
బీచ్‌రోడ్డు(విశాఖతూర్పు): జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్‌ల్లో మరుగుదొడ్లు తప్పనిసరి అని ఇన్‌చార్జి కలెక్టర్ జి.సృజన అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం పెట్రోల్ బంక్‌ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్‌లో భాగంగా అన్ని పెట్రోల్ బంక్‌ల్లో మరుగుదొడ్లు తప్పని సరిగా ఉండాలన్నారు. జీవీఎంసీ పరిధిలో 72 పెట్రోల్ బంక్‌లు ఉండగా, వాటిలో 10 బంక్‌ల్లో మరుగుదొడ్లు లేనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా నిర్మాణాలను చేపట్టాలన్నారు. నిరంతరం నీటి సౌకర్యం కల్పించడంతో పాటు మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, డీఎస్‌వో నిర్మలాబయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment