సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయం గురించి పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు గత నాలుగు రోజులుగా స్పీకర్ అనుమతించకుండా...కేంద్రంలో మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారమిక్కడ మండిపడ్డారు. టీఆర్ఎస్ కూడా బీపేపీతో లాలూచీ పడిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌కు, అన్నాడీఎంకేలకు చిత్తశుద్ధి ఉంటే హోదా విషయంలో ఏపీకి సహకరించాలని సూచించారు. ఏపీ ప్రజలు విశాఖ రైల్వే జోన్ అడుగుతుంటే ..రైల్వే జోన్ ఇవ్వకపోగా, ఉన్న రైళ్లను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తారని రామకృష్ణ మండిపడ్డారు. గురువారం ఉదయం జాతీయ రహదారులను పెద్ద ఎత్తున దిగ్భందం చేస్తామని, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారధిని కూడా దిగ్బందం చేస్తామన్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment