
ఈపీసీ స్థానంలో కొత్త విధానం: తుమ్మల
రోడ్డు కాంట్రాక్టుల్లో ఇప్పటి వరకు ఉన్న ఈపీసీ విధానాన్ని రద్దు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేశారు.
ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న కమిషన్ ఆఫ్ టెండర్స్ నియామకాల్లో మార్పులు చేసి తదుపరి విధివిధానాలు పటిష్ఠం చేయనున్నట్లు తెలిపారు. ఈ కొత్త విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు.