కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. సమైక్యాంద్ర ఉద్యమం నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అశోక్‌బాబు ప్యానల్ తరపున జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈయన కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 56 మంది ఓటర్లున్నారు. ఈ ఓట్లన్నీ అశోక్‌బాబు ప్యానల్‌కే పడే విధంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి, శ్రీరాములు, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జి.రామకృష్ణారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈనెల 2వ తేదీన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి కూడా జిల్లాకు వచ్చి ప్రచారం నిర్వహించారు. అశోక్‌బాబు ప్యానల్‌పై పోటీ చేస్తున్న బషీర్ జిల్లాకు వచ్చి ప్రచారం చేయకపోయినా జిల్లాలో ఉన్న 56 మంది ఓటర్లతో మాట్లాడి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓటర్లందరూ అశోక్‌బాబు వెంట ఉంటున్నట్లు కనిపిస్తున్నా 10 నుంచి 15 ఓట్లు బషీర్ ప్యానల్‌కు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బషీర్‌కే ఓటు వేయనున్నట్లు కొందరు ‘న్యూస్‌లైన్’కు చెప్పడం ఇందుకు నిదర్శనం. అయితే జిల్లా ఓట్లు మొత్తం అశోక్‌బాబు ప్యానెల్‌కే పడతాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.
నేడు రాష్ట్ర ఎన్‌జీఓ అసోసియేషన్ ఎన్నికలు
Published Sun, Jan 5 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement