పదేళ్లు పని చేరుుంచుకున్నారు... ఇప్పుడేం చేస్తారో..!
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్: ‘పదేళ్లు మాతో పని చేరుుంచుకున్నారు... ఇప్పుడేమో మరో నెల రోజుల్లో ఉద్యోగాలు పోతాయని చెబుతున్నారు... తమ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం తమను ఆదుకోకపోతే తమ కుటుంబాలతో ఆత్మహత్యలే శరణ్యమని...’ తోటపల్లి ప్రాజెక్టు భూసేకరణ విభాగంలో ఒప్పంద ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ విభాగానికి సంబంధించి పార్వతీపురంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఉప కలెక్టర్ కార్యాలయూన్ని ఈ నెల రెండో తేదీనే ఎత్తేస్తారన్న ప్రచారం జరిగింది. ఇంతలో మరో నెల రోజులు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ నెలాఖరుతో దీనిని ఎత్తేస్తే తామంతా వీధిన పడతామని ఒప్పంద ఉద్యోగులు వాపోతున్నారు.
పార్వతీపురంలోని చర్చివీధిలో, ఎస్‌ఎన్‌పీ కాలనీలో తోటపల్లి ప్రాజెక్టు భూసేకరణ యూనిట్ 3, 1 కార్యాలయూలను ఏర్పాటు చేశారు. వీటిలో డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు తదితర వారిని రెవెన్యూ శాఖ నుంచి నియమించారు. ఆయూ కార్యాలయూల్లో పని చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు తదితర వారిని ఒప్పంద పద్ధతిపై తీసుకున్నారు. జిల్లాలో మూడు యూనిట్లలో దాదాపు 30 మంది వరకు వీరు పని చేస్తున్నారు. వీరిని పదేళ్లుగా అన్ని విధుల్లో చివరకు ఎన్నికల విధులకు కూడా వినియోగించుకున్నారని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎ.మురళి, ఎస్.సుబ్రహ్మాణ్యం, జి.విశ్వనాథం, జి.శ్రీను తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని పనులు చేరుుంచుకున్న తరువాత ఇప్పుడేం తమ అవసరం లేదంటూ తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని వాపోతున్నారు. పదేళ్లుగా ఎన్నో అవకాశాలొచ్చినా ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే ఉన్నామని ఇప్పుడేమో ఏం చేస్తుందో తెలియడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమను తొలగిస్తే కుటుంబాలతో ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యమని చెబుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.