పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్: పార్వతీపురంలోని 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గండి లక్ష్మి పోటీ నుంచి విరమించి గురువారం రాత్రి వైఎస్‌ఆర్ సీపీలో తన బలగంతోపాటు చేరారు. ఆ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి వెంకటేష్, ఆ వార్డు వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి కోల సరోజినమ్మల ఆధ్వర్యంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను మెచ్చి, జగనన్న పాలనను స్వాగతిస్తూ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తాను కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నప్పటికీ పోటీ నుంచి విరమించుకుని వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిని సరోజినమ్మకు పూర్తి మద్దతునిస్తానన్నారు.
ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గండి లక్ష్మితోపాటు సొండి మరియమ్మ, మీసాల లత, సొండి స్వాతి, నిమ్మకాయల జోజమ్మ, నిమ్మకాయల నిరోష తదితర సుమారు 100 కుటుంబాలు పార్టీలో చే రడం హర్షణీమన్నారు. రాబోయేది రాజన్న రాజ్యమని, ప్రజలందరికీ మంచి పాలన అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాగరాజు, షఫీ, పాలవలస గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
పోటీ విరమించి...వైఎస్‌ఆర్ సీపీలో చేరిక
Published Fri, Mar 28 2014 3:32 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement