సాక్షి, వైజాగ్: ఉత్తరాంధ్రకు గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం ఓ రికార్డ్ అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. శుక్రవారం అరకులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆమెతో పాటు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. రాజకీయ చరిత్రలో మొదటిసారిగా ఓ గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలనుందని తెలిపారు. గిరిజనులు అమాయకులనీ, ప్రకృతిని కాపాడుతూ అందరూ జీవించేలా చేస్తున్నారని అభినందించారు. బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన కొనియాడారు. మరోవైపు పర్యాటక శాఖలో 75 శాతం ఉద్యోగాలను గిరిజనులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పాడేరు ఎమ్మేల్యే భాగ్యలక్ష్మిమాటల్లో.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పాడేరులో మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన సీఎంకు గిరిజనులు ఎప్పటికీ రుణపడి ఉంటారననారు. గిరిజులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం డిప్యూటీ సీఎం విద్యార్థులకు లాప్టాప్లు, డ్వాక్రా మహిళలకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment