సైదాపురం(వెంకటగిరి), న్యూస్‌లైన్: సైదాపురం మండలంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పరిస్థితి రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతుండడంతో ప్రజలు చికిత్స నిమిత్తం నెల్లూరు, చెన్నై తదితర నగరాలకు పరుగులు తీస్తున్నారు. డెంగీతో బాధపడుతున్న 10 మంది వరకు చెన్నైలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నాలుగు రోజుల క్రితం సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వచ్చిన రోగులను పరీక్షించిన డాక్టర్ పాల్‌జాన్సన్ ఇద్దరికి డెంగీ జ్వరం సోకిందనే అనుమానంతో నెల్లూరు డీ ఎస్సార్ ప్రభుత్వ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. మరో ఐదుగురిని చెన్నైకి వెళ్లాలని సూచించడంతో వారు చెన్నై ఆస్పత్రిలో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయిం చుకుంటున్నారు. విషజ్వరాలు విజృం భిస్తుండడంతో వందల సంఖ్యలో రో గులు ఆస్పత్రులకు వస్తున్నారు. దీం తో పీహెచ్‌సీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
ప్రత్యేక వైద్యసేవలు
సైదాపురంలో శనివారం క్లస్టర్ వైద్యాధికారిణి డాక్టర్ ప్రియదర్శిని ఆధ్వర్యం లో వైద్యసిబ్బంది ప్రత్యేక వైద్యసేవలు అందించారు. విషజ్వరాలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పారిశుధ్య నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో ప్రబలుతున్న జ్వరాలు
ఇందుకూరుపేట: ఇందుకూరుపేట, కొత్తూరు తదితర ప్రాంతాల్లో అనేక మందివిషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలల్లో చికి త్స పొందుతుండగా, పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇద్దరికి డెంగీ లక్షణాలు
సోమశిల: అనంతసాగరంలో ఇద్దరికి డెంగీ లక్షణాలు ఉండడంతో శనివారం చెన్నైకి తరలించారు. బస్టాండ్ సమీపంలోని ఓ ముస్లిం కుటుంబంలో ఓ మహిళ, ఓ యువకుడికి మూడు రో జుల క్రితం జ్వరం సోకింది. ఆత్మకూరులో పరీక్షలు చేయగా డెంగీ లక్షణా లు ఉన్నాయని, మెరుగైన వైద్యం కోసం ఆ ఇద్దరిని చెన్నై ఆస్పత్రికి తరలించారు. సాగరంలో ఇటీవలే ఓ మహిళ డెంగీతో మృతి చెందడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
విష జ్వరాల విజృంభణ
Published Sun, Oct 27 2013 3:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement