హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనుకున్న సమయానికల్లా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం అతి తీవ్ర స్థాయిలో ఉందని పర్యావరణ కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment