అమ్మో.. సర్కారు దవాఖానాలు? | Government hospitals in Vizianagaram | Sakshi
Sakshi News home page

అమ్మో.. సర్కారు దవాఖానాలు?

Published Thu, Sep 25 2014 1:30 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

అమ్మో.. సర్కారు దవాఖానాలు? - Sakshi

అమ్మో.. సర్కారు దవాఖానాలు?

 విజయనగరం ఆరోగ్యం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటేనే రోగులు భయపడుతున్నారు. ఆస్పత్రులకు వెళ్లినా..సరైన వైద్యం అందుతుందన్న నమ్మ కం కలగడం లేదు. చాలా ఆస్పత్రుల్లో వైద్యులు ఉంటే పరికరాలు ఉండడం లేదు. పరికరాలు ఉంటే వైద్యులు ఉండడం లేదు. జిల్లా కేంద్రాస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. కొందరు వైద్యులు కమీషన్లకు కక్కుర్తిపడి రోగుల సంక్షే మాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఏడు వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు ఉ న్నాయి. వీటిలో కేంద్రాస్పత్రి, ఘోష ఆస్పత్రి, పార్వతీ పురం ఏరియా ఆస్పత్రి, బాడంగి, ఎస్.కోట, భోగాపు రం, గజపతినగరం ఆస్పత్రులు ఉన్నాయి.
 
 అలాగే జిల్లావ్యాప్తంగా 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌ఎన్‌సీలు ఉన్నా యి. అయితే జిల్లాలో ఇన్ని ఆస్పత్రులు ఉన్నప్పటికీ ఎక్కడా కనీస సౌకర్యాలు లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో విశాఖలోని కేజీహెచ్ దిక్కువుతుంది. ము ఖ్యంగా కేంద్రాస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు వెంటిలేటర్లు,సెంట్రల్ ఆక్సిజన్, మ త్తు వైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ప డుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చే స్తున్న వైద్యుల్లో 80శాతం మందికి క్లీనిక్‌లు ఉండడంతో రోగులను క్లీనిక్‌లకు తరలిస్తున్నారన్న విమర్శలు ఉన్నా యి. ఇందులో ఎక్కువగా కేంద్రాస్పత్రి, ఘోష ఆస్పత్రుల వైద్యులపై ఆరోపణలు వినిపిస్తున్నారుు.
 
 లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా..  పైసలు ఇవ్వాల్సిందే
 ఘోష ఆస్పత్రిలో రోగి బంధువులు రోగులను పరామర్శించ డానికి వెళ్లినా.. అక్కడి నుంచి బయటకు వచ్చి నా.. చేతిచమురు వదిలించుకోవాల్సిందే. దీనిపై రోగు లు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవ రూ పట్టించుకోవడం లేదు.
 
 పరికరాల కొనుగోలులో నిర్లక్ష్యం
 కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రుల్లో పరికరాల కొనుగోలుకు అవసరమైన నిధులు ఉన్నప్పటికీ వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈఆస్పత్రుల్లో అల్ట్రాసౌండ్ స్కాన్‌లు ఉన్నా..ప్రయోజనం లేకుండాపోతోంది. అ ల్ట్రాస్కాన్‌లు వల్ల క్లారిటీ లేకపోవడంతో వైద్యులు ప్రైవే టు స్కాన్‌లకు రోగులను రిఫర్‌చేస్తున్నారు. ప్రతి స్కాన్ కు రూ.200 నుంచి రూ.300వరకు స్కాన్ సెంటర్ల నిర్వా హకులు వైద్యులకు కమీషన్ ఇస్తున్నట్టు సమాచారం.
 
 పిల్లల వైద్యుల కొరత
 కేంద్రాస్పత్రి, ఘోష ఆస్పత్రుల్లో పిల్లల వైద్యుల కొర త వేధిస్తోంది. కేంద్రాస్పత్రిలో ఒకే ఒక్క వైద్యుడు ఉ న్నారు.ఏదైనా కారణంతో ఆయన సెలవుపెడితే వైద్య సేవలు అందడంలేదు. ఘోషఆస్పత్రిలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. ఇక్కడ ప్రత్యేక నవజాతి శిశువుల సం రక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఆరుగురు పిల్లల వైద్యు లు ఉండాల్సిఉండగా..ఇద్దరు మాత్రమే ఉ న్నారు. దీంతో పిల్లలకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అంద డంలేదు. అలాగే రెండేళ్ల క్రితం ఘోష ఆస్పత్రికి గైనిక్ బ్లాక్ మంజూరైంది. ఇప్పటివరకు ఇది పూర్తి కాలేదు.
 
 నిధులు పెంచినా మెరుగైన పడని పారిశుద్ధ్యం
 ఆస్పత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణ కోసం ప్రభుత్వం ని ధులను రెట్టింపుచేసినా పారిశుద్ధ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. గతంలో ప్రతినెలా రూ.2.44లక్షలు మంజూరైతే ఇప్పుడు రూ.4.39లక్షలు మంజూరవుతుంది. కానీ అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో శిక్షణ కా ర్యక్రమాలకు ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి మంజూరు చేసిన రూ.17లక్షలకు ఆడిట్ నిర్వహించలేదు.
 
 ఏళ్ల తరబడిపాతుకుపోయిన సిబ్బంది :
 కేంద్రాస్పత్రి, ఘోష ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఏళ్ల తరబడికి పాతుకుపోయారు. దీంతో వారు శాసించే స్థాయికి చేరుకున్నారు. ఒక్కొక్కరు పది నుంచి 15 ఏళ్లు గా ఇక్కడే పని చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement