సాక్షి, విజయనగరం : గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసిందని, ఒక్కరూపాయి కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. చంద్రబాబు కమిషన్ కోసమే నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించలేదని చెప్పారు. సోమవారం పార్వతీపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణ దాసు, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు జోగారావు చిన్న అప్పలనాయుడు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మీడియాతో మాట్లాడుతూ... విజయనగరం జిల్లాలో 186 కోట్ల రూపాయలతో ఆసుపత్రులను అబివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ( సీఎం జగన్ ఆకాంక్ష అదే: ఆళ్ల నాని )
రాష్ట్రంలో కరోనా వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని, దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కోవిడ్‌ను ఎదుర్కోవటంలో ఏపీ ముందుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి 16వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లతో పాటు 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. గిరిజనుల సమస్యలు తీర్చడానికి అన్ని ఐటీడీఏల పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మంజూరు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment