'అప్పు చెల్లించలేదన్న అక్కసుతోనే హత్యలు' | Triple murder case: Killed by kin for not repaying debt | Sakshi
Sakshi News home page

'అప్పు చెల్లించలేదన్న అక్కసుతోనే హత్యలు'

Published Mon, Nov 4 2013 3:04 PM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

Triple murder case: Killed by kin for not repaying debt

విశాఖ : కేవలం అప్పు చెల్లించలేదన్న అక్కసుతోనే మేనమామ తమపై హత్యాయత్నం చేశాడని  ప్రాణాలతో బయటపడ్డ మంత్రి గణేష్ తెలిపారు. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విశాఖ శివారు పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలో   ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణహత్యకు గురయిన విషయం తెలిసిందే.   అయితే  ఈ దారుణ కాండలో తండ్రి, తాతయ్య, నానమ్మలను కోల్పోయిన విషయాన్ని పోలీసులు గణేష్కు తెలియనివ్వలేదు.

ఇంటర్ చదువుతున్న గణేష్ తన మేనమామ అసిరి నాయుడు మొదటి నుంచి మూర్ఖంగా ప్రవర్తించేవాడిని తెలిపాడు.  దీపావళి రోజున తనను సరదాగా ఆటాడుకుందామంటూ రెండుకాళ్ళను తాళ్లతో బంధించి, ముఖానికి కవర్తో ముసుగు తొడిగి రాడ్తో దాడి చేసినట్లు చెప్పాడు. అయితే అతని నుంచి తప్పించుకున్న తాను బంధువుల సాయంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపాడు.

వివరాల్లోకి వెళితే రాజమండ్రి సమీపంలోని ద్వారపూడి అన్నదేవరపేటకు చెందిన మంత్రి సన్యాసిరావు(70), ఎల్లమ్మ(65) దంపతులతో పాటు కుమారుడు మంత్రి సాంబ(37) ఎనిమిదేళ్ల క్రితం చినముషిడివాడలోని క్రాంతినగర్‌కు వలస వచ్చారు. సన్యాసిరావు, ఎల్లమ్మ దంపతుల అల్లుడు పల్లాడ అసిరినాయుడు వీరికి రూ.50వేలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలంగా బాకీ విషయంలో, అలాగే అన్నదేవరపేటలోని ఆస్తిపై వివాదాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సన్యాసిరావు కుటుంబ సభ్యులతో అసిరినాయుడు వివాదానికి దిగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ ముగ్గురిపై ఇనపరాడ్డుతో దాడికి దిగడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను ఇంటి పడక గదిలో గుట్టగా పడేసి ఏమీ తెలియనట్టు ఉన్నాడు. మధ్యాహ్నం సాంబ కుమారుడు గణేష్ కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు.
 
 అసిరినాయుడే అతడికి భోజనం పెట్టాడు. కాసేపటి తరువాత దొంగ, పోలీస్ ఆట ఆడుకుందాం అంటూ చేతులు వెనక్కికట్టి గోనెసంచిలో పెట్టి మూశాడు. అనంతరం ఇనుపరాడ్డుతో దాడికి దిగడంతో భీతిల్లిన గణేష్ అక్కడ నుంచి తప్పించుకుని బయటకు పరుగు తీశాడు. అనంతరం స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేరాడు. కాగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement