చిత్తూరు (అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం తిరుపతికి రానున్నారని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లో బయలుదేరి 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు మహతి ఆడిటోరియంలో జరిగే స్విమ్స్ ఆరో స్నాతకోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు. అనంతరం స్విమ్స్ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
సాయంత్రం 4.20 గంటలకు శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో పైలాన్ మహిళా మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు. 5.30 నుంచి 6.30 గంటల వరకు జిల్లా అధికారులతో వరద సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6.45 గంటలకు సెవెన్ హిల్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
రేపు తిరుపతికి సీఎం రాక
Published Tue, Dec 1 2015 1:40 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement
Advertisement