సీతంపేట : వెసవి సెలవుల తరువాత కొత్త విద్యా సంవత్సరం ఆరంభమై సుమారు రెండు నెలలు కావస్తున్నా ఐటీడీఏ పరిధిలో ఉన్న జీపీఎస్ (గిరిజన ప్రాథమిక పాఠశాలలు) నేటికీ తెరుచుకోలేదు. దీంతో ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులు డ్రాపౌట్లుగా మారుతున్నారు. ఉపాధ్యాయుల కొరతతోనే పాఠశాలలు తెరుచుకోలేదని ప్రధాన కారణంగా ఐటీడీఏ యంత్రాగం చెబుతుంది. సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, మందస తదితర మండలాల పరిధిలో 50 వరకు జీపీఎస్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చాలా పాఠశాలలు ఇంకా తెరుచుకోనట్టు సమాచారం.
దీంతో సమారు 600 మంది వరకు విద్యార్థులకు చదువుల్లేని పరిస్థితి నెలకుంది. ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు చెందిన విద్యార్థులు పక్క గ్రామంలోని బడికి వెళ్తున్నట్టు అధికారులు చెబుతున్నా.. వాస్తవంగా అవి కార్యరూపం దాల్చడం లేదు. సీతంపేట ఏజెన్సీలో అత్యధికంగా 20 వరకు జీపీఎస్ బడులు పనిచేయడం లేదు. ఎస్.కొత్తగూడ, వై.ద్వారబందం, నెల్లిగండి తదితర గ్రామాల్లో పాఠశాలలు తెరుచుకోలేదని, దీంతో తమ పిల్లల చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఉపాధ్యాయులు లేని చోట గతంలో విద్యావలంటీర్ల ద్వారా పాఠశాలలను నడిపించే వారు. ఇప్పుడు ఆ పోస్టులు మంజూరు చేయకపోవడంతో ఐటీడీఏ అధికారులు చేతులెత్తే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఐటీడీఏ డిప్యూటీ ఈవో వి.మల్లయ్య వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పాఠశాలలు నడపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై వేశామన్నారు.
తెరుచుకోని గిరిజన పాఠశాలలు!
Published Sat, Jul 11 2015 4:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM
Advertisement
Advertisement