రైళ్లకు హుదూద్ బ్రేక్ | Trains to the Hudood break | Sakshi
Sakshi News home page

రైళ్లకు హుదూద్ బ్రేక్

Published Sun, Oct 12 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

Trains to the Hudood break

కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు
 
హైదరాబాద్/విజయవాడ: హుదూద్ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు ఎక్స్‌ప్రెస్, ప్యా సింజర్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిటిని పాక్షికం గా రద్దు చేసి, కొన్నింటిని దారి మళ్ళించి నడుపుతోం ది. తూర్పు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయనే హెచ్చరికలతో వీటిని రద్దు చేసినట్లు సీపీఆర్వో సాం బశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్ నుం చి బయలుదేరాల్సిన హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు 12న సాయంత్రం అ టునుంచి బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యూరుు. 11న రాత్రి 10.50 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరాల్సిన భువనేశ్వర్-బెంగళూ రు కంటోన్మెంట్ ప్రీమియం స్పెషల్, 12వ తేదీన రాయగడ-విజయవాడ ప్యాసింజర్, విజయవాడ-రాయగడ ప్యాసింజర్, విశాఖపట్నం-మచిలీపట్నం/నర్సాపూర్ ప్యాసింజర్, విశాఖపట్నం-రాజమండ్రి ప్యాసింజర్,మచిలీపట్నం/నర్సాపూర్-విశాఖపట్నం ప్యాసింజర్,నర్సాపూర్-భీమవరం ప్యాసింజర్ రైళ్ళు రద్దయ్యూరుు. విశాఖపట్నం-విజయవాడ ప్యాసిం జర్‌ను విశాఖ-రాజమండ్రి మధ్య రద్దు చేశారు. అలాగే విజయవాడ-విశాఖపట్నం ప్యాసింజర్ పాక్షికంగా రద్దైంది.

పలు రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఇలావుండగా హుదూద్ తుపానును ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉన్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) ప్రదీప్‌కుమార్, ఏడీఆర్‌ఎం సీతారాంప్రసాద్ వెల్లడించారు. శనివారం సా యంత్రం వారు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హుదూద్ తుపాను కారణంగా భువనేశ్వర్, విశాఖపట్నంల మధ్య సుమారు 40 రైళ్ల ను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఢిల్లీలో తెలిపారు. అనేక రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. భువనేశ్వర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు విశాఖ, ఖుర్దా రోడ్డు, సంబల్‌పూర్ డివిజనల్ ప్రధాన కార్యాలయూల్లో 24ఁ7 విపత్తు నిర్వహణ విభాగాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement