- పోస్టులు 107
- అభ్యర్థులు 28,653 మంది
- తిరుపతి డివిజన్‌లోనే పరీక్షలు
- 65 పరీక్ష కేంద్రాలు, 1,838 మంది సిబ్బంది నియామకం
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఆదివారం పరీక్ష జరగనుంది. ఈ మేర కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసి ంది. కలెక్టర్ రాంగోపాల్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈ వో వేణుగోపాలరెడ్డి పరీక్షల సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 107 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబరులో ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వికలాంగుల కు మూడు పోస్టులు కేటాయించారు. మిగిలిన 104 పోస్టులకు 28,615 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 275 మంది పోటీ పడుతున్నారు. వికలాంగు లకు సంబంధించిన 3 పోస్టులకు 38 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
పరీక్షా విధుల్లో 1838 మంది
పరీక్ష నిర్వహణకు 1838 మంది సిబ్బందిని నియమించారు. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లోని 65 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. పరీక్ష విధులకు 13 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్, 65 మంది లైజనింగ్ అధికారులు, 65 మంది చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులను నియమించారు.
రెండు పేపర్లు- 300 మార్కులు
అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. పేపర్-1ను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్‌కు సంబంధించిన 150 ప్రశ్నలు ఉంటాయి. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు. ఇందులో గ్రామీణాభివృద్ధి, అకౌంటింగ్‌కు సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయి.
గంట ముందే చేరుకోండి
పరీక్ష నిర్వహణ పారదర్శకంగా జరుగుతుంది. హాల్‌టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్నాయి. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలు తీసుకు రాకూడదు.
- వేణుగోపాలరెడ్డి, పరీక్షల సమన్వయకర్త