super speciality hospital
-
విజయవాడ, విశాఖపట్నంలో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన
-
పటాన్‌చెరుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఈ నెల 22న శంకుస్థాపన
పటాన్చెరు: పటాన్చెరు పట్టణానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రాబోతుంది. దశాబ్దాల కాలంగా కాలుష్యంతో సహజీవనం చేసి అంతు చిక్కని వ్యాధులు, అనారోగ్యంతో ఇటు ఆర్థికంగా, అటు ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పటాన్చెరు ప్రజలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి ఫలితంగా ఆధునిక శస్త్ర చికిత్సలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కొల్లూరు డబుల్ బెడ్రూంలను ప్రారంభించి, అనంతరం 11 గంటలకు పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పక్కన నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసి జీఓ ఎంఎస్ 82 జారీ చేసిందన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి రూ.184.87 కోట్లు మంజూరైంది. ఈ మొత్తం వ్యయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 75 శాతం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఖర్చు చేయనుంది. సివిల్ వర్క్స్ నిర్మాణం మరియు పరికరాలు, ఫర్నిచర్ మరియు ల్యాబ్‌ల సేకరణ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇనన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో వెలువడే కాలుష్యం మూలంగా వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభాగాలను, నిపుణులైన వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటారన్నారు. ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్రచికిత్స విభాగాలు సైతం ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఆస్పత్రి నిర్మాణ వివరాలు.. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మూడు అంతస్తుల్లో 93 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. వార్డులు... ఎన్ఐసీయూ వార్డ్, డయాలసిస్, కార్డియాక్, ఎంఐసీయూ, న్యూరో, కార్డియాక్ ఐసీయూ, ఎన్‌ఎస్‌ఐసీయూ, గైనకాలజీ, సర్జరీ వార్డ్, జనరల్ మెడిసిన్ వార్డులు ఉంటాయి. ల్యాబ్ వివరాలు... మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, బ్లడ్ బ్యాంక్, క్యాత్ ల్యాబ్‌లు ఉండనున్నాయి. శంకుస్థాపనకు సిద్ధం.. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పటాన్చెరు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు స్థలాన్ని సిద్ధం చేశారు.ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పక్కనే గల రూరల్ హెల్త్ సెంటర్ స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేటాయించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందుబాటులో ఉండే వైద్య సేవలు.. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. -
దసరా నాటికి వరంగల్ హెల్త్‌సిటీ పూర్తి!
సాక్షి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శరవేగంగా నిర్మిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. ఇది వరంగల్ నగరానికే కాకుండా.. ఉత్తర తెలంగాణలో రోగుల అవసరాలు తీర్చేలా, దేశానికే ఒక మోడల్లా నిలిచేలా ఉంటుందని తెలిపారు. పేదలకు కార్పొరేట్ వసతులు అందుబాటులోకి వస్తాయ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. వరంగల్‌లో రూ.1,100 కోట్ల అంచనాతో చేపట్టిన 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ పనులను మంత్రి హరీశ్‌రావు శనివారం పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినంత వేగంగా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ నిర్మాణం పూర్తి చేస్తాం. దీనిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ ఏడాది దసరా నాటికి అందుబాటులోకి తీసుకొ చ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాల మాదిరిగానే గ్రామాల్లోనూ పల్లె దవాఖానాల సేవలు అందుబాటులోకి తెస్తున్నాం. మేం తీసుకున్న చర్యలతో ప్రజలు సర్కారీ దవాఖానాలవైపు చూస్తున్నారు. ఆస్పత్రుల్లో వసతుల కల్పన, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటివే దీనికి కారణం’’ అని హరీశ్‌రావు చెప్పారు. అవయవ మార్పిడి చికిత్సలు కూడా.. వరంగల్ ఆస్పత్రిలో 35 స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకొచ్చేలా నిర్మాణం జరుగుతోందని.. కిడ్నీ, లివర్ అవయవ మార్పిడి కూడా వరంగల్‌లో జరగనుందని హరీశ్‌రావు ప్రకటించారు. కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్స్ మార్పిడి కోసం అదునాతన పరికరాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు చాలావరకు జరిగాయని.. సీఎంతో మాట్లాడిన తర్వాత చిన్నపాటి మార్పుల వల్ల ఏరియా పెరిగిందని వివరించారు. 2 వేల పడకలను 2,250 పడకలకు పెంచామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ గోపి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిజమైన హిందూత్వవాది సీఎం కేసీఆర్: హరీశ్‌రావు పర్వతగిరి: సీఎం కేసీఆర్ నిజమైన హిందూత్వవాది అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని శివాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మీడియా తో మాట్లాడారు. అణువణువునా హిందూత్వం నాటుకుపోయిన వ్యక్తి తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే యాదాద్రి క్షేత్రాన్ని వేలకోట్లతో అధునాతన హంగులతో నిర్మించారని చెప్పా రు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. -
అవయవ మార్పిడికి నజరానా
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్స చేస్తే.. సదరు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు అందజేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలు చేయడంపై వైద్యులు దృష్టి సారించాలని.. వైద్య పరికరాలు, మందులు ఇతర అవసరాలను సమకూర్చుకునేందుకు నిధులు ఇస్తామని తెలిపారు. సదరు డాక్టర్లకు, పనిచేసే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. పేదలకు వైద్యం అందించడంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని.. నంబర్ వన్‌గా నిలిపేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం రాత్రి బాసరలో బసచేశారు. గురువారం ఉదయమే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తర్వాత ముధోల్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి, నిర్మల్‌లో నిర్మించనున్న 250 పడకల జిల్లా ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. సాయంత్రం ఆదిలాబాద్‌లో రూ.150 కోట్లతో నిర్మించిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. ఏడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు: దేశంలో పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మనదేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరవై ఏళ్లపాటు కొనసాగిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మూడే మెడికల్ కాలేజీలు వచ్చాయని.. ఏడేళ్ల స్వరాష్ట్ర పాలనలో ఏకంగా 17 ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అప్పట్లో వరంగల్‌లో రైతులు బస్తాకు రూపాయి చొప్పున జమ చేసుకుని ఆస్పత్రి కట్టుకుంటే.. తర్వాత సమైక్య పాలకులు దానిని మెడికల్ కాలేజీగా మార్చారన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల పనితీరుపై నెలనెలా సమీక్షిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. ఇక సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఈ నెల 5న హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్‌కార్డు అందిస్తామన్నారు. దేశం మెచ్చుకుంటుంటే.. ఇక్కడ విమర్శలు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు దారుణమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో తెలంగాణ ఇంటింటి సర్వే చేసి ఉత్తమ ఫలితాలు సాధించిన తీరును నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో బస్తీ దవాఖానాల ఏర్పాటును 15వ ఆర్థిక సంఘం మె చ్చుకుందని తెలిపారు. ఈ రెండింటినీ మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్న సూచనలు చేశాయని వివరించారు. సొంత జాగా ఉంటే ఇల్లు సొంత జాగా ఉన్న పేదలు ఇల్లు కట్టుకునేందుకు వీలుకల్పించే కార్యక్రమంపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నా రని హరీశ్‌రావు తెలిపారు. 57 ఏళ్లు దాటినవారికి పింఛన్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, రేఖా శ్యాంనాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
24 అంతస్తులతో.. 18 నెలల్లో..అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. వరంగల్‌లోని పాత సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ భారీ ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ తాజాగా ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించింది. టెండర్లు దాఖలు చేసిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 15న నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిన వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. సింగిల్ టెండర్లో రూ.1,100 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టే రోడ్లు, భవనాల శాఖ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టు కావడం విశేషం. ఇప్పటివరకు రోడ్లు, వంతెనలు, భవనాలు.. ఇలా ఏ కేటగిరీలో చూసినా అంత మొత్తంతో కూడిన సింగిల్ టెండర్ ప్రాజె క్టును ఆ శాఖ చేపట్టలేదు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా గడువులోగా చేసి చూపాలని అధికారులు భావిస్తున్నారు. ఒప్పందం కుదిరిన నాటి నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023 సెప్టెంబర్ ఆఖరుకల్లా ఆసుపత్రి భవనం అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. 24 అంతస్తులతో.. ఇటీవల ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలి సిందే. ఆరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భాగంగా వరంగల్‌లో చేపట్టేదే అతి పెద్దది. మిగతా ఐదు వేయి పడకలతో కూడినవి కాగా, వరంగల్ ఆసుపత్రి మాత్రం 1,750 పడకలతో నిర్మించను న్నారు. ఇప్పటికే పాత జైలు భవనాన్ని కూల్చి చదును చేశారు. 60 ఎకరాల సువిశాల స్థలంలో 24 అంతస్తులతో నిర్మిస్తారు. ఇక్కడ 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం అందు బాటులోకి రానుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో లేన ట్టుగా మొత్తం 34 విభాగాలతో కూడిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ రూపుదిద్దుకోనుంది. ఇందుకు మంచి ఎలివేషన్‌తో కూడిన డిజైన్‌ను సిద్ధం చేశారు. మూడు బ్లాకులుగా ఉండే ఈ భవనం ముందు భారీ పచ్చిక మైదానం, విశాలమైన ఫౌంటెయిన్ ఏర్పాటు చేస్తారు. నిమ్స్ విస్తరణ ఇప్పటివరకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనమే రాష్ట్రంలో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ప్లాన్ చేయగా, మరోవైపు ఏకంగా 2 వేల పడకలతో నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్టును కూడా రోడ్లు, భవనాల శాఖ చేపట్టనుంది. దీనికి సంబంధించి ప్లాన్లను సిద్ధం చేసే పనుల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న నిమ్స్ ఆసుపత్రి భవనానికి అనుబంధంగా ఈ నిర్మాణం జరగనుంది. ఇందుకు పక్కనే ఉన్న ఎర్రమంజిల్ క్వార్టర్స్ కాలనీని ఎంపిక చేశారు. దాదాపు 19 ఎకరాల్లో విస్తరించిన ఆ కాలనీ మొత్తాన్ని తొలగించి అక్కడ భారీ భవన సముదాయాలను నిర్మించనున్నారు. అక్కడున్న దాదాపు 300 క్వార్టర్స్‌ను ఇప్పటికే ఖాళీ చేయగా, త్వరలో వాటిని కూల్చనున్నారు. -
మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి
న్యూఢిల్లీ: దేశంలో వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కనీసం 600 మెడికల్ కాలేజీలు, 50 ‘ఎయిమ్స్’ తరహా సంస్థలు, 200 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావాలని అన్నారు. ప్రతి తాలూకాలో కనీసం ఒక వెటర్నరీ ఆసుపత్రి ఉండాలన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. గడ్కరీ శనివారం మహా రాష్ట్రలో సతారా జిల్లాలోని కరాడ్‌లో కోవిడ్–19 మహమ్మారిపై పోరాడిన యోధులను సన్మానిం చారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను నెలకొల్పేందుకు సహకార రంగం కూడా ముందు రావాలని పిలుపునిచ్చారు. మోదీతో సంభాషణను గడ్కరీ ప్రస్తావించారు. కరోనా తొలినాళ్లలో 13వేల వెంటిలేటర్లుండేవి. దేశంలో వెంటిలేటర్ల కొరత ఉందని తాను చెప్పగా, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని మోదీ ప్రశ్నించారని, ఇప్పుడు భారీగా 2.5 లక్షల వెంటిలేటర్లు ఉండొచ్చని బదులిచ్చానని చెప్పారు. చదవండి: Speaker Om Birla: చట్టసభల గౌరవం పెంచాలి -
‘ఆర్అండ్బీ’కి మెడికల్ ప్రాజెక్టులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణంలో తలమునకలై ఉన్న రోడ్లు, భవనాల శాఖ త్వరలో ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్ట నుంది. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రు లు, ఏడు మెడికల్ కాలేజీలు, 13 నర్సింగ్ కాలే జీలను నిర్మించాలని ఇటీవలే కేబినెట్ నిర్ణయిం చిన విషయం తెలిసిందే. వీటి నిర్మాణానికి దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మెడికల్ ప్రాజెక్టుకు సంబంధించి త్వర లో ఆర్ అండ్ బీ స్థలాల పరిశీలన ప్రారంభించ నుంది. ఆ తర్వాత డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు పిలవనుంది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే మెడికల్ ప్రాజెక్టు పూర్తి కోసం ఖాళీలు భర్తీ చేయాలని ఆర్అండ్బీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. పలు కేటగిరీలకు చెందిన 200 ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదించింది. నిర్మించాల్సిన కొత్త మెడికల్ కాలేజీలు.. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు కొత్త నర్సింగ్ కళాశాలలు: సంగారెడ్డి, మహబూ బాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్త గూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట కొత్త సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు: వరంగల్, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలం, అల్వాల్–ఓఆర్ఆర్ మధ్య. -
కరోనా రోగుల్ని పిండేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభణతో బాధితులు ప్రైవేట్ కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో పడకలు నిండిపోయాయనే పేరిట యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గతేడాది కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైన సమయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో, ఇప్పుడు మళ్లీ అటువంటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. అనేక ఆసుపత్రులు రోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వ్యాపారం మొదలు పెట్టాయి. లాభార్జనే ధ్యేయంగా వసూళ్లకు తెగబడుతున్నాయి. అనేక ఆసుపత్రులు ఒక్కొక్కరి వద్ద రోజుకు లక్ష రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక పేరొందిన ఆసుపత్రిలో 20 రోజుల క్రితం చేరిన ఒక రోగి నుంచి ఇప్పటికే రూ.18 లక్షలు వసూలు చేశారు. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉంది. 10 శాతం మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. దీంతో బయటకు రాలేక, మరో ఆసుపత్రికి వెళ్లలేక ఆ కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. ఇక సాధారణ ఆసుపత్రులు కూడా పడకలు ఖాళీ లేవంటూ, కృత్రిమ కొరత సృష్టిస్తూ బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. ఫీజు ఉత్తర్వులు గాలికే.. కరోనా చికిత్సలకు ఏ విధంగా ఫీజులు వసూలు చేయాలో ప్రభుత్వం గతేడాదే ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రు ల్లోని సాధారణ వార్డుల్లో కరోనా చికిత్సకు రోజుకు రూ.4 వేలు, ఆక్సిజన్‌పై ఉంటే రూ. 7,500, వెంటిలేటర్ మీద పెడితే రూ.9 వేలు వసూలు చేసుకోవచ్చు. పీపీఈ కిట్లు, మందులకు అదనంగా తీసుకోవచ్చని జీవోలో సర్కారు చెప్పింది. అయితే పీపీఈ కిట్లు, మందుల పేరుతో ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేశాయి. తెరపైకి సీలింగ్ ప్రతిపాదన డబ్బులు చెల్లిస్తేగానీ శవాలను బంధువులకు అప్పగించకుండా కొన్ని ఆసుపత్రులు వ్యవహరించిన తీరుపై గతేడాది పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఫీజుతో సంబంధం లేకుండా అన్నీ కలిపి ఇంత అనే సీలింగ్ ప్రతిపాదనను సర్కారు తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం 14 రోజులకు కలిపి కరోనా చికిత్సకు సాధారణ వార్డులో రూ. లక్ష, ఆక్సిజన్ వార్డులో రూ. 2 లక్షలు, ఐసీయూ వార్డులో రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలు వసూ లు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఆసుపత్రులు కూడా అంగీకరించాయి. కానీ ఆచరణలో అమలు కాలేదు. అలా చేస్తే 226 ప్రైవేట్ ఆసుపత్రుల్లోని 8,113 పడకల్లో సగం అంటే 4,056 పడకలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. వాటిని ప్రత్యేక యాప్ ద్వారా నింపాలని కూడా అనుకున్నారు. కానీ క్రమంగా కేసులు తగ్గి అప్పట్లోనే అది ఆచరణలోకి రాకపోవడంతో ఇప్పుడు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కోవిడ్ విజృంభిస్తూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మళ్లీ అదే తరహా దోపిడీని ప్రారంభించాయి. బీమా కుదరదు .. నగదు కట్టాల్సిందే.. ప్రస్తుతం అనేక ఆస్పత్రులు ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య బీమాను అంగీకరించడం లేదు. నగదు కడితేనే చూస్తామనే రీతిలో వ్యవహరిస్తుండటంతో లక్షల మొత్తంలో పాలసీ ఉన్నా బాధితులకు ఉపయోగపడడం లేదు. ఆస్పత్రుల యాజమాన్యాలు బీమా అంగీకరించేలా చూడాలని, లక్షల్లో వసూలు చేయడాన్ని నియంత్రించాలని, 50 శాతం పడకలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని రోగులకు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. -
టీడీపీ ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసింది
సాక్షి, విజయనగరం : గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసిందని, ఒక్కరూపాయి కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. చంద్రబాబు కమిషన్ కోసమే నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించలేదని చెప్పారు. సోమవారం పార్వతీపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణ దాసు, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు జోగారావు చిన్న అప్పలనాయుడు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మీడియాతో మాట్లాడుతూ... విజయనగరం జిల్లాలో 186 కోట్ల రూపాయలతో ఆసుపత్రులను అబివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ( సీఎం జగన్ ఆకాంక్ష అదే: ఆళ్ల నాని ) రాష్ట్రంలో కరోనా వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని, దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కోవిడ్‌ను ఎదుర్కోవటంలో ఏపీ ముందుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి 16వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లతో పాటు 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. గిరిజనుల సమస్యలు తీర్చడానికి అన్ని ఐటీడీఏల పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మంజూరు చేశామని తెలిపారు. -
‘గిరిజనులకు మెరుగైన వైద్యమే లక్ష్యం’
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ముత్యాలు రాజుకు ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీలో వెంటనే మొబైల్ ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. బుట్టాయిగూడంలో 10 ఎకరాలు స్థలంలో రూ. 75 కోట్లతో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. (ఏపీలో కోలుకున్నవారు 15 వేలు పైనే..) రాష్ట్రంలో 7 ఐటీడీఏ పరిధిలో మల్లీ స్పెషలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.11,400 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే లక్ష్యం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా అదనoగా మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. (కరోనా పేషెంట్లకు అండగా ఉంటాం) కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి: పర్యటనలో భాగంగా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడేo కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. అనంతరం బుట్టాయిగూడం కమ్యూనిటీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో మళ్లీ ఏజెన్సీకి వస్తానని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీలో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. వైద్యం అందించడంలో ఆలస్యం వహిస్తే అధికారులే బాధ్యత వహించాలని తెలిపారు. వర్ష కాలంలో అంటు వ్యాధులు ప్రభలకుండా ముందస్తూ జాగ్రత్త లు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరావు, ఐటీడీఏ, పీఓ సూర్యనారాయణ, వైద్య అధికారులు పాల్గొన్నారు. ఐదు గిరిజన గ్రామాలకు వరం: నూతనంగా మంజూరైన మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి ఆళ్ల నాని స్థలం పరిశీలిచారు. మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం ఈ ప్రాంతంలో 5 గిరిజన గ్రామాలకు ఒక వరం అన్నారు. పోలవరం, బుట్టాయిగూడం, జీలుగుమిల్లి, విలీన మండలాల ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావడానికి మరింత తోడ్పాటు అందిస్తామని తెలిపారు.ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా రక్తహీనత మహమ్మారికి లోనవుతారని చెప్పారు. దశాబ్దాల తరబడి ఏజెన్సీలో గిరిజనులకు సరైన వైద్యం లేక అవస్థలుపడుతున్నారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారని చెప్పారు. స్త్రీల అనారోగ్యం సమస్య లు పరిస్కారానికి కొత్తగా నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. బుట్టాయిగూడంలో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ రావడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు ఎంతో ప్రయోజనం అన్నారు. -
'కరోనా' చికిత్సకు కొత్త ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సలు అందించేందుకు మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సిద్ధమైంది. గచ్చిబౌలి క్రీడాప్రాంగణంలోని 13 అంతస్తుల భవనంలో 1,500 పడకలతో ఉస్మానియాకు అనుబంధంగా ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విత్ పీజీ కాలేజ్)’ పేరుతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో సోమవారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఇకపై సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన పనిలేదు. ఐటీ కారిడార్‌లోని హైటెక్‌సిటీ, నానక్‌రాంగూడ, మాదాపూర్‌తో పాటు టోలిచౌకి, గోల్కొండ, వికారాబాద్ నుంచి వచ్చే వారికి ఈ కొత్త ఆస్పత్రిలోనే వైద్యసేవలు అందుతాయని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా కరోనా వైరస్ బారినపడిన వారికే చికిత్స అందిస్తారు. వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టాక, ఇది పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపుదిద్దుకోనుంది. అత్యవసర వైద్యం సహా గుండె, కాలేయం, కిడ్నీ, ఆర్థోపెడిక్ వంటి పూర్తిస్థాయి వైద్యసేవల్ని అందించనుంది. çఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, బిహార్‌కు చెందిన వెయ్యి మంది కూలీలు 20 రోజులు రేయింబవళ్లు శ్రమించి దీనికి రూపునిచ్చారు. ఇప్పటికే సివిల్‌వర్క్స్ సహా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో మిషన్ భగీరథ ద్వారా ఆస్పత్రికి నీటిని అందించే అవకాశం ఉంది. చదవండి: 500 దాటిన కరోనా మరణాలు పాజిటివ్ కేసులకు ఇక్కడే చికిత్స ఆరో అంతస్తులో పడకలను ఏర్పాటు చేశారు. ఒక్కో పడక మధ్య 8 నుంచి 12 అడుగుల దూరం ఉంది. వాటి పక్కనే సహాయకులు కూర్చొనేందుకు కుర్చీతో పాటు వెంట తెచ్చుకున్న వస్తువులు భద్రపర్చుకునేందుకు లాకర్‌ను ఏర్పాటు చేశారు. ఒక అంతస్తులో కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఉంటే, ఆ పై అంతస్తులో పాజిటివ్ కేసుల బాధితులు ఉంటారు. ప్రతి అంతస్తులో రెండు నర్సింగ్ స్టేషన్లు, రోగులను పరీక్షించడానికి ప్రత్యేక గది సిద్ధం చేశారు. ఐసోలేషన్ కేంద్రంలో చికిత్సలు అందించేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేస్తున్న 77 మంది వైద్యులు, 115 మంది స్టాఫ్ నర్సులను డిప్యుటేషన్‌పై ఇక్కడ నియమించారు. అవసరమైతే ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న జనరల్ మెడిíసిన్, అనస్థీషియన్ వైద్యులు సహా పారిశుద్ధ్య, సెక్యురిటీ కార్మికుల సేవలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇప్పటికే గాంధీ సహా కింగ్‌కోఠి, ఛాతీ, ఫీవర్, సరోజినీదేవి, నేచర్‌క్యూర్, యునానీ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో వైరస్ సామూహిక వ్యాప్తిచెందే ప్రమాదం ఉండటంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఈ సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 20 రోజులు.. వెయ్యి మంది కూలీలు నాడు.. 2007లో జరిగే 4వ మిలటరీ వరల్డ్ గేమ్స్‌ను పురస్కరించుకుని దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ పేరుతో 13 అంతస్తుల భవనం నిర్మాణం కోసం 2006 అక్టోబర్ 3న శంకుస్థాపన చేశారు. మిలటరీ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారికి అప్పట్లో ఇక్కడే వసతి కల్పించారు. అనంతరం అదే భవనంలో రాష్ట్రస్థాయి క్రీడాకారులకు వసతి కల్పించి ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. వైఎస్సార్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ భవనాన్నే కాదు క్రీడాంశాల్లో శిక్షణను పెద్దగా పట్టించుకోలేదు. శాట్స్‌కు ఎంపికైన వారికి ఒక అంతస్తులోనే వసతి కల్పించేవారు. మిగిలిన అంతస్తుల్లోని గదులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటం, ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోవడం, అదనంగా మరికొన్ని ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి రావడంతో ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని ఇటీవల స్వాధీనం చేసుకుంది. రోజుకు వెయ్యి మంది కూలీలను ఉపయోగించి కేవలం 20 రోజుల్లోనే ఈ అత్యాధునిక ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చింది. చదవండి: కరోనా పరీక్షల్లో ఏపీకి 2వ స్థానం ప్రత్యేకతలు.. పేరు: తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గచ్చిబౌలి క్రీడాప్రాంగణం విస్తీర్ణం: 9 ఎకరాలు భవనం విస్తీర్ణం: 5.30 లక్షల చ.మీ. భవనంలోని మొత్తం అంతస్తులు: 13 ఒక్కో అంతస్తులో ఉండే గదులు: 36 భవనంలోని మొత్తం గదులు: 468 మొత్తం పడకలు: 1,500 ఐసీయూ పడకలు: 500 -
ఊపిరి నిలిపిన మానవత్వం
కష్టాల్లో ఉన్న తోటివారిని ఆదుకోవాలన్న మనసు, సంకల్పం ఉన్న నలుగురు మనచుట్టూ ఉంటే చాలు అది ఎంత పెద్ద కష్టమైనా కరిగిపోతుంది. కాయకష్టం చేసి బతుకుపోరు సాగించే తమలో ఒకడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతుంటే చలించిపోయారా తోటి కూలీలు. బింధువులే సింధువైనట్లు..అందరూ ఒక్కటై తమకు తోచిన సాయం చేసి ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. సాక్షి, ప్రకాశం (ముండ్లమూరు) : కష్టకాలంలో తోడబుట్టిన వాళ్లనే పట్టించుకోని రోజులివి. అలాంటిది తోటి కూలికి ఆపద వస్తే అండగా నిలిచి మేమున్నాం అంటూ అందరూ ఒక్కటై లక్షల రూపాయలు విరాళాలుగా వసూలు చేసి అతనికి మరో జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే.. ముండ్లమూరు మండలం వేముల పంచాయతీలోని రమణారెడ్డిపాలెం గ్రామంలో సుమారు 300 కుటుంబాలున్నాయి. అన్ని గ్రామాల్లానే ఆ గ్రామంలోనూ మూడు పార్టీలు, రెండు మతాల వారు ఉన్నారు. కానీ ఆపదలో ఒక్కటై ఒకరికొకరు అండగా నిలిచి తోటి వారిలో మనోధైర్యాన్ని నింపారు. గ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాశ్యులు కావడంతో వారంతా బేల్దారి పనులకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. పదిమంది ఒక ముఠాగా ఏర్పడి కూలి పనులకు వెళ్తుంటారు. అందులో భాగంగా ఏటా తొలి ఏకాదశి అనంతరం ఇతర గ్రామాలకు వలసలు పోతుంటారు. ఈ ఏడాది బత్తుల నాగరాజు పదిమందిని తీసుకొని బతుకుదెరువు కోసం హైదరాబాద్ సెప్టెంబర్ మొదటి వారం వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే జ్వరం బారిన పడ్డాడు. పనుల హడావిడిలో పట్టించుకోక పోవడంతో ముదిరి డెంగీగా మారింది. అనుకోకుండా పడిపోవడంతో దగ్గరలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నాగరాజు బాగా క్షీణించడంతో మెరుగైన వైద్యసేవలు అవసరమని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎస్ఎల్జీ (శ్రీలక్ష్మీ గాయత్రి) సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలో చేర్చారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసిన అనంతరం నాగరాజుకి లివర్ పూర్తిగా దెబ్బతినిందని దీనికి తోడు డెంగీ అని నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో లాభంలేదని చెప్పారు. అప్పటికే అక్కడ మూడు లక్షల పదిహేను వేలరూపాయలు ఖచ్చు చేశారు. బతుకుతాడో లేదో చెప్పలేం గానీ హాస్పటల్లో రోజుకి లక్ష రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అప్పటికే బంధువుల వద్ద మూడు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే గత ఏడాది నాగరాజు తండ్రి బాలకోటయ్యకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అందిన కాడికి అప్పులు చేసి చూపించినా తండ్రి బతకలేదు. వారు రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. రోజుకి లక్ష రూపాయలు అంటే చాలా కష్టంతో కూడిన పని, ఇక వారికి అప్పు ఇచ్చేవారు కూడా లేరు. దీంతో నాగరాజుపై ఆశలు వదులుకున్నారు. తోటి కూలీల ఆపన్నహస్తం: ఇదే సమయంలో గ్రామానికి చెందిన మేస్త్రీలు, కూలీలు అతడిని చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. పరిస్థితి విషమించడంతో మనతో నిన్నటి వరకు కలిసి పని చేసిన వ్యక్తిని ఎలాగైనా బతికించుకుందాం అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు. నాగరాజు వైద్య ఖర్చుల కోసం తమకి తోచినంత సహాయం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కరు తమ వెసులుబాటుని బట్టి రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకు విరాళాలుగా నగదుని రూ.5,18,000 వసూలు చేశారు. వారికి తెలిసిన వైద్యులకు రిపోర్టులను చూపి వారి సలహా మేరకు నాగరాజుని హైదరాబాద్ నుంచి మంగళగిరి వద్ద ఎన్ఆర్ఐ వైద్యశాలకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. వెంటిలేటర్ సదుపాయం ఉన్న అంబులెన్స్‌లో సెప్టెంబర్ 23న ఎన్ఆర్ఐకి చేరుకున్నారు. నాగరాజు పరిస్థితిని చూసిన అక్కడి వైద్యులు లాభంలేదు, ఒంగోలు రిమ్స్‌కి తీసుకెళ్లండని సూచించారు. అక్కడ తెలిసిన మెడికల్ కాలేజి ప్రొఫెసర్ సహాయంతో అక్కడే వైద్యం చేయించేందుకు ఒప్పించారు. నాగరాజుకి ఏమైనా ప్రాణాపాయం అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకొన్న వైద్యులు నాగరాజుకి మళ్లీ అన్నీ పరీక్షలు చేసి చికిత్స చేయడం ప్రారంభించారు. దీంతో అతని పరిస్థితి రోజు రోజుకి కుదుట పడడంతో బతుకు పై ఆశలు చిగురించాయి. మరో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయగా కొంత మేర కోలుకోవడంతో నాగరాజుని ఈనెల 9న ఇంటికి పంపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడింది. అందరి సహాయ సహకారాలతో నాగరాజు బతకడంతో గ్రామంలో ఇలాంటి అపాయం ఎవరికి వచ్చినా తామంతా అండగా నిలుద్దామని యువకులు నిర్ణయానికి వచ్చారు. తమకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నాగరాజు కుటుంబ సభ్యులు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎస్ఎల్జీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగరాజు (ఫైల్) -
పలాస ఆస్పత్రి.. రిమ్స్‌కు అనుసంధానం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని పలాసలో ఏర్పాటు చేయనున్న 20 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్లను శ్రీకాకుళంలోని రిమ్స్ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకు వస్తున్నట్టు జీఓలో పేర్కొన్నారు. రూ. 50 కోట్ల ఖర్చుతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్లను పలాసలో ఏర్పాటు చేయనున్న విషయం పాఠకులకు తెలిసిందే. వైద్య విద్యార్థులు, రోగులకు ఉపయోగకరం ఇక్కడ పనిచేసేందుకు ఐదు రెగ్యులర్ పోస్టులు, 100 పోస్టులు కాంట్రాక్టు విధానంపైన, 60 పోస్టులు ఔట్ సోర్సింగ్ విధానంపైన భర్తీ చేసేందుకు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. రిమ్స్‌కు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అనుసంధానం చేయడం వల్ల ఇక్కడి వైద్య విద్యార్థులకు, పలాస సూపర్ స్పెషాలిటీలోని రోగులకు ఎంతో ఉపయోగం కానుంది. వైద్య విద్యార్థులు రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ వ్యాధులకు సంబంధించి పలు విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిమ్స్‌లోని వైద్యులు, వైద్య విద్యార్థులు సూపర్ స్పెషాలిటీలోని రోగులకు వైద్య సేవలు అందించేందుకు కూడా వీలు కలుగుతుంది. జిల్లాలోని పలు కమ్యూనిటీ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ ఆధీనంలో కొనసాగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా వైద్య విధాన పరిషత్‌కే అప్పగిస్తారని పలువురు భావించారు. అయితే ప్రభుత్వం రిమ్స్‌కు అనుసంధానం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో వలె కాకుండా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కావాల్సిన పోస్టులను కూడా మంజూరు చేయడం పట్ల అన్ని వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నియమించనున్న ఉద్యోగులకు ఏటా రూ.8.93 కోట్లు జీతాల కోసం వెచ్చించనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు ప్రతిపక్ష నాయకుని హోదాలో జిల్లాలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటించినపుడు ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారి కష్టాలతో పాటు వారి కుటుంబాలు పడుతున్న అవస్థలను నేరుగా తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పలాసకు మంజూరు చేస్తూ ఇటీవలే శంకుస్థాపన సైతం పూర్తి చేశారు. అదే విధంగా కిడ్నీ రోగులకు మనోధైర్యం కల్పించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఉద్దానం ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విధి విధానాలు తెలియాల్సి ఉంది రిమ్స్ ఆస్పత్రికి పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అనుసంధానం విషయం తెలుసుకున్నాను. ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి తమకు ఇంకా అందకపోయినా ఆదేశాలను చదివాను. అయితే ఈ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలు ఇంకా తెలియాల్సి ఉంది. రిమ్స్‌కు మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అనుసంధానం చేయడం ఎంతో ఉపయోగకరం. – డాక్టర్ కృష్ణవేణి, రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
హాస్పిటల్ రంగంలోకి ఇన్క్రెడిబుల్ ఇండియా
రాంగోపాల్‌పేట్: రూ.100 కోట్లతో అస్సాంలోని గౌహతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని వచ్చే 2021 ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి వస్తుందని ఇన్క్రెడిబుల్ ఇండియ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీవోవో ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ విజయ్‌కుమార్‌లు తెలిపారు. సికింద్రాబాద్ పార్క్‌లేన్‌లో ఈ గ్రూపు ఏర్పాటు చేసిన ఇన్క్రెడిబుల్ వన్ హోటల్‌ను వారు ప్రారంభించారు. గత ఏడాది ఆతిధ్య రంగంలోకి ప్రవేశించి లక్డీకపూల్లో హ్యాంప్‌షైర్ ప్లాజా, కొచ్చిలో రాడిసన్ బ్లూ పేరుతో ప్రారంభించామని ఇప్పుడు రూ.25 కోట్లతో పార్క్‌లేన్‌లో ఇన్క్రెడిబుల్ వన్ను ప్రారంభించినట్లు వెల్లడించారు.మ్యాన్‌ఫాక్చరింగ్ రంగంలోకి ప్రవేశించి రూ.60కోట్లతో పార్లీ సంస్థతో కలిసి యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌లో 3 ఎకరాల స్థలంలో బిస్కెట్, కేక్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
గిరిజనులకు ఆరోగ్య సిరి
సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి ఏర్పాటు వల్ల కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గైనికాలజిస్టు, ఆర్ధోపెడిక్, చిల్డ్రన్ స్పెషలిస్టులతోపాటు పలు రకాల వైద్య నిపుణుల నియామకం జరుగుతుంది. అంతే కాకుండా అత్యాధునికమైన సీటీ స్కాన్, ఎక్స్‌రే, డయాలసిస్ యంత్రాలతోపాటు పలు రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తారు. సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పనుంది. ఇందుకోసం కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ ఆస్పత్రి స్థాయి పెంచి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు అవగాహన రాహిత్యంతో నాటు వైద్యులను ఆశ్రయిస్తారు. వారిని ఒప్పించి ఆస్పత్రులకు తీసుకువచ్చినా ఉన్నత వైద్యం అందుబాటులో ఉండదు. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు వారు అంగీకరించరు. అందుచేత వారి చెంతనే అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటూ అందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో పాతపట్నం నియోజవర్గం పరిధిలోని కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనుంది. కొత్తూరు ఆస్పత్రే ఎందుకంటే.. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి ఏర్పాటుకు స్థల పరిశీలన చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీడీఏ అధికారులకు ఇటీవల ఆదేశాలు వచ్చాయి. దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగారు. కొత్తూరు సీహెచ్‌సీ ఆస్పత్రి ఏర్పాటుకు అనువుగా ఉందని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం కొత్తూరుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేసింది. ఇక్కడ ఆస్పత్రి నెలకొల్పితే సీతంపేట భామిని, హిరమండలం, పాతపట్నం, ఎల్ఎన్ పేట, మెళియాపుట్టి మండలవాసులకు అందుబాటులో ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయడం వల్ల విజయనగరం జిల్లాలోని గిరిజనులకు సైతం ఉపయోగపడుతుంది. జిల్లాలో రెండో పెద్దాస్పత్రి ఇంతవరకు జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం శ్రీకాకుళంలోని రిమ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇదే జిల్లాలోని రెండో పెద్దాస్పత్రి అవుతుంది. ఇక మీదట వైద్యం కోసం గిరిజనవాసులు శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లనవసరం ఉండదు. ఈ ఆస్పత్రి జిల్లాలోని గిరిజన ప్రజలతోపాటు మైదాన ప్రాంతవాసులకు సైతం ఉపయోగపడుతుంది. ఐటీడీఏ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో నరేష్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు కొత్తూరు సీహెచ్‌సీని పరిశీలించామన్నారు. సీహెచ్‌సీ ఆవరణ ఇందుకు అనువుగా ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు నివేదిక అందివ్వడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. సూపర్ స్పెషాలటీ ఆస్పత్రికి సుమారు రూ. 20 కోట్లు ఖర్చవుతుందన్నారు. -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నిధుల గ్రహణం
సాక్షి, ఆదిలాబాద్: అడవి బిడ్డల నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటవుతుందనగానే అందరూ హర్షం వ్యక్తం చేశారు. మారుమూల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్‌లో ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అలాంటిది దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గిరిజనులకు వైద్యసేవలు అందించాలనే మహోన్నత ఆశయంతో 2008లో ఆసుపత్రి ఏర్పాటుకు పూనుకున్నారు. ఇప్పటికే ఈ వైద్య కళాశాల ద్వారా ఆరు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు పూర్తయ్యాయి. తాజాగా ఈ కళాశాలకు 20 సీట్లతో పీజీ కోర్సు కూడా మంజూరైంది. రిమ్స్ వైద్య కళాశాలకు అనుబంధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. రూ.150 కోట్లతో.. ప్రధానమంత్రి స్వస్థి సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) మూడో దశలో ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌కు 210 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైంది. రిమ్స్ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న 3.42 ఎకరాల ఆసుపత్రి స్థలంలోనే రూ.150 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రి వ్యయంలో రూ.120 కోట్లు కేంద్ర ప్రభుత్వం, రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇందులో భవన నిర్మాణం కోసం రూ.77.58 కోట్లు వెచ్చిస్తుండగా, మెడికల్ ఫర్నీచర్, మౌలిక సదుపాయాలు, పరికరాల కోసం మిగితా నిధులను ఉపయోగించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్టు లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కింద పనులను అప్పగించారు. ఆ ఏజెన్సీ ఈ పనులను హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రాటెక్ సర్వీస్ లిమిటెడ్‌కు అప్పగించింది. గడువు దాటినా.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం 80–20 శా తం వాటాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయాలి. 2016 జూలై 16న భవన ని ర్మాణ పనులు ప్రారంభమై, 2018 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు పూర్తయినప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవన నిర్మాణం కోసం రూ.15 కోట్లు రావాల్సి ఉండగా మంజూరు చేయకపోవడంతో పనులు పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. పరికరాలు వచ్చేశాయ్.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే.. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రోలజీ, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, సీటీవీఎస్‌కు సంబంధించి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. పైన పేర్కొన్న వైద్య సేవల కొరకు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, యావత్మాల్ ప్రాంతాలకు వెళ్లాల్సి రావటంతో వైద్యం ఖర్చుతో పాటు రవాణా ఖర్చులు కూడా తడసి మోపెడవుతున్నాయి. తద్వారా పేద ప్రజల జేబుకు చిల్లు పడుతోంది. -
ఈ అత్యాధునిక ఆస్పత్రి వెనక ఓ విషాదం
సాక్షి, న్యూఢిల్లీ : ఓ అద్భుతం వెనక ఓ విషాధః దాగి ఉంటుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటుంటారు. అలాగే గుజరాత్లో అహ్మదాబాద్ నగరంలో ఇటీవల ఓ అద్భుతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అత్యాధునిక వసతులతో 17 అంతస్తుల అద్భుత ఆస్పత్రి భవనాన్ని ఆయన జనవరి 18వ తేదీన ప్రారంభించారు. ఎయిర్ అంబులెన్స్ సర్వీసుల కోసం మేడ మీద హెలిప్యాడ్ కలిగిన ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో ప్రపంచ స్థాయి వసతులను ఏర్పాటు చేశారు. 1500 బెడ్లు కలిగిన ఈ ఆస్పత్రిలో కాగితరహిత సంపూర్ణ కంప్యూటర్ వ్యవస్థను నెలకొల్పారు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా ఇటీవల సాంఘిక మాద్యమాల్లో విస్త్రతంగా చక్కెర్లు కొట్టాయి. ఇందులో జనరల్, ఎగ్జిక్యూటివ్ అనే రెండు కేటగిరీల కింద వైద్య సేవలు అందిస్తారు. జనరల్ కేటగిరీ కింద అవుట్ పేషంట్లకు యాభై రూపాయల నుంచి 150 రూపాయల వరకు చార్జి వసూలు చేస్తారు. ఇక ఆపరేషన్ చార్జీలు మూడువేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద అవుట్ పేషంట్లకు వంద నుంచి మూడు వందల రూపాయల వరకు, ఆపరేషన్లకు పది వేల నుంచి యాభైవేల రూపాయల వరకు చార్జీలు వసూలు చేస్తారు. మందులకయ్యే ఖర్చు రోగులే పూర్తిగా భరించాలి. ఈ ఆస్పత్రిని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన మెడికల్ ట్రస్టు నిర్వహిస్తోంది. అ అత్యాధునిక ఆస్పత్రి పక్కనే ఇదే మెడికల్ ట్రస్టు, ట్రస్టీల ఆధ్వర్యంలో 1931లో స్థాపించిన ‘వాడిలాల్ సారాభాయ్ జనరల్ హాస్పటల్ అండ్ చినాయ్ మేటర్నిటీ హోం’ నడుస్తోంది. 1155 పడకలు కలిగిన ఈ ఆస్పత్రిని నాటి నగర మేయర్‌గా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సిఫార్సు మేరకు మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించగా సారాభాయ్, చినాయ్ కుటుంబాలు ఆస్పత్రిని నిర్మించాయి. ప్రస్తుతం ఆస్పత్రి నిర్వహణకయ్యే ఖర్చులను మున్సిపాలిటీయే భరిస్తోంది. ఆస్పత్రి నిర్వహణకు తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీ ఉంది. ఇందులో సారాభాయ్, చినాయ్ కుటుంబాల వారసుల నుంచి నలుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, అహ్మదాబాద్ మున్సిపాలిటీ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మున్సిపాలిటీ పాలక పక్షం నుంచి నలుగురు కార్పొరేటర్లు, ప్రతిపక్షం నుంచి ఒక కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహించాలి. మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది కనుక ప్రతిపక్ష కార్పొరేటర్ మద్దతు కీలకంగా మారింది. దీంతో 2012 సంవత్సరం నుంచి పాలకపక్ష బీజేపీ నుంచే ఐదుగురు కార్పొరేటర్లు కమిటీకి సభ్యులుగా ఉంటున్నారు. ప్రతిపక్ష కార్పొరేటర్ స్థానాన్ని తొలగించారు. అప్పటి నుంచి కమిటీలో కార్పొరేటర్లదే పైచేయిగా మారి చారిటీ కుటుంబాల సభ్యుల పాత్ర నామమాత్రంగా మారిపోయింది. అత్యాధునిక హంగులతో కొత్త ఆస్పత్రిని నిర్మిస్తున్న కారణంగా సారాభాయ్ ఆస్పత్రిలోని పడకలను 1155 నుంచి 200 పడకలకు కుదించాలని 2013లో నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అంతటితో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిన కమిటీ గత డిసెంబర్ నెలలో ఐదు వందల పడకలకు కుదించాలని తీర్మానించింది. ఆస్పత్రి ఆవరణలోనే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎల్ వైద్య కళాశాల పనిచేస్తోంది. ఈ ఆస్పత్రిలో ప్రతివిభాగానికి కళాశాలకు చెందిన ప్రొఫెసర్ అధిపతిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్లు పనిచేస్తున్నారు. ఒక్క ప్రొఫెసర్లను మినహాయించి మిగతా అందరిలో ఎక్కువ మందిని మున్సిపాలిటీ మెడికల్ ట్రస్ట్ కొత్త ఆస్పత్రికి బదిలీ చేసింది. పడకలు పోయి, వైద్యులు పోవడంతో సారాభాయ్ ఆస్పత్రిని నమ్ముకున్న రోగులు విలపిస్తున్నారు. కొత్తా ఆస్పత్రికి పోవచ్చుగదా! అంటే అంత సొమ్ము తమకు ఎక్కడిదని పేద రోగులు బోరుమంటున్నారు. సారాభాయ్ ఆస్పత్రిలో పేద ఔట్ పేషంట్లకు ఉచిత వైద్యం. ఆపరేషన్లకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల వరకు వసూలు చేస్తారు. మందులు ఉచితం. ఈ ఆస్పత్రికి నెలకు సరాసరి 60 వేల మంది ఔట్ పేషంట్లు, ఆరువేల ఇన్‌పేషంట్లు వస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఏం కావాలన్నది ప్రశ్న. ఇదే ప్రశ్నను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కుల్దీప్ ఆర్య ముందు మీడియా ప్రస్తావించగా, సారాభాయ్ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, 20 నుంచి 25 శాతం తక్కువకు కొత్త ఆస్పత్రి కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయి వైద్యాన్ని అందిస్తున్నామని, అంతమాత్రం డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కొత్త ఆస్పత్రిని నిర్మించడం మంచిదేగానీ దాని కోసం ఉన్న ఆస్పత్రిని నాశనం చేయడం ఎందుకని సారాభాయ్ ఆస్పత్రి నిర్వహణ కమిటీలో సభ్యులైన బ్రిజేష్ భాయ్ చినాయ్, రూపా చినాయ్ విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆస్పత్రి పాతదిగా కనిపిస్తోందని, నిర్మాణం మాత్రం ఇప్పటికీ పటిష్టంగానే ఉందని వారు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం వెనక పెద్ద కుట్రే ఉందని, న్యాయం కోసం పేదల తరఫున కోర్టుకు వెళతామని వారంటున్నారు. గుజరాత్‌లోని దహోద్ జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రిని ‘ప్రభుత్వం–ప్రైవేటు భాగస్వామ్యం’ కింద ఫార్మాస్యూటికల్ కంపెనీ జైడస్ కెడిల్లాకు 2017, అక్టోబర్‌లో అప్పగించారు. అప్పటి నుంచి అక్కడ పేదలకు ఉచిత వైద్యం కరవైంది. అదే తరహాలో అన్ని హంగులతో నిర్మించిన కొత్త ఆస్పత్రిని కూడా కార్పొరేట్ కంపెనీకి అప్పగించవచ్చని చినాయ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
సీఆర్డీఏ పరిధిలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి
తిరుపతి : గుంటూరు, విజయవాడ నగరాల (కొత్త రాజధాని) మధ్య ఆధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ (ఈఎస్ఐ) ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రిని మంత్రి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ ఈఎస్ఐ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో అవసాన దశలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రిని 200 పడకలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విజయనగరంలో అసంఘటిత రంగ కార్మికులు అధికంగా ఉన్నారని, వీరి సౌకర్యార్థం అక్కడున్న ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలుగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రిని సైతం 100 పడకలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, వృత్తి విద్యా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి 5 కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
వైద్యం అంటేనే సేవ..