సాక్షి, అమరావతి: పెట్టుబడులతో ఏపీకి వచ్చి పరిశ్రమలు స్థాపిస్తే దక్షిణ కొరియాకు అగ్రప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న సీఎం రెండోరోజు మంగళవారం బూసన్ పారిశ్రామిక నగరంలో భారత ఎంబసీతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన రోడ్ షో, బిజినెస్ సెమినార్‌లో మాట్లాడారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు వచ్చేవారికి 21 రోజుల్లో సింగిల్ డెస్కు పోర్టల్ ద్వారా అన్ని అనుమతులను ఇస్తున్నామన్నారు.
తమ రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, అందుకే సీఎన్‌బీసీ తమ రాష్ట్రానికి స్టేట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఇచ్చిందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మించే క్రతువులో కొరియా పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలన్నారు. అమరావతిని ప్రపంచంలోని అత్యాధునిక ఐదు నగరాల్లో ఒకటిగా ఉండేలా నిర్మిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్టుతో తమ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని, తాము ఎంత సమర్థులమో ప్రత్యక్షంగా చూడాలన్నారు. బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ మాట్లాడుతూ కొరియా, ఏపీ మధ్య అనేక సారూప్యతలున్నాయన్నారు. దక్షిణ కొరియాలో భారత రాయబారి దొరైస్వామి మాట్లాడుతూ భారత్‌లో వ్యాపారానికి ఏపీ మంచి ప్రాంతమన్నారు.
ఏపీలో కొరియా పారిశ్రామిక కాంప్లెక్స్
రాష్ట్రంలో కొరియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం బిజినెస్ సెమినార్‌లో రాష్ట్ర ప్రభుత్వం, మేకిన్ ఇండియా కొరియా సెంటర్ (ఎంఐసీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా బూసన్‌లో ఆంధ్రప్రదేశ్ సెంటర్‌ను నెలకొల్పాలని నిర్ణయించారు.
పెట్టుబడుల్లో కొరియాకు అగ్రస్థానం: సీఎం
Published Wed, Dec 6 2017 1:20 AM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment