నేటి నుంచి గిరిజనోత్సవాలు | tribal peoples celebrations today onwards | Sakshi
Sakshi News home page

నేటి నుంచి గిరిజనోత్సవాలు

Published Thu, Feb 20 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

tribal peoples celebrations today onwards

 పార్వతీపురం, న్యూస్‌లైన్ :  జిల్లాలో మొట్టమొదటి సారిగా స్పందన అనే పేరుతో నిర్వహిస్తున్న  గిరిజనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.విద్యాసాగర్ హాజరుకానున్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు పట్టణ శివారున (నర్సిపురం రోడ్డులో) ఉన్న ఆరు ఎకరాల స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా  వేదికను తీర్చిదిద్దారు. రాష్ట్రం నలుమూలల నుంచి 150 మహిళా సంఘ సభ్యులను రప్పించి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 50 స్టాల్స్‌ను వ్యాపార ప్రకటనల కోసం కేటాయించారు.  చిన్నపిల్లల కోసం జైంట్ వీల్, తదితర వినోదభరిత ఏర్పాట్లు కూడా చేశారు. సబ్‌ప్లాన్ మండలాలకు చెందిన గిరిజనులు ఉత్సవాలకు వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులు వేశారు. కార్యక్రమానికి అతిథులుగా వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల విశ్రాంతి కోసం వేదిక పక్కనే ప్రత్యేక విడిది ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ, మున్సిపల్ కమిషనర్ వీసీహెచ్ అప్పలనాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతాయి.
 
 తొలి రోజు కార్యక్రమాలివే...
  గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి విద్యాసాగర్  ఉత్సవాలు ప్రారంభిస్తారు.   సాయంత్రం 4 గంటలకు పాతబస్టాండ్  వద్ద ర్యాలీ ప్రారంభమై ఉత్సవ వేదిక వద్దకు ఐదు గంటలకు చేరుకుంటుంది.
   5 నుంచి 6 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం. ముగ్గుల పోటీలు, విలువిద్య ప్రదర్శన.   6  గంటల నుంచి  6.15  వరకు గిరిజన డప్పు వాయిద్యం.    6.15 నుంచి 6.45 గంటల వరకు సవర నృత్యం, గిరిజన సంప్రదాయ సంగీతం  (శ్రీగోపాల్ బృందం).
 
   6.45 గంటల నుంచి 7.15 గంటలవరకు లంబాడి నృత్యం
 (నల్గొండ).   7.15 గంటల నుంచి 7.35 వరకు గిరిజనసంస్కృతి, సంప్రదాయాల నృత్య రూపకం   (ఆర్.వాసుదేవరావు బృందం).  
 
   7.35 నుంచి 8 గంటల వరకు జట్టు ఆశ్రమ విద్యార్థులచే కూచిపూడి నృత్యం.   8 నుంచి 9.30 గంటల వరకు మనోరంజన కార్యక్రమాలు
 
 రెండో రోజు కార్యక్రమాలివే..
  సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల వరకు గిరిజన విద్యార్థుల కోలాటం  5 గంటల నుంచి 5.30 గంటల వరకు గజ్జెల నృత్యం.
 
  5.30 గంటల నుంచి 6 గంటల వరకు కోయ నృత్యం (భద్రాచలం వారిచే)  6 గంటల నుంచి 6.30 వరకు ‘దోమకాటు’నృత్యరూపకం(సాలూరు).  6.30గంటల వరకు 7.15 గంటల వరకు రేలా రేలా జానపద నృత్యం(గజపతినగరం)  7.15 గంటల నుంచి 7.30 గంటల వరకు చీపురుపల్లి వారిచే పిల్లల కార్యక్రమం.
 
  7.30 గంటల నుంచి 8 గంటల వరకు ఆఫ్రికన్ ట్రైబుల్ డ్యాన్స్(విశాఖపట్నం)  8 గంటల నుంచి 9.30 గంటల వరకు సంగీత విభావరి(బ్లాక్-అంధ గాయనీగాయకులు)
 3వ రోజు కార్యక్రమాలివే...
 
  సాయంత్రం 5 గంటల నుంచి 5.30 థింసా నృత్యం(పాడేరు)
  5.30 నుంచి 6 గంటల వరకు వెంట్రిలాక్విజమ్(మిమిక్రీ శ్రీనివాస్ శ్రీకాకుళం).  6 గంటల నుంచి 6.30 గంటల వరకు  నృత్యం( బెంకిని, నారాయణపట్నం).  6.30 గంటల నుంచి 6.45 వరకు గిరిజన నృత్యం(కెజీబీవీ గుమ్మల క్ష్మీపురం విద్యార్థినులు).  6.45 నుంచి 7.30 వరకు కూచిపూడి నృత్యం(ఆర్.శ్రీకాంత్)  7.30 గంటల నుంచి 9 గంటల వరకు నృత్యం( ప్రిన్సి డ్యాన్స్ గ్రూప్, బరంపురం).
 4వ రోజు కార్యక్రమాలివే..
 
  ముగింపు రోజైన నాల్గవ రోజు కేంద్ర మంత్రి వి.కిషోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ ముఖ్య అతిథిగా హజరు కానున్నారు.
 
  సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరక సాంస్కృతిక కార్యక్రమాలు.  5 నుంచి 5.30 గంటల వరకు కొమ్ము కోయ డ్యాన్స్ (రంపచోడవరం).  5.30 గంటల నుంచి 6 గంటల వరకు డప్పు విన్యాసం(ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగో బృందంచే).
 
  6 నుంచి 7 గంటల వరకు ముగింపు ఉత్సవాలు, ఆస్తుల పంపకం.
  7.30 నుంచి 8 గంటల వరకు గుసాడి నృత్యం(ఉట్నూరు).
  8 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు. మాల్గాడి శుభృబందంచే సంగీత విభావరి, లుక్స్ రాజశేఖర్
 (ఢీ) బృందంచే నృత్యం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement