tummala
-
మా చెరువు తప్పిపోయింది అప్పుడు అలా - ఇప్పుడు ఇలా
-
తుమ్మల చెప్పినట్టు చేస్తే రేవంత్‌రెడ్డి నామినేషన్ రిజెక్ట్ చేయాలి : పువ్వాడ
సాక్షి,ఖమ్మం : తన నామినేషన్ తిరస్కరించాలని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. తుమ్మల చెప్పినట్లు చేస్తే ముందుగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో వేసిన నామినేషన్ రద్దు చేయాలన్నారు. ఖమ్మంలో పాత రుగ్మతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయని, తుమ్మలకు అధర్మ పోరాటం అలవాటని పువ్వాడ విమర్శించారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పువ్వాడ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘నా నామినేషన్‌ను తిరస్కరించాలని ఖమ్మం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి తుమ్మల ఫిర్యాదు చేశారు. తుమ్మల ఫిర్యాదుకు ఎన్నికల అధికారులు సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పగానే నా నామినేషన్ తిరస్కరిస్తారా. తుమ్మల చెప్పినట్టు చేస్తే మంచోళ్ళు, చెయ్యకపోతే చెడ్డోళ్ళు. అఫిడవిట్లో తప్పులు ఉంటే నోటీస్ ఇస్తారు నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని అధికారులు సమాధానం ఇచ్చారు. డిపెండెన్స్ లేనప్పుడు ఎందుకు పెట్టాలి. గతంలో నా కుమారుడుకి పెళ్లి జరగలేదు.. ఇప్పుడు పెళ్లయింది. అఫిడవిట్ అనేది ఆస్తులు, లావాదేవీలు ఉంటే చూపించాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల నామినేషన్ వేశారు. కొడంగల్‌లో అతని నామినేషన్లో ఏడు కాలాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా చెయ్యాలంటే ముందుగా రేవంత్ రెడ్డి నామినేషన్ రద్దు చెయ్యాలి. రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేస్తే కోర్టుకు వెళ్లొచ్చు కానీ బెదిరించడం ఏంటి. మీకు సలహా ఇచ్చింది ఎవరో. మీ సమయం, నా సమయం వృథా చేశారు. అధర్మం పోరాటం కాదు ధర్మ పోరాటం చెయ్యాలి. అబద్దపు ప్రచారం చెయ్యకండి, నలభై ఏళ్ల పాటు మీరు చేసింది ఇదే. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు, ఇది మా కర్మ అనుకుంటున్నాం’ అని అజయ్ అన్నారు. ఇదీచదవండి.. పువ్వాడ అజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశా: తుమ్మల -
పువ్వాడ అజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశా : తుమ్మల
సాక్షి,ఖమ్మం : బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అఫిడవిట్‌కు సంబంధించి ఫార్మాట్ మార్చడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం ఖమ్మంలో తుమ్మల ఈ విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పువ్వాడ అఫిడవిట్ ఫార్మాట్ మార్పుపై ఇప్పటికే రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాను. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోని రిటర్నింగ్ అధికారి తీరుపై కోర్టుకు వెళతానని తెలిపారు. పువ్వాడ తన అఫిడవిట్లో డిపెండెంట్ కాలమ్ మార్చారు. డిపెండెంట్ కాలమ్‌లో ఎవరూ లేకపోతే నిల్ అని రాయాల్సి ఉంది. కానీ అలా రాయలేదు. పువ్వాడ నాలుగు సెట్స్ నామినేషన్లలో తప్పులున్నాయి. ఈసీ ఫార్మాట్లో అఫిడవిట్ లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగా. రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిబంధనలు పాటించలేదు. ఆ అధికారిపై పై న్యాయ పోరాటం చేస్తా’అని తుమ్మల తెలిపారు. రాష్ట్రమంతా ఓ పక్క...ఖమ్మం ఓ పక్క మీడియా సమావేశం అనంతరం తుమ్మల ఖమ్మం నియోజకవర్గ కాంగగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా రాజకీయ జీవితంలో ఇంత రసవత్తర పోటీ, ఇంత కసి, పట్టుదల ఉన్నఎన్నికలు చూడలేదు. రాష్ట్రమంత ఓ పక్క ఖమ్మం జిల్లా ఓ పక్క. పొరుగు రాష్ట్రం భీమవరంలో ఖమ్మం ఎన్నికలపై పందాలు కాస్తున్నారు. పందాలు మంచి సంస్కృతి కాదు. కానీ వందల కోట్ల పందాలు కాస్తున్నారంటేనే బీఆర్ఎస్ పనైపోయిందని అర్థమవుతోంది. ఖమ్మం ,పాలేరుపై వందల కోట్లు కుమ్మరించి నాయకులను అధికార పార్టీ కొనుగోలు చేస్తోంది. నన్ను, పొంగులేటిని ఓడించాలని అధికార యంత్రాంగాన్ని వాడుతున్నారు. మీ అరాచకాలన్నింటికీ చక్ర వడ్డీ తో సహా తిరిగి చెల్లిస్తాం. ఖమ్మం పౌరుషాల గడ్డ...40 ఏళ్ల రాజకీయ జీవితంలో మీ పరువు ప్రతిష్ట కోసం పనిచేశా. మత విద్వేషాలు లేకుండా భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఐక్యం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతుగా నిలవాలి. నాకు మద్దతుగా నిలిచిన తెలుగుదేశం శ్రేణులకు ధన్య వాదాలు. బీఆర్ఎస్ అభ్యర్థులు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో వర్కింగ్ ప్రెసిడెంట్‌కి తెలుసు’ అని తుమ్మల అన్నారు. ఇదీ చదవండి..మెదక్‌లో మళ్లీ పాత యుద్ధం.. పద్మాదేవేందర్‌రెడ్డి వర్సెస్ మైనంపల్లి -
తుమ్మల వర్సెస్ పువ్వాడ..పేలుతున్న మాటల తూటాలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వార్‌లో ఖమ్మం నియోజకవర్గం హాట్ సెగ్మెంట్‌గా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. ఖమ్మం నగరంలోని 50వ డివిజన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడపై తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు.ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ దొంగల పాలయిందన్నారు. సామాన్యుడు ఒక ప్లాటు కొనుక్కుంటే దాన్ని కూడా ఎప్పుడు ఎవరొచ్చి కబ్జా చేస్తారోనని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్తగా ట్రాన్స్పోర్ట్ మాఫియా కూడా నగరంలో తయారైందన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుంచి ఖమ్మం నగర ప్రజలు బయట పడాలంటే నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేయాలని తుమ్మల కోరారు. తుమ్మల వ్యాఖ్యలకు అదే స్థాయిలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి పువ్వాడ. ఖమ్మం 24వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పువ్వాడ తుమ్మలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం, పాలేరు ప్రజలు ఇంటికి పంపిస్తే మళ్ళీ పొర్లు దండాలు పెడుతూ ఖమ్మంలో తిరుగుతున్నావని తుమ్మలను ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్పప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారాన్ని అనుభవించి ప్రజలను బూతు పురాణంతో భయ బ్రాంతులకు గురి చెయ్యడం తప్ప తుమ్మల చేసిందేమీ లేదన్నారు. 40 ఏళ్ల పాటు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారో అదే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని,ఇదే నా మీరు చెప్పే నీతి నిజాయితీ అని ప్రశ్నించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు తనవైపే నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పువ్వాడ. -
కల్యాణ వెంకన్న వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల మొదటి స్నాతకోత్సవం గురువారం వైభవంగా సాగింది. ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, వెండి డాలరు, యోగ్యతాపత్రం ఈ వేడుకకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 8 సంవత్సరాల పాటు శుక్ల, యజుర్వేదం విద్యను అభ్యసించిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలను అందజేశారు. చెవిరెడ్డి సొంత నిధులతో ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, 10 గ్రాములు వెండి డాలరును బహూకరించారు. అవకాశం దేవుడిచ్చాడు, సంకల్పం చెవిరెడ్డి తీసుకున్నారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వేదవిద్య పరిరక్షణ బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వేద పాఠశాల నిర్వహణ చాలా కష్టతరమైనదని, అయినా చెవిరెడ్డి దంపతులు వేద పాఠశాల నిర్వహణకు సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు. నేటి కాలంలో చెవిరెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఏ పని అయినా ముందుండి కష్టపడి ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వ్యక్తులను తన 58 ఏళ్ల కాలంలో ఎక్కడా చూడలేదన్నారు. నాడు నలుగురు.. నేడు ప్రపంచ స్థాయి నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన వేద పాఠశాలను నేడు 200 మంది విద్యార్థులతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సంకల్పించడం శుభ పరిణామమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామిపై చెవిరెడ్డికి ఉన్న అపారమైన నమ్మకంతో వేద పాఠశాల విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. టీటీడీ తరఫున తుమ్మలగుంట వేద పాఠశాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీవారి కటాక్షంతోనే వేద పాఠశాల తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల నిర్వహణ దైవ సంకల్పమని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రామంలో అయితే భగవంతుడికి మూడు పూటలా నైవేద్యం పెడతారో.. ఆ గ్రామంలో ప్రజలకు ఆహార కొరత ఉండదన్న టీటీడీ మాజీ ఈఓ అజయ్‌కల్లాం మాటలతోనే శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పునాది పడిందని గుర్తుచేశారు. వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఆ తరువాత అనేక నిర్మాణాలు వాకింగ్ ట్రాక్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాయామం చేసి, వ్యాయామశాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వేద పాఠశాల నిర్వహణకు అడుగులు పడ్డాయన్నారు. నేడు దాదాపు 200 మంది విద్యార్థులకు చేరడం దైవ సంకల్పమేనన్నారు. పాఠశాలకు టీటీడీ వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. అతి పెద్ద పాఠశాల ఇక్కడే టీటీడీ వేద పారాయణ పథకం కింద అధ్యాపకుల నియామకానికి సహకారం అందించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం లభించిందని తెలిపారు. దేశంలోనే కాక, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వేద పాఠశాలను తుమ్మలగుంటలో నిర్మించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని ధర్మారెడ్డిని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం వేద పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అందరి ఆశీస్సులు జయేంద్ర సరస్వతి, చిన్నజీయర్ స్వామి తుమ్మలగుంట వేదపాఠశాలకు విచ్చేసి వేద విద్య ఆవశ్యకతను తెలియజేశారని గుర్తుచేశారు. తుమ్మలగుంట వేద పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, ప్రిన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యామ్, టీటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ శర్మ, వేదిక్ యూనివర్సిటీ అధికారులు ముష్టి పవన్, ఫణియాజుల, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ రాఘవన్, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు. -
ఏపీ బీజేపీలో రాజీనామాల కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అమిత్ షా పర్యటన వేళ బీజేపీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పుపై నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలపై పార్టీ నేతలు అంసతృప్తితో ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు జరగటం విభేదాలను బట్టబయలు చేసింది. సీనియర్లను సంప్రదించకుండా జిల్లా అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పదవులకు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిరసన గళం వినిపించారు. ఇదీ చదవండి: టీడీపీ స్థానిక నాయకులు, ఎన్ఆర్ఐల మధ్య సీట్ల పేచీ -
పొలిటికల్ కారిడార్: పాలేరు నాదే అంటున్న ఎర్రన్న..
-
మీరూ 66 సర్వేలు చేసుకోండి: తుమ్మల
హైదరాబాద్: తమ పాలనను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, గవర్నర్ అబద్దాలు చెబితే చర్చలో పాల్గొని దమ్ముంటే ఆ విషయాలు చెప్పాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిలదీశారు. విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, కనకయ్య, మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలతో కలిసి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అంతర్గతంగా చేసుకున్న సర్వేపై కాంగ్రెస్‌కు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. కావాలంటే మీరు 66 సర్వేలు చేసుకోండి ఎవరు వద్దన్నారు అని అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని మొత్తం వినకుండానే కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేయడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్నారన్నారు. కాంగ్రెస్ జన ఆవేదన సభ, టీడీపీ ప్రజాపోరు యాత్ర ప్రజలు దూరంగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణాకు వచ్చింది 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు కాగా తమ రెండేళ్ల పాలనలో 2700 కిలోమీటర్లు వచ్చాయన్నారు. పక్కా ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు విమర్శించారు. వ్యవసాయం గురించి తెలియని పెద్దమనిషి వ్యవసాయం సంక్షోభంలో ఉందనటం హాష్యాస్పదం ఉందని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ హౌసింగ్ మంత్రిగా కట్టని ఇళ్లకు బిల్లులిచ్చి డబ్బులు నొక్కేయలేదా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బతుకు బజారే అవుతుందని విమర్శించారు. -
ఈపీసీ స్థానంలో కొత్త విధానం: తుమ్మల
రోడ్డు కాంట్రాక్టుల్లో ఇప్పటి వరకు ఉన్న ఈపీసీ విధానాన్ని రద్దు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేశారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న కమిషన్ ఆఫ్ టెండర్స్ నియామకాల్లో మార్పులు చేసి తదుపరి విధివిధానాలు పటిష్ఠం చేయనున్నట్లు తెలిపారు. ఈ కొత్త విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. -
తుమ్మలకు ''నామా''లు
-
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజన కళాకారుడి హత్య
ఖమ్మం: చింతూరు మండలం తుమ్మల గ్రామంలో మావోయిస్టులు ఓ గిరిజన కళాకారుడిని పోలీస్ ఇన్ఫార్మర్ అన్న నెపంతో కాల్చి చంపారు. సిపిఎం కార్యకర్త అయిన ముత్యం అలియాస్ భిక్షం కొమ్ముడోలు కళాకారుడు. నిన్న కూడా సిపిఎం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముత్యం పాల్గొన్నాడు. శబరి ప్రాంతానికి చెందిన మావోయిస్టు దళాలు ముత్యంను తన కొడుకు ఎదుటే హత్య చేశారు. ఎంత చెప్పినా వినకుండా ముత్యం పోలీసులకు సమాచారం అందజేస్తున్నాడని మావోయిస్టులు ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రజాకోర్టులో గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు అతనిని చంపినట్లు ఆ లేఖలో తెలిపారు.