సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నె ల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్).. మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి గురువారం ఉదయం 5.49 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాకెట్ ద్వారా 1,425 కిలోల బరువున్న భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ)ను అంతరిక్ష కక్ష్యలోకి పంపనున్నారు.
మనదేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థను సమకూర్చుకునేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహ వ్యవస్థకు ఇస్రో శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగంలో మొత్తం ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగోదాన్ని పంపుతున్నారు. కాగా, ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శుక్రవారం షార్‌కు చేరుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ను పరిశీలించి శాస్త్రవేత్తలతో మాట్లాడారు.
నేడు పీఎస్‌ఎల్‌వీ సీ27 ప్రయోగం
Published Sat, Mar 28 2015 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM
Advertisement
Advertisement