![Senior Actor Sarath Babu Admitted A Hospital In Chennai - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/29/sharath.jpg.webp?itok=68_QnPn1)
సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది.
శరత్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నెవయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. కొన్నేళ్ల పాటు వెండితెరపై కనిపించిన శరత్ బాబు ప్రస్తుతం చాలా తక్కువగా కనిపిస్తున్నారు. శరత్ బాబు దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించారు. మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment