సీమాంధ్రకు పర్యాటక బస్సులు రద్దు | Tourist buses cancelled to Seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రకు పర్యాటక బస్సులు రద్దు

Published Sat, Oct 5 2013 12:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

Tourist buses cancelled to Seemandhra

హైదరాబాద్-షిర్డీ మధ్య యథావిధిగా సర్వీసులు
 సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమ సెగ పర్యాటక శాఖ బస్సులకూ తాకింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయినా ఇన్నాళ్లూ పర్యాటక బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. పర్యాటక శాఖ బస్సులను కూడా నిలిపివేయాలని, బస్సులు నడిపితే ధ్వంసం చేస్తామని సీమాంధ్ర ఉద్యమకారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి సీమాంధ్రవైపు అన్ని పర్యాటక బస్సులూ రద్దయ్యాయి. హైదరాబాద్-తిరుపతి, విశాఖ-భద్రాచలం సర్వీసులకు ముందుగా రిజర్వు చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇచ్చేశారు. నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య నిర్వహించే బోటు షికారు కూడా నిలిచిపోయింది. అయితే, హైదరాబాద్-షిర్డీ మధ్య పర్యాటక శాఖ బస్సులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement