చింతూరు మండలం తుమ్మల గ్రామంలో మావోయిస్టులు ఓ గిరిజన కళాకారుడిని పోలీస్ ఇన్ఫార్మర్ అన్న నెపంతో కాల్చి చంపారు.
ఖమ్మం: చింతూరు మండలం తుమ్మల గ్రామంలో మావోయిస్టులు ఓ గిరిజన కళాకారుడిని పోలీస్ ఇన్ఫార్మర్ అన్న నెపంతో కాల్చి చంపారు. సిపిఎం కార్యకర్త అయిన ముత్యం అలియాస్ భిక్షం కొమ్ముడోలు కళాకారుడు. నిన్న కూడా సిపిఎం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముత్యం పాల్గొన్నాడు. శబరి ప్రాంతానికి చెందిన మావోయిస్టు దళాలు ముత్యంను తన కొడుకు ఎదుటే హత్య చేశారు.
ఎంత చెప్పినా వినకుండా ముత్యం పోలీసులకు సమాచారం అందజేస్తున్నాడని మావోయిస్టులు ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రజాకోర్టులో గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు అతనిని చంపినట్లు ఆ లేఖలో తెలిపారు.