చిరంజీవితో వాగ్వాదం చేస్తున్న ఎంపీటీసీ సభ్యులు రామారావు, కృష్ణ, గ్రామస్తులు
కొయ్యూరు(పాడేరు): అటవీ అధికారుల తీరుపై గిరిజనుల్లో ఆగ్రహం కట్టలు తె చ్చుకుంది. తమ ప్రాణాలు కాపాడేందుకు వేస్తున్న రోడ్డు పనులు ఆపుతారా అంటూ అధికారులపై తిరుగుబాటు చేశారు. రెవెన్యూ భూమిలో రోడ్డు పనులు చేస్తున్న జేసీబీతో పాటు ఇతర వాహనాలను అడ్డుకుని, వాటి తాళాల ను అటవీ అధికారులు శుక్రవా రం బలవంతంగా తీసుకోవడంతో ఆగ్రహించిన గిరిజనులు వారిపై తిరగబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యూరు మం డలంలో దొడ్డవరం నుంచి బూదరాళ్ల పంచాయతీ ముకుడుపల్లికి వెళ్లే రహదారి పనులను నాలుగు నెలల కిందట చేపట్టారు. సాకులపాలెం, చౌడుపల్లి, భలబద్రం, లూసం, ముకుడుపల్లి, నూకరాయికోట గ్రామస్తులు ఉపయోగపడే 17 కిలోమీటర్ల పొడవైన రోడ్డు పనులు జరుగుతున్నాయి. పీఎంజీఎస్‌వైలో నాలుగు సంవత్సరాల కిందట పీఎంజీఎస్‌వైలో రూ.8.25 కోట్ల నిధులు మంజూరైనా, పనులు జరగలేదు. తీరా ఇప్పుడు పనులు జరుగుతుండగా రిజర్వ్‌ఫారెస్ట్‌లో పనులు జరుగుతున్నాయని భావించిన కొయ్యూరు సెక్షన్ అధికారి చిరంజీవి, ఎఫ్‌బీవోలు గంగరాజు,సన్యాసిరావు శుక్రవారం లూసం వెళ్లి పనులు చేస్తున్న జేసీబీ తాళాలు తీసుకున్నారు.
పనులు ఆపి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఇతర సిబ్బందిని బెదిరించారు. సమాచారం తెలుసుకున్నచౌడుపల్లి,సాకులపాలెం గ్రామస్తులు దొడ్డవరం సమీపంలోకి వచ్చారు. రెవెన్యూ భూమిలో పనులు చేస్తున్న వాహనాల తాళాల ను ఎలా తీసుకుంటారని అటవీ సిబ్బందిని ప్రశ్నించారు. మావోయిస్టులను ఎదిరించాం, వారు వాహనాలను ఏమైనా చేస్తారని పనులు చేస్తున్న సమయంలో రోజూ 50 మంది రాత్రి వేళల్లో ఇక్కడే పడుకుంటున్నాం. రోడ్డు వస్తే వైద్య సౌకర్యం అందుబాటులోకి వచ్చి మా ప్రాణాలు నిలుస్తాయి, ఇప్పుడు అటవీ అధికా రులు రిజర్వ్ పారెస్టు పేరుతో పనులను ఆపాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
తమతో పాటు గ్రామంలోకి బలవంతంగా తీసుకుపోతామని స్పష్టం చేశారు. సుమారు గంటన్నర పాటు వాగ్వాదం, తోపులాట జరిగాయి. రోడ్డు జోలికి రాబోమని, ఆగిపోతే మాదే బాధ్యత అని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపిస్తామని బూదరాళ్ల ఎంపీటీసీ సభ్యులు రామారావు, కృష్ణతో పాటు రెండు గ్రామాలకు చెందిన యువకులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఎఫ్‌ఎస్‌వో చిరంజీవి రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో వారిని వదిలిపెట్టారు.దీనిపై ప్రాజక్ట్ ఏఈ ఈశ్వరరావు మాట్లాడుతూ చాలా వరకు సమస్య పరిష్కారం అయిందన్నారు.అనుమతులు వచ్చేస్తాయని చెప్పారు.
రోడ్డు పనులు అడ్డుకోవడం తప్పే
రెవెన్యూ భూమిలో రోడ్డుపనులు చేస్తున్నప్పుడు మా సిబ్బంది వెళ్లి అడ్డుకోవడం తప్పు. పనులు రిజర్వ్‌ఫారెస్ట్‌లో జరుగుతున్నాయా లేకుంటే రెవెన్యూలో జరుగుతున్నాయో చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంది. త్వరలో ఆ రోడ్డుకు అనుమతులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు- షఫీ,కృష్ణాదేవిపేట రేంజర్
Comments
Please login to add a commentAdd a comment