parvathi puram
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. 13వ రోజు షెడ్యూల్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. నేడు(శుక్రవారం) 13వ రోజు సామాజిక సాధికారిత బస్సుయాత్ర పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఉదయం గం. 10.30ని.లకు సీతానగరం మండలం లచ్చయ్యపేటలో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం ఉంటుంది. ఉదయం 11గంటలకు కాశయ్యపేట సచివాలయాన్ని వైఎస్సార్సీపీ నేతలు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ జరుగనుంది. ఈ సభలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొననున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధరణికోటలో వ్యాపార, ఉద్యోగ ప్రతినిధులతో పార్టీ నేతలు సమావేశం కానున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు విలేకర్ల సమావేశం, గం. 3.45ని.లకు ధరణికోట బేబీ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం గం. 4L45ని.లకు గ్రామ సచివాలయాన్ని వైఎస్సార్సీపీ నేతలు సందర్శించనున్నారు. సాయంత్రం గం. 5:30 ని.లకు అమరావతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లోలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం గం. 12:15ని.లకు పెద్దతిప్పసముద్రం నుండి బైక్ ర్యాలీ, ఒంటి గంటకు కేజీఎన్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం గం. 2:30 ని.లకు బైక్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. మాదవయ్యగారి పల్లె, పులికల్లు మీదుగా బైక్ ర్యాలీ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
పోటీకి వెళ్తే.. పతకంతోనే ఇంటికి..!
పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన పడాల సంతోష్ నచ్చిన రంగంలో రాణించేందుకు ఆసక్తి ఉంటే చాలని నిరూపించాడు. ఏడో తరగతి వరకూ రెగ్యులర్ విద్యాభ్యాసం చేసిన ఆ యువకుడు చదువు వంటబట్టకపోయినా ఓపెన్ టెన్త్ ద్వారా పది పాసయ్యాడు. వ్యాయామంపై ఆసక్తి ఉన్న సంతోష్ తన పేదరికాన్ని పక్కన పెట్టి ఇంటివద్దే ఉంటూ బాడీ బిల్డర్‌గా అవతరించాడు. ఎప్పటికైనా ఇంటర్నేషనల్ స్టేజీపై ప్రదర్శన ఇవ్వాలనుకున్న కలను మహారాష్ట్రలోని పూణేలో జరిగిన మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో సాకారం చేసుకున్నాడు. పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం కాలనీలో ఉంటున్న సంతోష్ దేశంలో ఎక్కడ బాడీ బిల్డర్ పోటీలు జరిగినా ప్రదర్శన ఇస్తూ ప్రతిభ చూపుతున్నాడు. అనుకున్నది సాధించి.. సంతోష్ చదువు ఏడవతరగతితో ఆగిపోయింది. తండ్రి మజ్జయ్య రోజువారీ కూలీకాగా, తల్లి సత్యవతి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికరాలు. బాడీ బిల్డింగ్ పోటీలపై ఆసక్తి ఉన్న సంతోష్ ఇంటి వద్దే తర్ఫీదు పొంది మంచి బాడీ బిల్డర్‌గా శరీర సౌష్టవాన్ని మెరుగుపరుచుకున్నాడు. పలు పోటీల్లో పాల్గొంటూ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. ప్రోత్సహిస్తున్న భార్య 29 ఏళ్ల సంతోష్ ఇప్పటివరకూ 29 పర్యాయాలు స్టేట్ లెవెల్లో ప్రథమ స్థానంలో నిలిచి మెడల్స్ సాధించాడు. ఏడు పర్యాయాలు స్టేట్ లెవెల్ చాంపియన్ షిప్ సాధించాడు. నాలుగేళ్ల క్రితం వివాహం జరగ్గా, సంతోష్‌కు బాడీబిల్డింగ్ పోటీలపై ఆసక్తి ఉండడంతో భార్య రాధారాణి ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పటికీ చిన్నచిన్న ప్రైవేట్ కూలీ పనులు చేస్తున్న సంతోష్ ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. పదోతరగతి అర్హతతో ఉండే ఉద్యోగాల కోసం పలుచోట్లకు వెళ్తున్నాడు. తన భార్య ప్రోత్సాహం కారణంగానే ఈ అవకాశం, మెడల్స్ లభించాయని సంతోష్ తెలిపాడు. జిల్లాకు ఖ్యాతి.. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తరువాత జిల్లాకు చెందిన యువకుడు జాతీయ స్థాయిలో రాణించడం, దేశ నలుమాలలో ఎక్కడ బాడీ బిల్డింగ్ పోటీలు జరిగినా ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నాడు. అంతేకాకుండా జిల్లా నుంచి 40 మంది యువకులకు బాడీ బిల్డింగ్‌లో తర్ఫీదు ఇస్తూ వారిలో 20 మంది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతున్నాడు. సాధించిన విజయాలు రాష్ట్రస్థాయిలో 29సార్లు ప్రథమ స్థానం 15సార్లు చాంపియన్ ఆఫ్ చాంపియన్ జిల్లాస్థాయిలో 16సార్లు ప్రథమ స్థానం మిస్టర్ సౌత్ ఇండియా పోటీల్లో రెండోస్థానం ఐబీబీఎఫ్ జూనియర్ నేషనల్స్‌లో రెండోస్థానం 2012 పూణెలో జరిగిన జూనియర్‡ నేషనల్ మిస్టర్ ఇండియాలో రెండవ స్థానం 2014 గుజరాత్లో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియాలో ఐదవ స్థానం 2015 మహారాష్ట్రలో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియాలో నాల్గవ స్థానం 2018 పూణెలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో ప్రథమ స్థానం 2021 శ్రీకాకుళం, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో మిస్టర్ ఆంధ్రా, ఓవరాల్ చాంపియన్ 2022 పూణెలో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియా పోటీల్లో బ్రాంజ్ మెడల్ -
టీడీపీ ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసింది
సాక్షి, విజయనగరం : గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసిందని, ఒక్కరూపాయి కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. చంద్రబాబు కమిషన్ కోసమే నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించలేదని చెప్పారు. సోమవారం పార్వతీపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణ దాసు, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు జోగారావు చిన్న అప్పలనాయుడు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మీడియాతో మాట్లాడుతూ... విజయనగరం జిల్లాలో 186 కోట్ల రూపాయలతో ఆసుపత్రులను అబివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ( సీఎం జగన్ ఆకాంక్ష అదే: ఆళ్ల నాని ) రాష్ట్రంలో కరోనా వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని, దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కోవిడ్‌ను ఎదుర్కోవటంలో ఏపీ ముందుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి 16వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లతో పాటు 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. గిరిజనుల సమస్యలు తీర్చడానికి అన్ని ఐటీడీఏల పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మంజూరు చేశామని తెలిపారు. -
ప్రియురాలి బంధువుల వేధింపులు తాళలేక...
సాక్షి, విజయనగరం: ప్రియురాలి బంధువులు, పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం పార్వతీపురం మండలం వెంకటరాయుడు పేటలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరాయుడు పేటకు చెందిన మంత్రపుడి సురేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియటంతో వారు అతడి కక్ష గట్టారు. ప్రియురాలి బంధువులు.. పోలీసులతో కుమ్మక్కై సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన సురేష్ ఆత్మహత్య యత్నించాడు. -
పేరుకే చిన్నోడు కానీ లెక్కల్లో రారాజు
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఆ కుర్రాడికి పట్టుమని పన్నెండేళ్లు నిండలేదు. పెద్దపెద్ద చదువులు చదువలేదు. గణితంలో వయసుకు మించిన ప్రతిభ చూపుతున్నాడు. లెక్కల తికమకలను క్షణాల్లో ఛేదిస్తున్నాడు. అందరినీ ఆలోచింపజేస్తున్నాడు. ఆ బాలుడే..పార్వతీపురం పట్టణానికి చెందిన వరదా రాజన్, సంధ్యల ముద్దుబిడ్డ రాజ్ రిజ్వన్. ప్రస్తుతం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. లెక్కల్లో మాత్రం బాల మేధావిగా గుర్తింపు తుచ్చుకున్నాడు. వేద గణితంలో మంచి పట్టు సాధించాడు. గణిత అష్టావధానంలో పాల్గొనే స్థాయికి చేరుకున్నాడు. కట్టి పడేసిన గణిత అష్టావదానం.... పట్టణంలోని కన్యకాపరమేవ్వరి కల్యాణ మండపంలో వాకర్సు క్లబ్ వారు నిర్వహించిన గణిత అష్టావధానంలో రాజ్ రిజ్వన్ పాల్గొని ప్రతిభ కనబడిచాడు. ఎనిమిది మంది గణిత ఉపాధ్యాయులు, మేధావులు వేసే ప్రశ్నలు చేధించి ఔరా అనిపించాడు. శాశ్వత క్యాలెండర్లో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల వరకు ఏదో ఒక డేట్ చెబితే ఆ వారం పేరు చెప్పడం.. క్యూబ్ రూట్ (ఘన మూలం) ఆరంకెల సంఖ్య వరకు చెప్పడం, మాయా చదరం(4/4)ను ఇచ్చిన మూడంకెల సంఖ్యకు అనుగుణంగా ఏ వైపు నుంచి లెక్కించినా ఒకే సంఖ్య ముప్పై రకాలుగా రాబట్టడం ఇతని నైజం. మనస్సంకలనం.. పది వరుస సంఖ్యలను (ముడంకెలు) తీసుకుని కూడితే ఆ సంఖ్యలు చెబితే మొత్తం విలువ చెప్పుడం, విలువ చెబితే ఆ సంఖ్యలను చెప్పడం బాలుడి జ్ఞాపకశక్తికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వంద ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం, ఈ ఫోన్ నంబర్లలో 46వ ఫోన్ నంబర్ ఎంత అని అడిగితే తడుముకోకుండా చెప్పగలిగే జ్ఞానాన్ని సొంతం చేసుకున్నాడు. క్యాలుక్యులేటర్‌లో పట్టని లెక్కలను కూడా అతి సునాయాసంగా చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. తండ్రి రాజన్, తల్లి సంధ్య, తాత య్య, నాయినమ్మలు వరదా సత్యనారాయణ, లక్ష్మిల ఆశీస్సులు పొందాడు. -
అందాల దృశ్య కావ్యం
పార్వతీపురం : కనుచూపు మేరంతా పరచుకున్న పచ్చదనం. కొండకోనల్ని చూస్తుంటే మనసంతా పరవశం. నీలిమబ్బుల సోయగం..అనువణువూ అందమైన దృశ్య కావ్యం. ఆ అందాల సౌరభం ఆస్వాదించాలంటే.. పెదబొండపల్లి గ్రామం వెళ్లాలి. పార్వతీపురం మండలంలోని ఈ గ్రామం ఇటీవలి వర్షాలతో పచ్చదనంతో కనువిందు చేస్తోంది. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. -
ఆలయ భూముల ఆక్రమణల తొలగింపు
పార్వతీపురం: దేవుడి భూములను ఆక్రమించుకున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మెయిన్‌రోడ్డులో ఉన్న జగన్నాథ స్వామి దేవాలయ పరిసర ప్రాంతంలో ఉన్న ఆలయ భూములను కొంత మంది ఆక్రమించుకొని దుకాణాలు నిర్వహించుకుంటున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. దేవాదాయ శాఖ అధికారులు పోలీసులతో కలిసి ఆదివారం ఆలయ ప్రాంగణానికి చేరుకొని అక్రమ నిర్మాణాలను తొలగించారు. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
అమ్మో.. సర్కారు దవాఖానాలు?
విజయనగరం ఆరోగ్యం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటేనే రోగులు భయపడుతున్నారు. ఆస్పత్రులకు వెళ్లినా..సరైన వైద్యం అందుతుందన్న నమ్మ కం కలగడం లేదు. చాలా ఆస్పత్రుల్లో వైద్యులు ఉంటే పరికరాలు ఉండడం లేదు. పరికరాలు ఉంటే వైద్యులు ఉండడం లేదు. జిల్లా కేంద్రాస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. కొందరు వైద్యులు కమీషన్లకు కక్కుర్తిపడి రోగుల సంక్షే మాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఏడు వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు ఉ న్నాయి. వీటిలో కేంద్రాస్పత్రి, ఘోష ఆస్పత్రి, పార్వతీ పురం ఏరియా ఆస్పత్రి, బాడంగి, ఎస్.కోట, భోగాపు రం, గజపతినగరం ఆస్పత్రులు ఉన్నాయి. అలాగే జిల్లావ్యాప్తంగా 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌ఎన్‌సీలు ఉన్నా యి. అయితే జిల్లాలో ఇన్ని ఆస్పత్రులు ఉన్నప్పటికీ ఎక్కడా కనీస సౌకర్యాలు లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో విశాఖలోని కేజీహెచ్ దిక్కువుతుంది. ము ఖ్యంగా కేంద్రాస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు వెంటిలేటర్లు,సెంట్రల్ ఆక్సిజన్, మ త్తు వైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ప డుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చే స్తున్న వైద్యుల్లో 80శాతం మందికి క్లీనిక్‌లు ఉండడంతో రోగులను క్లీనిక్‌లకు తరలిస్తున్నారన్న విమర్శలు ఉన్నా యి. ఇందులో ఎక్కువగా కేంద్రాస్పత్రి, ఘోష ఆస్పత్రుల వైద్యులపై ఆరోపణలు వినిపిస్తున్నారుు. లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా.. పైసలు ఇవ్వాల్సిందే ఘోష ఆస్పత్రిలో రోగి బంధువులు రోగులను పరామర్శించ డానికి వెళ్లినా.. అక్కడి నుంచి బయటకు వచ్చి నా.. చేతిచమురు వదిలించుకోవాల్సిందే. దీనిపై రోగు లు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవ రూ పట్టించుకోవడం లేదు. పరికరాల కొనుగోలులో నిర్లక్ష్యం కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రుల్లో పరికరాల కొనుగోలుకు అవసరమైన నిధులు ఉన్నప్పటికీ వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈఆస్పత్రుల్లో అల్ట్రాసౌండ్ స్కాన్లు ఉన్నా..ప్రయోజనం లేకుండాపోతోంది. అ ల్ట్రాస్కాన్లు వల్ల క్లారిటీ లేకపోవడంతో వైద్యులు ప్రైవే టు స్కాన్లకు రోగులను రిఫర్‌చేస్తున్నారు. ప్రతి స్కాన్ కు రూ.200 నుంచి రూ.300వరకు స్కాన్ సెంటర్ల నిర్వా హకులు వైద్యులకు కమీషన్ ఇస్తున్నట్టు సమాచారం. పిల్లల వైద్యుల కొరత కేంద్రాస్పత్రి, ఘోష ఆస్పత్రుల్లో పిల్లల వైద్యుల కొర త వేధిస్తోంది. కేంద్రాస్పత్రిలో ఒకే ఒక్క వైద్యుడు ఉ న్నారు.ఏదైనా కారణంతో ఆయన సెలవుపెడితే వైద్య సేవలు అందడంలేదు. ఘోషఆస్పత్రిలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. ఇక్కడ ప్రత్యేక నవజాతి శిశువుల సం రక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఆరుగురు పిల్లల వైద్యు లు ఉండాల్సిఉండగా..ఇద్దరు మాత్రమే ఉ న్నారు. దీంతో పిల్లలకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అంద డంలేదు. అలాగే రెండేళ్ల క్రితం ఘోష ఆస్పత్రికి గైనిక్ బ్లాక్ మంజూరైంది. ఇప్పటివరకు ఇది పూర్తి కాలేదు. నిధులు పెంచినా మెరుగైన పడని పారిశుద్ధ్యం ఆస్పత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణ కోసం ప్రభుత్వం ని ధులను రెట్టింపుచేసినా పారిశుద్ధ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. గతంలో ప్రతినెలా రూ.2.44లక్షలు మంజూరైతే ఇప్పుడు రూ.4.39లక్షలు మంజూరవుతుంది. కానీ అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో శిక్షణ కా ర్యక్రమాలకు ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి మంజూరు చేసిన రూ.17లక్షలకు ఆడిట్ నిర్వహించలేదు. ఏళ్ల తరబడిపాతుకుపోయిన సిబ్బంది : కేంద్రాస్పత్రి, ఘోష ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఏళ్ల తరబడికి పాతుకుపోయారు. దీంతో వారు శాసించే స్థాయికి చేరుకున్నారు. ఒక్కొక్కరు పది నుంచి 15 ఏళ్లు గా ఇక్కడే పని చేస్తున్నారు. -
పదేళ్లు పని చేరుుంచుకున్నారు... ఇప్పుడేం చేస్తారో..!
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్: ‘పదేళ్లు మాతో పని చేరుుంచుకున్నారు... ఇప్పుడేమో మరో నెల రోజుల్లో ఉద్యోగాలు పోతాయని చెబుతున్నారు... తమ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం తమను ఆదుకోకపోతే తమ కుటుంబాలతో ఆత్మహత్యలే శరణ్యమని...’ తోటపల్లి ప్రాజెక్టు భూసేకరణ విభాగంలో ఒప్పంద ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ విభాగానికి సంబంధించి పార్వతీపురంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఉప కలెక్టర్ కార్యాలయూన్ని ఈ నెల రెండో తేదీనే ఎత్తేస్తారన్న ప్రచారం జరిగింది. ఇంతలో మరో నెల రోజులు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ నెలాఖరుతో దీనిని ఎత్తేస్తే తామంతా వీధిన పడతామని ఒప్పంద ఉద్యోగులు వాపోతున్నారు. పార్వతీపురంలోని చర్చివీధిలో, ఎస్ఎన్పీ కాలనీలో తోటపల్లి ప్రాజెక్టు భూసేకరణ యూనిట్ 3, 1 కార్యాలయూలను ఏర్పాటు చేశారు. వీటిలో డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు తదితర వారిని రెవెన్యూ శాఖ నుంచి నియమించారు. ఆయూ కార్యాలయూల్లో పని చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు తదితర వారిని ఒప్పంద పద్ధతిపై తీసుకున్నారు. జిల్లాలో మూడు యూనిట్లలో దాదాపు 30 మంది వరకు వీరు పని చేస్తున్నారు. వీరిని పదేళ్లుగా అన్ని విధుల్లో చివరకు ఎన్నికల విధులకు కూడా వినియోగించుకున్నారని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎ.మురళి, ఎస్.సుబ్రహ్మాణ్యం, జి.విశ్వనాథం, జి.శ్రీను తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పనులు చేరుుంచుకున్న తరువాత ఇప్పుడేం తమ అవసరం లేదంటూ తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని వాపోతున్నారు. పదేళ్లుగా ఎన్నో అవకాశాలొచ్చినా ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే ఉన్నామని ఇప్పుడేమో ఏం చేస్తుందో తెలియడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమను తొలగిస్తే కుటుంబాలతో ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యమని చెబుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. -
పోటీ విరమించి...వైఎస్ఆర్ సీపీలో చేరిక
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్: పార్వతీపురంలోని 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గండి లక్ష్మి పోటీ నుంచి విరమించి గురువారం రాత్రి వైఎస్ఆర్ సీపీలో తన బలగంతోపాటు చేరారు. ఆ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి వెంకటేష్, ఆ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి కోల సరోజినమ్మల ఆధ్వర్యంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను మెచ్చి, జగనన్న పాలనను స్వాగతిస్తూ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తాను కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నప్పటికీ పోటీ నుంచి విరమించుకుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని సరోజినమ్మకు పూర్తి మద్దతునిస్తానన్నారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గండి లక్ష్మితోపాటు సొండి మరియమ్మ, మీసాల లత, సొండి స్వాతి, నిమ్మకాయల జోజమ్మ, నిమ్మకాయల నిరోష తదితర సుమారు 100 కుటుంబాలు పార్టీలో చే రడం హర్షణీమన్నారు. రాబోయేది రాజన్న రాజ్యమని, ప్రజలందరికీ మంచి పాలన అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాగరాజు, షఫీ, పాలవలస గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజానపదం... ఝల్లుమంది
డప్పు వాయిద్యాల మోతలు, ఈలల గోలలు, నృత్యాలు, గుండెలు ఝల్లన గజ్జెల సవ్వడులు, పక్షుల కిలకిలారావాల్లా శ్రావ్యంగా గిరిపడతుల జానపదాలు ఇలా ఒకటేమిటి ఆదివాసుల అబ్బుర విన్యాసాలన్నీ అక్కడ ఆవిష్కృతమయ్యాయి. వీధులన్నీ సాంస్కృతిక పరవళ్లతో పులకించిపోయాయి. రహదారులు గిరిజనుల కళా వైభవానికి వేదికలయ్యాయి. మలి సంధ్యవేళ...మలయమారుతం స్పర్శలో తనువులు తన్మయంలో ఉన్న సమయం....అంతకు రెట్టించిన ఆనందం, సమ్మెహనంతో ఆహూతులు ఆదమరిచి, మరో లోకంలో విహరించారు. ఏజెన్సీ వాసుల కళావైభవాన్ని తిలకించి అబ్బురపడ్డారు. పార్వతీపురం, న్యూస్‌లైన్: గిరిజన సాంస్కృతిక వేదిక ‘స్పందన’ పేరుతో నిర్వహిస్తు న్న గిరిజనోత్సవాలు గురువారం సాయంత్రం పార్వతీపురంలో నవనవోన్మేషంగా ప్రారంభమయ్యాయి. ముందుగా వైఎస్సార్ విగ్రహం జంక్షన్ వద్ద ఐటీడీఏ పీఓ రజిత్ కుమార్ సైనీ, సబ్-కలెక్టర్ శ్వేతా మహంతి పచ్చ జెండా ఊపి ఉత్సవాల ఆరంభ సూచికగా ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా పీఓ డప్పు వాయించి ఉత్సవానికి ఊపు తీసుకొచ్చారు. అనంతరం కోయ, థింసా నృత్యాలతో గిరిజన సంస్కృతి ప్రతిబింబించే వివిధ ప్రదర్శనలతో ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మతోపాటు పలు శాఖలకు చెందిన అధికారులతో ఉత్సవ ప్రాంగణానికి ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 150 స్టాల్స్‌ను ప్రారంభించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన డప్పు విన్యాసం, సవర నృత్యం, సంప్రదాయ సంగీతం, లం బాడా, కూచిపూడి నృత్యం ఆహూతులను అలరించాయి. సంస్కృతి పరిరక్షణకే ఉత్సవాలు: శ్రీకాకుళం కలెక్టర్ అంతకు ముందు జరిగిన ఉత్సవాల ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ గిరిజనుల ఆచారాలు, సంస్కృతిని పరిరక్షించేందు ఈ ఉత్సవాలు దోహదపడతాయని చెప్పారు. ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్‌సైనీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సౌరభగౌర్ మాట్లాడుతూ మంచి మనస్సుగల గిరిజనులు ఆర్థిక, విద్యా రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఉత్సవాలను జరిపేందుకు నిర్ణయించినప్పటికీ కొన్ని ఆటంకాల వల్ల చివరి క్షణంలో రద్దు చేసినట్టు చెప్పారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ ఏ అధికారైనా గిరిజనుల అభివృద్ధి కోసం కృషిచేసి వారి ఆచార సంప్రదాయాలకు గౌరవమిచ్చేలా విధులు నిర్వర్తించిన నాడు జీవితంలో సంతృప్తి పొందుతారని చెప్పారు. ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ మాట్లాడుతూ గిరిజనుల మనోభావాలను గుర్తించి, వారి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడి, జీవన విధానంలో మార్పు తెచ్చేందుకే ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇతర జిల్లాలలోని గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను, వారి జీవన విధానాలను ఈప్రాంతంలో ఉన్న వారికి తెలియపరిచేందుకు నాలుగు రోజులపాటు పలు కళారూపాలు, నృత్యప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సవరపు జయమణి, జాయింట్ కలెక్టర్ బి. రామారావులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ యూజీసీ నాగేశ్వరరావు, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, విజయనగరం ఆర్డీఓ బి. వెంకట్రావుతోపాటు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు యేచపు లక్ష్మి, డివిజన్ మహిళాసమాఖ్య అధ్యక్షురాలు నిమ్మక పెంటమ్మలు పాల్గొన్నారు. గిరిజన మహిళలైన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఏచపు లక్ష్మి, డివిజన్ మిహ ళాసమాఖ్య అధ్యక్షురాలు నిమ్మక పెంటమ్మలు ఉత్సవ వేదికపై మాట్లాడుతూ గిరిజన సంప్రదాయాలను వివరించారు. అనంతరం గిరిజన విద్యార్థులచే నిర్వహించిన విలువిద్యా ప్రదర్శన కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరబ్ గౌర్ ప్రారంభించారు. -
నేటి నుంచి గిరిజనోత్సవాలు
పార్వతీపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో మొట్టమొదటి సారిగా స్పందన అనే పేరుతో నిర్వహిస్తున్న గిరిజనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.విద్యాసాగర్ హాజరుకానున్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు పట్టణ శివారున (నర్సిపురం రోడ్డులో) ఉన్న ఆరు ఎకరాల స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా వేదికను తీర్చిదిద్దారు. రాష్ట్రం నలుమూలల నుంచి 150 మహిళా సంఘ సభ్యులను రప్పించి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 50 స్టాల్స్‌ను వ్యాపార ప్రకటనల కోసం కేటాయించారు. చిన్నపిల్లల కోసం జైంట్ వీల్, తదితర వినోదభరిత ఏర్పాట్లు కూడా చేశారు. సబ్‌ప్లాన్ మండలాలకు చెందిన గిరిజనులు ఉత్సవాలకు వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులు వేశారు. కార్యక్రమానికి అతిథులుగా వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విశ్రాంతి కోసం వేదిక పక్కనే ప్రత్యేక విడిది ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ, మున్సిపల్ కమిషనర్ వీసీహెచ్ అప్పలనాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతాయి. తొలి రోజు కార్యక్రమాలివే... గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి విద్యాసాగర్ ఉత్సవాలు ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు పాతబస్టాండ్ వద్ద ర్యాలీ ప్రారంభమై ఉత్సవ వేదిక వద్దకు ఐదు గంటలకు చేరుకుంటుంది. 5 నుంచి 6 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం. ముగ్గుల పోటీలు, విలువిద్య ప్రదర్శన. 6 గంటల నుంచి 6.15 వరకు గిరిజన డప్పు వాయిద్యం. 6.15 నుంచి 6.45 గంటల వరకు సవర నృత్యం, గిరిజన సంప్రదాయ సంగీతం (శ్రీగోపాల్ బృందం). 6.45 గంటల నుంచి 7.15 గంటలవరకు లంబాడి నృత్యం (నల్గొండ). 7.15 గంటల నుంచి 7.35 వరకు గిరిజనసంస్కృతి, సంప్రదాయాల నృత్య రూపకం (ఆర్.వాసుదేవరావు బృందం). 7.35 నుంచి 8 గంటల వరకు జట్టు ఆశ్రమ విద్యార్థులచే కూచిపూడి నృత్యం. 8 నుంచి 9.30 గంటల వరకు మనోరంజన కార్యక్రమాలు రెండో రోజు కార్యక్రమాలివే.. సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల వరకు గిరిజన విద్యార్థుల కోలాటం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు గజ్జెల నృత్యం. 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కోయ నృత్యం (భద్రాచలం వారిచే) 6 గంటల నుంచి 6.30 వరకు ‘దోమకాటు’నృత్యరూపకం(సాలూరు). 6.30గంటల వరకు 7.15 గంటల వరకు రేలా రేలా జానపద నృత్యం(గజపతినగరం) 7.15 గంటల నుంచి 7.30 గంటల వరకు చీపురుపల్లి వారిచే పిల్లల కార్యక్రమం. 7.30 గంటల నుంచి 8 గంటల వరకు ఆఫ్రికన్ ట్రైబుల్ డ్యాన్స్(విశాఖపట్నం) 8 గంటల నుంచి 9.30 గంటల వరకు సంగీత విభావరి(బ్లాక్-అంధ గాయనీగాయకులు) 3వ రోజు కార్యక్రమాలివే... సాయంత్రం 5 గంటల నుంచి 5.30 థింసా నృత్యం(పాడేరు) 5.30 నుంచి 6 గంటల వరకు వెంట్రిలాక్విజమ్(మిమిక్రీ శ్రీనివాస్ శ్రీకాకుళం). 6 గంటల నుంచి 6.30 గంటల వరకు నృత్యం( బెంకిని, నారాయణపట్నం). 6.30 గంటల నుంచి 6.45 వరకు గిరిజన నృత్యం(కెజీబీవీ గుమ్మల క్ష్మీపురం విద్యార్థినులు). 6.45 నుంచి 7.30 వరకు కూచిపూడి నృత్యం(ఆర్.శ్రీకాంత్) 7.30 గంటల నుంచి 9 గంటల వరకు నృత్యం( ప్రిన్సి డ్యాన్స్ గ్రూప్, బరంపురం). 4వ రోజు కార్యక్రమాలివే.. ముగింపు రోజైన నాల్గవ రోజు కేంద్ర మంత్రి వి.కిషోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ ముఖ్య అతిథిగా హజరు కానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరక సాంస్కృతిక కార్యక్రమాలు. 5 నుంచి 5.30 గంటల వరకు కొమ్ము కోయ డ్యాన్స్ (రంపచోడవరం). 5.30 గంటల నుంచి 6 గంటల వరకు డప్పు విన్యాసం(ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగో బృందంచే). 6 నుంచి 7 గంటల వరకు ముగింపు ఉత్సవాలు, ఆస్తుల పంపకం. 7.30 నుంచి 8 గంటల వరకు గుసాడి నృత్యం(ఉట్నూరు). 8 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు. మాల్గాడి శుభృబందంచే సంగీత విభావరి, లుక్స్ రాజశేఖర్ (ఢీ) బృందంచే నృత్యం -
వారు....సర్వ భక్షకులు!
జంఝావతి ప్రాజెక్టు డ్యాం సైట్లో రూ.లక్షలు విలువ చేసే చెట్లు మాయం పట్ట్టించుకోని అధికారులు భూ ఆక్రమణలు జరుగుతున్నా కళ్లు మూసుకుంటున్న వైనం కిటికీలు, ద్వారబంధాలు పోతే పోలీసులకు ఫిర్యాదుచేసిన అధికారులు మాయమైన కంటైనర్, జీఐ పైపులపై విచారణ ఎందుకు చేపట్టరు? జంఝావతి జలాశయ పథకం ఇంజినీరింగ్ విభాగంలో కొందరు సర్వభక్షకులుగా మారారు. రబ్బర్డ్యామ్కు చెందిన సామగ్రిని, కంటైనర్, ఐజీ పైపులు, పాడైన గృహాల కిటికీలు, ద్వార బంధాలు ఇలా ఒకటేమిటి దొరినవాటిని దొరికినట్టు చుట్టేసిన వారు.. చెట్లను కూడా భక్షించారని సమాచారం. దీంతో పాటు భూ ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు కళ్లుమూసుకుని కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి వెనుక రాజకీయ నేతల హస్తం కూడా ఉంది. పార్వతీపురం, న్యూస్‌లైన్: జంఝావతి ప్రాజెక్టు డ్యాం సైట్లో వేలాది రూపాయల విలువైన చింత, మామిడి, కొబ్బరి, సపోటా చెట్లు మాయమయ్యాయి. సుమారు 30 ఏళ్ల క్రితం వేసిన చె ట్లను జేసీబీతో కూల్చి మాయం చేసినట్టు తెలిసింది. అయినా ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఓ అధికారి అండదండలతోనే ఇదంతా జరుగుతున్నట్లు కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుల అండదండలు, ఉన్నతాధికారుల మద్దతు ఉండడడం వల్లే ఇంత ధైర్యంగా ఒక్కొక్కటీ మాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయంలో రబ్బరు డ్యామ్ నిర్మా ణం కోసం ఆస్ట్రియా శాస్త్రవేత్తలు వినియోగించిన సుమారు రూ. 40 లక్షల విలువచేసే కంటైనర్, జీఐ పైపులు 2013 జూలైలో మాయమైనా ఇంతవరకూ శాఖాపరంగా ఎలాంటి విచారణ చేపట్టలేదు. దీంతో ఏంచేసినా పరవాలేదులే అన్న ధీమాకు అక్కడి సిబ్బంది చేరుకున్నారు. అందినకాడికి దోచుకోడానికి అలవాటుపడ్డారు. కొంతమంది ఇంటి దొంగలే దర్జాగా స్వాహా చేసేస్తున్నారు. అంతేకుండా ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి గత కొన్నేళ్లుగా అవినీతి రాజ్యమేలుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. 2010లో జంఝావతి కాలువల్లో పూడికలు తీయకుండా నే పనులు జరిగినట్లు రూ. 50 లక్షలు డ్రా చేశారు. వీటికి సంబంధించిన మెజర్‌మెంటు బుక్‌లను అప్పట్లో డీఈఈగా పనిచేసిన వ్యక్తి మాయం చేశారు. దీనిపై కేసు నడుస్తున్నప్పటికీ నేటికీ విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా 1975లో జంఝావతి డ్యాం నిర్మాణం కోసం వినియోగించే వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోసేందు కు సుమారు అర ఎకరా స్థలంలో పెట్రోల్ బంకును ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ స్థలం కూడా ఆక్రమణలకు గురయ్యింది. దీని వెనుక పర్యవేక్షణాధికారి అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. తవ్వుకుంటూ పోతే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత జరిగినా పట్టించుకోని పర్యవేక్షణాధికారి ఈ కార్యాలయానికి సంబంధించి తలుపులు, ద్వార బందాలు పోయినట్లు మాత్రం కొమరాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాని లక్షల రూపాయలు విలుచేసే సామగ్రి దొంగల పాలైనా ఇటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గానీ, శాఖాపరమైన దర్యాప్తు గానీ చేయకపోవడం విచారకరం. దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లు మాయం కాలేదు ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో చెట్లు మాయంపై వివరణ కోరగా అటువంటిదేమీ లేదని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఒక చెట్టు పడిపోయింది తప్ప, ఎవరూ చెట్లను నరికి తీసుకుపోలే దని చెప్పారు.