయ్యే అవకాశం ఉంది.